nagidream
దాదాపు 500 ఏళ్లుగా అయోధ్య రామ మందిరం కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. జనవరి 22తో ఆ కల సాకారం అయ్యింది. అయితే అయోధ్య రామ మందిర కల సాకారం వెనుక ఒక ముస్లిం వ్యక్తి కృషి దాగి ఉంది. ఆయన చేసిన కృషి మరువలేనిది. మరి ఆయన ఎవరో, ఆయన చేసిన కృషి ఏంటో తెలుసుకోండి.
దాదాపు 500 ఏళ్లుగా అయోధ్య రామ మందిరం కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. జనవరి 22తో ఆ కల సాకారం అయ్యింది. అయితే అయోధ్య రామ మందిర కల సాకారం వెనుక ఒక ముస్లిం వ్యక్తి కృషి దాగి ఉంది. ఆయన చేసిన కృషి మరువలేనిది. మరి ఆయన ఎవరో, ఆయన చేసిన కృషి ఏంటో తెలుసుకోండి.
nagidream
అయోధ్య రామ మందిరం.. రామ జన్మభూమి.. ఆ రాముడి జన్మించిన స్థలం.. 500 ఏళ్ల హిందువుల కల. ఆ భూమ్మీద మందిరం నిర్మించాలనేది హిందువుల స్వప్నం. ఎంతోమంది పోరాటాలు, ప్రాణ త్యాగాలు, బలిదానాల అనంతరం 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో న్యాయం జరిగింది. 2024 జనవరి 22తో 500 ఏళ్ల నాటి కల సాకారమైంది. ఎట్టకేలకు రామ జన్మ భూమి స్థలంలో అడుగు పడింది. అయితే అయోధ్య రామ మందిర సాకారం కోసం కేవలం హిందువుల కృషి ఫలితమే కాదు.. ఒక ముస్లిం వ్యక్తి కృషి కూడా ఉంది. ఆ ముస్లిం వ్యక్తి నిజాయితీనే.. ఇవాళ మన అయోధ్య రామ మందిర కల సాకారానికి కారణమైంది. ఆయన మరెవరో కాదు.. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త కె.కె. మహ్మద్.
ఈయన మరియు ఈయన బృందం మొదటిసారిగా 1976లో ఆలయ శిథిలాలను కనుగొన్నారు. 1976లో బాబ్రీ మసీదు స్థలంలో తవ్వకాలు జరిపిన బృందంలో ఈయన కూడా ఉన్నారు. ఈయన పూర్తి పేరు కరీంగమన్ను కుజియిల్ మహమ్మద్. ఈయన కేరళలోని కాలికట్ లోని కోడువల్లి గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈయన ఐదుగురు సంతానంలో రెండవ వ్యక్తి. గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివిన తర్వాత అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత స్కూల్ ఆఫ్ ఆర్కియాలజీ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి డిప్లోమా పూర్తి చేశారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ కాకముందు.. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో హిస్టరీ డిపార్ట్మెంట్ లో టెక్నికల్ అసిస్టెంట్ గా.. ఆ తర్వాత అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ గా సేవలను అందించారు.
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ గా చేసిన తర్వాత.. సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ సహా పలు ఉన్నతమైన పదవుల్లో కొనసాగారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా పని చేశారు. ముఖ్యంగా బరాక్ ఒబామా, పర్వేజ్ ముషారఫ్ వంటి ప్రముఖులకు టూర్ గైడ్ గా కూడా పని చేశారు. 2012లో కెకె మహ్మద్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో రీజనల్ డైరెక్టర్ గా అపాయింట్ అయ్యారు. అయితే అదే ఏడాదిలో ఆయన రిటైర్ అయ్యారు. 2008లో ఢిల్లీ సర్కిల్ కి సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ గా నియమితులయ్యారు. 2010 కామన్వెల్త్ గేమ్స్ కోసం 46 స్మారక చిహ్నాలను పునరుద్ధరించడం ఈయన ప్రధాన లక్ష్యం. ఈయన అనేక బౌద్ధ స్తూపాలు, స్మారక కట్టడాలు సహా ఇబాదత్ ఖానాను కనుగొన్న శాస్త్రవేత్తగా ఘనత సాధించారు. పురావస్తు శాస్త్రానికి ఈయన అందించిన సేవలకు గాను 2019లో దేశంలోనే నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మశ్రీ పురస్కారం లభించింది.
ఈయన జీవితంలో ఉన్నత శిఖరాలే కాదు అనేక విమర్శలు కూడా ఉన్నాయి. 2016లో కె కె మహ్మద్ యొక్క న్జాన్ ఎన్న భారతీయన్ అనే మలయాళం ఆటోబయోగ్రఫీ విడుదలైంది. ఆ సమయంలో ఇర్ఫాన్ హబీబ్ అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని వ్యతిరేకించారు. మసీదు పశ్చిమ భాగంలో గుర్జర ప్రతిహార రాజ వంశీయులచే 10వ మరియు 11వ శతాబ్దంలో నిర్మించబడిన ఆలయానికి సంబంధించిన అవశేషాలను కేకే మహ్మద్ గుర్తించారు. అయితే తాను కనుగొన్న ఈ ఆధారాల వల్ల మార్క్సిస్టు చరిత్రకారుడైన ఇర్ఫాన్ హబీబ్ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నానని అన్నారు. ఇర్ఫాన్ హబీబ్.. ఈయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ లో కీలక వ్యక్తి.
మహ్మద్ అప్పట్లో జరిపిన తవ్వకాల్లో అష్టమంగళ చిహ్నంలో అమర్చబడిన 12 స్తంభాలతో ఒక ఆలయ పునాది బయటపడింది. మనుషులు, జంతువులకు సంబందించిన బొమ్మలు ఆలయం ఉనికిని ఊహించడానికి కారణమైంది. ఈయన జరిపిన పరిశోధనలో అయోధ్య స్థలంలో దేవాలయం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ బాబ్రీ మసీదు, అయోధ్య వివాద సమయంలో చరిత్రకారుడైన ఇర్ఫాన్ హబీబ్ అలహాబాద్ హైకోర్టును తప్పుదోవ పట్టించారని అప్పట్లో కేకే మహ్మద్ ఆరోపించారు. బాబ్రీ మసీదు, అయోధ్య వివాద స్థలాన్ని హిందువులకు మర్యాదపూర్వకంగా అప్పజెప్పాలని ఈయన ముస్లిం సంఘానికి సూచించారు. ముస్లింలు మసీదు ఎక్కడైనా నిర్మించుకోవచ్చునని, మసీదులు నిర్మించిన ప్రదేశాల పట్ల ముస్లింలకు సెంటిమెంట్స్ లేవని అన్నారు.
ఆ స్థలాన్ని రామజన్మభూమిగా విశ్వసిస్తున్న హిందువులకు ఇవ్వడమే న్యాయమని అప్పట్లో ఆయన అన్నారు. రాముడు జన్మ స్థలంగా హిందువులకు ఒక అటాచ్ మెంట్ ఉందని.. వారికి అప్పజెప్పాలని అన్నారు. అంతేకాదు.. మధుర, జ్ఞానవాపి మసీదులను కూడా హిందువులకు అప్పజెప్పాలని కెకె మహ్మద్ అన్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయన ఎంతో నిజాయితీగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు. ఈయన కృషి కూడా లేకపోతే కనుక అయోధ్య రామ మందిరం హిందువులకు దక్కేది కాదేమో. కాబట్టి 500 ఏళ్ల అయోధ్య రామ మందిర కల సాకారం వెనుక ఈయన కృషి కూడా మరువలేనిది. ఈ సందర్భంగా ఆయనకు హిందువులు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి.
ఇవి కూడా చదవండి: