ఈ చిట్కాలతో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టండి

వర్షాకాలం వచ్చిందంటే.. ఏదో ఒక సమయంలో తడిసి ముద్ద కావాల్సిందే. దీంతో సీజనల్ వ్యాధులు పలకరిస్తాయి. ఫీవర్స్, జలుబు, దగ్గు, ఆయాసం వంటివి వచ్చి చేరుతుంటాయి. మరీ ఇవి రాకముందు.. వచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..?

వర్షాకాలం వచ్చిందంటే.. ఏదో ఒక సమయంలో తడిసి ముద్ద కావాల్సిందే. దీంతో సీజనల్ వ్యాధులు పలకరిస్తాయి. ఫీవర్స్, జలుబు, దగ్గు, ఆయాసం వంటివి వచ్చి చేరుతుంటాయి. మరీ ఇవి రాకముందు.. వచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..?

రెయినీ సీజన్ మొదలైంది కదా.. ‘జల్లంత కవ్వింత కావాలిలే.. ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే’ అంటూ వర్షంలో తడుస్తున్నారా..? ఆ వెంటనే తోవ వెతుక్కుంటూ వచ్చేస్తాయి సీజనల్ వ్యాధులు. వైరస్, బ్యాక్టీరియా, ఇతర ఇన్ ఫెక్షన్స్.. మన ఇంటిని, ఒంటిని ఇన్ స్పెక్షన్ చేసేందుకు ఎంట్రీ ఇచ్చేస్తుంటాయి. ఇక ఏముంది జలుబు, జ్వరం. ఈ రెండు వచ్చాయంటే దగ్గు కూడా రావాలిగా.. అది కూడా క్యూ కడుతుంది. వీటికి తోడు దొమలనే బంధువులు రయ్ రయ్ మంటూ.. రెక్క విప్పుకుంటూ దూసుకొచ్చేస్తాయి. ఇంకేముంది మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వాటికి ఆనవాలం అయిపోతుంది శరీరం. ఇక కలుషిత నీరు తాగడం వల్ల మిగిలిపోయిన ఆ టైఫాయిడ్ కూడా వచ్చి చేరుతుంది. ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతుంటాయి. అయితే వీటి బారిన పడక ముందు, పడ్డాక తప్పించుకునేందుకు అనేక మార్గాలున్నాయి.

ఫీవర్స్, వైరల్ ఫీవర్స్.. అరికట్టండిలా

వర్షాకాలంలో ప్రతి ఇంటిలో ఒక్కరైనా సరే ఈ జ్వరాల బారిన పడాల్సిందే. చిన్న పెద్దా అని తేడాలేకుండా వైరల్ ఫీవర్స్ మనిషిని బలహీనపరుస్తాయి. తట్టుకోలేనంత చలి, రెండు మూడు రోజులైనా తగ్గని జ్వరం. డాక్టర్ విజిట్ అయినా, మందులు, మాకులకు కూడా తగ్గని ఫీవర్ ఇది. కుటుంబం మొత్తాన్ని వణికించేస్తుంది. ఇక చికెన్ గున్యా వస్తే కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెట్టేస్తాయి. విపరీతమైన పెయిన్ ఉండిపోతుంది. వీటన్నిటికీ తోడు జలుబు ఎటాక్ అయితే.. ఇక నిద్రపోనియదు, నించోనీయదు. ఇక దగ్గు అయితే నలుగురిలోకి వెళ్లలేని పరిస్థితి. కల్ కల్ మంటూ దగ్గుతుంటే.. మనకే కాదు.. ఎదుట ఉన్న వ్యక్తులు కూడా అసహనంగా ఫీల్ అవుతుంటారు. ఆయాసం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఇక డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వస్తే చెప్పనక్కర్లేదు.. వారాల తరబడి ఉండిపోతుంది. వీటన్నింటికి చక్కట పరిష్కార మార్గాలు ఉన్నాయి

తొలుత నీరు నిల్వ చేయకుండా ఉండాలి. ఒక వేళ నిల్వ చేయాల్సి వస్తే.. నీటిని మారుస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. అలాగే ఆరోగ్యాన్ని చేకూర్చే ఆహార పదార్థలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీళ్లను తాగుతుండాలి. అలాగే ఐరన్, కాల్షియం, పీచు,కొవ్వు, కార్బొహైడ్రెట్స్ పుష్కలంగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. వేడి పదార్ధాలను తినాలి. అలాగే వంటింట్లో లభించే సొంటి, మిరియాల, ధనియాలు, జీలకర్ర వంటి పదార్థాలతో కషాయం కాసుకుని తాగుతుండాలి. పూర్తిగా బయట ఆహార పదార్ధాలను మానుకోవడం మంచిది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. వ్యాధి నిరోధక శక్తి పెంచే ఫుడ్ తీసుకోవడం అత్యుత్తమం. అలాగే చిన్న పిల్లల విషయంలో మరింత కేరింగ్‌గా ఉండాలి. తొలుత ఈ ఇన్ఫెక్షన్లకు గురయ్యేది వీళ్లే. కాబట్టి వైద్యుల సలహాలు తీసుకుంటూ..శక్తివంతమైన ఫుడ్ అందిస్తూ ఉండాలి.

టైఫాయిడ్‌ను నివారించండిలా

టైఫాయిడ్ జ్వరం అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కలుషిత నీరు వల్ల ఈ వ్యాధి సోకుతుంది. టైఫాయిడ్ వల్ల తీవ్రమైన జ్వరం, తలనొప్పి, అలసట, శరీర నొప్పులు, మలబద్దకం లేదా అతిసార వ్యాధులు వస్తాయి. టైఫాయిడ్‌కు మందులు వాడటమే కాదు.. ఆహారంలో మార్పులు కూడా సరైన మార్గం. టైఫాయిడ్‌ బారిన పడ్డప్పుడు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు ఉన్న ఆహారాలు శరీరానికి మేలు చేస్తాయి. గంజి, ఉడకబెట్టిన బంగాళాదుంపలు, చికెన్ సూప్, పుట్టగొడుగులు, మెత్తగాచేసుకున్న మజ్జిగ రైస్ వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. అరటి, యాపిల్, బొప్పాయి, యాపిల్ వంటి పండ్లు టైఫాయిడ్‌లో తినడం మంచిది. అలాగే కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, హెర్టల్ టీ వంటివి కూడా తీసుకుంటే.. మంచి ఉపశమనం లభిస్తుంది. బ్రకోలీ, బాదం పిస్తా,వాల్ నట్స్, ఎండు కివి, గుమ్మడి, అవిసె, చిక్కుళ్లు, మసాలా పదార్థలు తినకపోవడమే మేలు. వీటితో పాటు వంటింట్లో ఉండే ఔషధ గుణాలు కలిగిన అల్లం, మిరియాలు, జీలకర్ర, సొంటి,  చెక్క, లవంగం వంటి వాటిని ఆహారంలో మిళితం చేసుకోండి.  ఈ చిన్న చిట్కాలతో సీజన్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.

Show comments