Krishna Kowshik
ఈ మొక్కను ఎప్పుడో కప్పుడు చూసుంటారు. కానీ దీని పేరు ఏంటో తెలియదు కదా. రోడ్డు పక్కన, పొలాల్లో, చెరువు గట్లపై పెరిగే ఈ మొక్క పేరు రెడ్డివారి నానబాలు అని పిలుస్తుంటారు. పిచ్చి మొక్కలా ఉంటే.. దీనితో సంతానం సమస్యలకు చెక్ పెట్టొచ్చని తెలుసా..?
ఈ మొక్కను ఎప్పుడో కప్పుడు చూసుంటారు. కానీ దీని పేరు ఏంటో తెలియదు కదా. రోడ్డు పక్కన, పొలాల్లో, చెరువు గట్లపై పెరిగే ఈ మొక్క పేరు రెడ్డివారి నానబాలు అని పిలుస్తుంటారు. పిచ్చి మొక్కలా ఉంటే.. దీనితో సంతానం సమస్యలకు చెక్ పెట్టొచ్చని తెలుసా..?
Krishna Kowshik
పిచ్చి మొక్కలని భావించే ఎన్నో మొక్కలు.. ఆయుర్వేదంలో సిద్ధ మూలికలుగా ఉపయోగపడుతున్నాయి. అందులో ఒకటి రెడ్డివారి నానబాలు/ నానుబాలు. వినడానికి వింతగా ఈ ప్లాంట్‌లో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో రహస్య శక్తులు ఉన్నాయంటే నమ్ముతారా..? నిజమేమరీ. నిత్యం ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటాయి ఈ మొక్కలు. గడ్డి మధ్యలో పెరుగతూ..చిన్న చిన్న పుష్పాలు పూస్తుంటాయి. ఈ మొక్కనే పాలకాడ, నాగార్జుని అని కూడా పిలుస్తుంటారు. ఈ మధ్య టాటూల కల్చర్ విపరీతంగా నడుస్తుంది. ఇప్పుడు వివిధ కెమికల్స్ వినియోగించి టాటూస్ వేస్తుంటారు. కానీ ఒకప్పుడు పచ్చబొట్టును వేసేందుకు ఈ ఆకు రసాన్ని వినియోగించే వారట. అందుకే దీనికి పచ్చబొట్టాకు అని కూడా పేరు.
రెడ్డి వారి నానుబాలు వెనుక ఎన్నో కథలు ఎలా ఉన్నా.. దీని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం పుష్కలమని చెప్పొచ్చు. ఈ ఆకు రసాన్ని సేవించడం వల్ల.. అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్కను అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. మొక్క ఆకుల రసాన్ని లేదా ఆకుల కషాయాన్ని పరిమిత మోతాదులో తీసుకుంటే మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. ఇక ఈ మొక్కను తుంపినప్పుడు వచ్చే పాలను కంటిలో వేసుకోవడం వల్ల కంటిలో ఉండే కురుపు, మలినాలు తొలగిపోతాయి. అలాగే కణతల,సెగడ్డలు మీద కూడా రాసుకున్నా వాపు తగ్గుముఖం పడుతుంది. ఈ ఆకు రసాన్ని తాగితే.. ఉబ్బసం వంటి శ్వాస కోశ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
ఈ మొక్కలో యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్ వంటి సహజ సిద్ధమైన లక్షణాలు ఉండటం వల్ల.. రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. మహిళలకు, పురుషులకు ఈ మొక్క ఓ వరం అని చెప్పాలి. మహిళల్లో పీరియడ్స్ సమయంలో కడుపునొప్పితో సహా ఏర్పడే ఎన్నో సమస్యలను తొలగిపోయి.. గర్భాశయ దోషాలు తొలగిపోయి.. సంతానం కలుగుతుంది. రోజు ఈ ఆకు రసాన్ని, మిరియాల పొడితో కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఈ పొడిని తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య మెరుగుపడతాయి. రెడ్డి వారి నానబాలు మొక్క ఆకులను ఏదైనా కూరలో వేసి వండుకుని తింటూ ఉండడం వల్ల రక్త మొలలు తగ్గుతాయి. ఈ ఆకులను పప్పులో వేసుకుని తింటే బాలింతల్లో పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది.
ఇవే కాదు చర్మ సంబంధిత ఇష్యూస్‌ను నివారిస్తుంది ఈ ఆకు. పిప్పి పన్ను సమస్యతో బాధపడే వారు రెడ్డి వారు నానుబాలు మొక్క వేరును నీటితో కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని పిప్పి పన్నుపై ఉంచడం వల్ల పోటు తగ్గుతుంది. ఈ మొక్క రసానికి పంచదారను కలిపి తీసుకోవడం వల్ల నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. ఈ ఆకు రసాన్ని తీసుకుంటే.. రక్త కణాలు వృద్ధి చెందుతాయి. నిత్యం కషాయంగా తీసుకుంటే.. ఒత్తిడి, ఆందోళన తగ్గి, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. నోటిపూత వంటి వాటికి కూడా మంచి మందుగా పనిచేస్తుంది ఈ రెడ్డి వారి నాను బాలు. చూడటానికి కలుపు మొక్కలా ఉంటే.. ఈ మొక్కలో ఎన్నో రోగాలను, వ్యాధులను తరిమికొట్టే ఔషధ గుణాలున్నాయి. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చింది. దీన్ని ఐడ్రీమ్ నిర్ధారించలేదు.