కొండపిండి ఆకు.. కిడ్నీలో రాళ్లను పిండి చేసేస్తుంది

ఈ మధ్య చాలా మంది జంక్ ఫుడ్స్ తింటుంటారు. దీని వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. వాటిల్లో ఒకటి కిడ్నీలో రాళ్లు. దీంతో రోగాలు వచ్చి చేరుతున్నాయి. డాక్టర్లకు డబ్బులు పోసి మందులు తెచ్చుకుంటున్నా ఒక్కొక్కసారి ఉపయోగం ఉండదు. అలాంటి వారికి దివ్య ఔషధం కొండపిండి మొక్క.

ఈ మధ్య చాలా మంది జంక్ ఫుడ్స్ తింటుంటారు. దీని వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. వాటిల్లో ఒకటి కిడ్నీలో రాళ్లు. దీంతో రోగాలు వచ్చి చేరుతున్నాయి. డాక్టర్లకు డబ్బులు పోసి మందులు తెచ్చుకుంటున్నా ఒక్కొక్కసారి ఉపయోగం ఉండదు. అలాంటి వారికి దివ్య ఔషధం కొండపిండి మొక్క.

సాధారణంగా నాలుగు రాళ్లు వెనకేసుకోండి అంటుంటారు పెద్దలు. కానీ మనం చాలా వరకు కిడ్నీలో వేసుకుంటూ ఉంటాం. యాసిడ్ అండ్ సాల్టీ ఫుడ్స్, మంచి నీళ్లు తక్కువ తాగడంతో బయటకు వెళ్లాల్సిన లవణాలు రాళ్లగా ఏర్పడి ఇబ్బంది పెడతాయి. మూత్రనాళ సమస్యలతో పాటు ఇతర హెల్త్ ఇష్యూస్ వచ్చి చేరతాయి. చివరకు వైద్యుడి దగ్గరకు వెళ్లినా ..టెంపరరీ మెడిసన్ ఇస్తారు. అలాగే నీళ్లు ఎక్కువ తాగాలని సూచిస్తుంటారు. అదీ సాధ్యపడకపోతే ఆపరేషన్ చేసి తొలగించాల్సిన పరిస్థితి. ఇది ఎంతో పెయిన్ ఫుల్ అండ్ ఖర్చుతో కూడుకున్నది. ఈ సమస్యను సాల్వ్ చేసుకునేందుకు డబ్బులు పెట్టేందుకు ఇష్టపడుతున్నాం కానీ.. కిడ్నీలో రాళ్లను ఇట్టే కరిగించే మొక్కను మన ఇంటి ముందు, మన కళ్ల ముందు ఉంటే గుర్తించలేకపోతున్నాం. అదే కొండపిండి మొక్క. కొండల్ని సైతం పిండి చేయగలదన్న అర్థంతో వచ్చిందే ఈ ఔషధ మొక్క.

తెలంగాణలో పిండి కూర అని కూడా పిలుస్తుంటారు. కొండ పిండి ఆకులో ఉండే పాలి ఫినాల్స్ యూరిన్ సజావుగా అయ్యేందుకు సహకరిస్తాయి. దీంతో కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కేవలం కిడ్నీ సమస్యలే కాదు.. ఇంకా ఎన్నో రోగాలను నయం చేసే ఆయుర్వేద గని ఈ మొక్క. చిట్టి చిట్టి ఆకులతో, తెల్లటి పూలతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వీటిని కూర, పచ్చడి లేదా రసంలా తీసుకుని వినియోగిస్తే ఎన్నో ఫలితాలు ఉన్నాయి. ఈ ఆకు కూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. దీనినే పాషాణ బేధి అని కూడా పిలుస్తారు. ఇందులో నీటిశాతం తక్కువ ఉండి పీచు ఎక్కువగా ఉంటుంది. ఒంటికి నీరు పట్టి ఇబ్బంది పడుతున్న వాళ్లకు దివ్య ఔషధం ఇది. ఇది యూరిన్ అవుట్ పుట్ సజావుగా సాగేందుకు సహాయపడుతుంది. అంతే కాదు కిడ్నీలో ఉండే 5-6 ఎంఎం వరకు ఉండే రాళ్లను కరిగించే శక్తి దీనికి ఉంది.

కొండపిండి ఆకుకు రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంటుంది. శరీరంలోని అన్ని ఆర్గాన్స్ పనిచేసేలా చేస్తుంది. దీని వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. అంతేకాదు యాంటీ బ్యాకర్టీయల్ లక్షణాలు ఈ కొండపిండి ఆకులో పుష్కలంగా ఉన్నాయి. లివర్ డీటాక్సిఫికేషన్ చేసే సామర్థ్యం కూడా ఉంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ లివర్ సెల్స్ ను రక్షించి.. కాలేయ పనితీరు సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఈ ఆకు కూరను ఏదో ఒక రూపంలో నిత్యం తీసుకుంటే.. కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే చిన్నా పెద్దా తేడా లేకుండా వస్తున్న వ్యాధి షుగర్. దీన్ని బాగా కంట్రోల్ చేస్తుంది కొండపిండి ఆకు. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి మధుమేహ వ్యాధిని దూరం చేస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇక చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఫైల్స్. నిత్యం ఈ ఆకు రసం తీసి తాగితే ఫైల్స్ సమస్య ఇట్టే తగ్గిపోతుంది.

తలనొప్పితో బాధపడే వారు ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి నుదుటికి పట్టులా వేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అలాగే లంగ్స్ పై కూడా పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇందులో ఉండే సిలిసిక్ యాసిడ్.. ఊపిరితిత్తులో కనెక్టివ్ డిష్యూస్ డ్యామేజీని అరికడుతుంది. దీంతో కఫం చేరకుండా అడ్డుకుంటుంది. దీని వల్ల శ్వాస కోశ సంబంధిత సమస్యలు దరి చేరవు. ఇది పల్లెటూర్లలో దొరకుతుంది.. పట్నం వాళ్ల పరిస్థితి ఏంటీ అనుకుంటున్నారా.. ఈ మధ్య కాలంలో కూరగాయల మార్కెట్లలో విరివిగానే లభిస్తుంది. పోనీ అదీ సాధ్యం కాదు.. తినలేం అనుకుంటే.. పొడి రూపంలో కూడా లభ్యమౌతుంది. ప్రతి రోజు కొంత పౌడర్ మరిగించుకుని వడకట్టి.. తేనెతో కలిపి తీసుకోవచ్చు. అలాగే ఈ ఆకులను కూరలో, పప్పుగా, పచ్చడిగా చేసుకుని తిన్నా మంచి ఫలితం ఉంటుంది.

Show comments