P Krishna
Western Toilets: దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పాశ్చ్యాత కల్చర్ కనిపిస్తుంది. టాయిలెట్స్ విషయంలో కూడా ఇదే.. చాలామంది తమ ఇండ్లల్లో వెస్ట్రన్ టాయిలెట్స్ నే ఎక్కువగా వాడుతున్నారు.
Western Toilets: దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పాశ్చ్యాత కల్చర్ కనిపిస్తుంది. టాయిలెట్స్ విషయంలో కూడా ఇదే.. చాలామంది తమ ఇండ్లల్లో వెస్ట్రన్ టాయిలెట్స్ నే ఎక్కువగా వాడుతున్నారు.
P Krishna
పట్టణాల్లో జనాభా రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఖాళీ ప్రదేశాలు అనేవే లేకుండా పోతున్నాయి.దేశంలో అపార్ట్‌మెంట్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఇండ్లల్లో మరుగుదొడ్లు ఉండేవి కావు బయటకు వెళ్లే వారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది.. ప్రతి ఇంట్లో టాయిలెట్స్ కామన్ అయ్యాయి. కొన్ని ఇండియన్ స్టైల్ అయితే మరికొన్ని వెస్ట్రన్ స్టైల్. సాధారణంగా ఆఫీసులు, మాల్స్, కార్పోరేట్ విద్యాసంస్థలు, హిస్పిటల్స్ పలు చోట్ల ఎక్కువగా వెస్ట్రన్ స్టైల్ టాయిటెల్స్ వాడుతున్నారు. టాయిలెట్‌లో వాడే ఫ్లష్ మీట నొక్కితో నీళ్లు వస్తాయని తెలుసు..కానీ దానితో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయన్న విషయం మీకు తెలుసా? దీని వెనుక ఉన్న అసలు విషయం ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.
ఫ్లష్ తో వచ్చే ప్రమాదాలు :
ప్రస్తుతం ఎక్కడ చూసినా వెస్ట్రన్ టాయిలెట్స్ వాడుతున్నారు. మారుతున్న జీవనశైలికి తగ్గట్టుగా మార్పులు వస్తున్నాయి. చాలా మందికి టాయిలెట్ వెళ్లాక ఫ్లష్ నొక్కి తమ పని అయ్యిందని బయటకు వస్తారు. ఎవరైనా అనారోగ్యంతో ఉండి టాయిలెట్ లో కాలకృత్యాలు తీర్చుకున్నా, వాంతి చేసుకున్నా.. తెలియకుండానే కొన్ని ప్రమాదకరమైన సూక్ష్మి క్రిములు విడుదల అవుతాయి. ఆ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదాల భారిన పడతారని నిపుణులు అంటున్నారు. మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. బాత్రూమ్ ని కూడా అంతే శుభ్రంగా ఉంచాలని అంటున్నారు. కొన్ని రకాల అనారోగ్యాలకు ఇది కూడా ఒక కారణం కావొచ్చు అంటున్నారు నిపుణులు.
టాయిలెట్ ఫ్లష్ చేయగానే పెద్ద ఎత్తున నీళ్లు తిరుగుతూ.. టాయిలెట్ లోకి వెళ్తాయి. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. టాయిలెట్ ఫ్లష్ చేసిన తర్వాత కొన్ని రకాల వాయులు గాల్లోకి వ్యాపిస్తాయి. దీనిని ‘టాయిలెట్ ఫ్లూమ్’ అని అంటారు. నీళ్లపై పడే ఒత్తిడి కారణంగా ఆ నీటిలో నుంచి సన్నని తేమ కణాలు గాల్లోకి పైకి లేస్తాయి.. వీటిలో ఎరోసోల్ కణాలు ఉంటాయి. ఆ సమయంలో టాయిలెట్ గది మొత్తం వ్యాపిస్తుంది. అలా ఏర్పడే వాయువు వల్ల E coli infections, Norovirus వంటి వ్యాధులు, ఇన్ ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
టాయిలెట్ సీట్ కు ఉండే మూత పెట్టిన తర్వాత.. ఫ్లష్ చేయాలి. ఇలా చేస్తే.. కణాలు పైకి రాకుండా ఉంటాయి. బాక్టీరియా, వైరస్, క్రిములు ఇంటిలోకి వ్యాపించే ఆస్కారం ఉండదు. అనారోగ్య సమస్యల నుంచి దురంగా ఉండొచ్చు. వెస్ట్రన్ టాయిలెట్ లో ఫ్లష్ చేసేప్పుడు తప్పనిసరిగా మూత పెట్టండి. అవసరం అయితేనే మూత తీయాలి. మూత తెరిచే ఉంచడం కూడా కరెక్టు కాదు.కొంతమంది టాయిలెట్ డోర్ కూడా సరిగా వేయరు.. అందువల్ల ఇంట్లోకి కూడా కణాలు విస్తరిస్తాయి. గాలిలోనే ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. కొన్ని సాధారణ పరిశుభ్రత చర్యలతో మీరు మీ ఈ జెర్మ్స్ నుంచి మిమ్మల్ని రక్షించుకోవచ్చు.
టాయిలెట్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి.. ఎప్పుడూ సీట్ కు ఉండే మూత పెట్టి ఉంచాలి. ఫ్లష్ చేసే సమయంలో మూత పెట్టాలి. అవసరం అయితేనే మూత తీయాలి. ఎప్పుడూ మూత తీసి ఉంచడం చాలా డేంజర్. మూత వేసి ఉండటం వల్ల కణాలు బయటకు రావు.. బాక్టీరియా, వైరస్, క్రిములు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇక టాయిలెట్ ఫ్లూమ్ మీ టూత్ బ్రెష్, నేల లేదా మీ టవల్ పై గాల్లోకి ఎగిరిన క్రిములు అంటుకోగలవు. ఫ్లషింగ్ చేసిన ఎనిమిది సెకన్లలోపు క్రిములు గాల్లో దాదాపు ఐదు అడుగుల ఎత్తకు పెరుగుతుంది.. సగటు పెద్ద వారి ముక్కు, నోటి ఎత్తుకు చేరగలవు. బాత్రూమ్ లో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో మూత పెట్టి ఫ్లష్ చేయాలి. చిన్న విషయమే అని నిర్లక్ష్యం చేస్తే పెను ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త!
గమనిక : ఇంటర్నెట్ సమాచారం మేరకు తీసుకున్న అంశం.. పాఠకులకు అవగాహన కోసం అందిస్తున్నాం.. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు వైద్యనిపుణులను సంప్రదించడం మంచిది.