Belly: మీ బొడ్డులో దూది ఏర్పడుతుందా? ఇక అంతే సంగతులు!

Belly: చాలా మంది రోజూ స్నానం చేసినా కూడా బొడ్డులో దూది ఏర్పడుతుంది. ఇది వ్యర్ధాల వల్ల పేరుకుపోతుంది.

Belly: చాలా మంది రోజూ స్నానం చేసినా కూడా బొడ్డులో దూది ఏర్పడుతుంది. ఇది వ్యర్ధాల వల్ల పేరుకుపోతుంది.

చాలా మంది రోజూ శుబ్రంగా స్నానం చేసినా కానీ బొడ్డులో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. ఈ వ్యర్ధాలు అచ్చం దూదిలా ఉంటాయి. ఈ విషయం చాలా మంది గమనించే ఉంటారు. కానీ ఏం లేదులే అన్నట్లు లైట్ తీసుకుంటారు. అసలు బొడ్డులో ఈ మెత్తని దూదిలాంటి వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? అవి అసలు ఎలా ఏర్పడతాయి? అందుకు గల కారణాలేంటి? దీనివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బొడ్డులో ఏర్పడే దూదిలాంటి వ్యర్థాలను బెల్లీ బటన్ లింట్(బీబీఎల్) అని అంటారు. బొడ్డులో ఈ వ్యర్థాలు ఏర్పడడానికి ప్రధాన కారణం.. బొడ్డు చుట్టూ ఉన్న వెంట్రుకలే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా వాటి ద్వారా మనం వేసుకున్న బట్టల లోపలి నుంచి చిన్న ఫైబర్‌, కాటన్ ముక్కలు చిన్న వ్యర్ధాలుగా ఏర్పడి బొడ్డులో పేరుకుపోతాయి. దుస్తుల కాటన్, ఫైబర్ మిక్స్ కావడం వల్ల నాభిలో దూదిలాంటి వ్యర్థాలు ఏర్పడినట్లు తెలిసింది.

ఇక “ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ” అధ్యయనం ప్రకారం.. నాభిలో దూదిలాంటి వ్యర్థాలలో ఫైబర్స్, బ్యాక్టీరియా, మన చర్మం యొక్క కణాలు ఉంటాయని, నాభి చుట్టూ ఉన్న వెంట్రుకలు ఈ వ్యర్థాలు ఏర్పడడానికి కారణమవుతాయట. ఈ విషయాన్ని జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ హాంబర్గ్​కు చెందిన ఫేమస్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ జోహన్నెస్ వోల్ఫ్ కూడా నిర్ధారించారు. బొడ్డు చుట్టూ ఉండే వెంట్రుకలు లింట్, ఇతర కణాలను బంధించి బొడ్డులో దూది లాంటి వ్యర్థాలు పేరుకుపోవడానికి దారితీస్తాయని ఆయన తెలిపారు.అంతే గాక బొడ్డులో పేరుకుపోయే వ్యర్థాలలో దుమ్ము, చర్మపు కణాలు, కొవ్వు, ప్రోటీన్లు, చెమట వంటివి కలిసి ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎప్పటికప్పుడు బొడ్డుని శుభ్రం చేసుకోకపోతే ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్‌ వంటివి నిలయంగా మారే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ వ్యర్థాలలో 2,368 రకాల బ్యాక్టీరియాలు కనిపించాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ వ్యర్థాలు ఏర్పడే సమస్య అందరిలో ఒకేలా ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు.పొట్ట మీద వెంట్రుకలు ఎక్కువగా ఉన్న పురుషులు, బరువు పెరిగిన వారి బొడ్డులో ఈ వ్యర్థాలు ఎక్కువగా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య చిన్నగా కనిపించినా దీన్ని లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే బొడ్డులో ఈ దూది వల్ల కడుపులోకి ఇందులో ఉండే బ్యాక్టీరియా పోయే ఛాన్స్ ఉంది. దాని వల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు. అయితే శుభ్రంగా స్నానం చేస్తూ బొడ్డుని నీట్ గా క్లీన్ చేసుకుంటే ఈ వ్యర్ధాలు పేరుకుపోవు అంటున్నారు నిపుణులు.

Show comments