P Krishna
ICMR Alert: ఇంటి భోజనం మించింది లేదని అంటారు.. ఎందుకంటే మనకు ఇష్టమైన భోజనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే ఆ ఆనందమే వేరు. బయట ఫుడ్ ఎంత టేస్టీగా ఉన్నా.. ఇంటి భోజనానికి మించి ఉండదని అంటారు.
ICMR Alert: ఇంటి భోజనం మించింది లేదని అంటారు.. ఎందుకంటే మనకు ఇష్టమైన భోజనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే ఆ ఆనందమే వేరు. బయట ఫుడ్ ఎంత టేస్టీగా ఉన్నా.. ఇంటి భోజనానికి మించి ఉండదని అంటారు.
P Krishna
భారత దేశంలో ఎంతోమంది భోజన ప్రియులు తమకు ఇష్టమైన ఆహారం తినేందుకు ఉత్సాహం చూపుతుంటారు. బయట ఎన్ని రకాల వంటలు టేస్ట్ చేసినా.. ఇంటి వంటలకు సరిరావు అంటారు. ఇళ్లలో చాలా మంది నూనె, నెయ్యి, ఉప్పుకారం, మసాలాలు దట్టించి వంటలు చేస్తుంటారు. అందుకే ఇంటి భోజనానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల ఉద్యోగాల్లో బిజీగా ఉంటున్నావాళ్లు, బ్యాచ్ లర్స్ ఎక్కవగా ఫాస్ట్ ఫుడ్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. బయట ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు అంటున్నారు. అయితే ఇప్పడు ఇళ్లలో చేసుకునే వంటల్లో కొన్ని ఐటమ్స్ వల్ల చాలా డేంజర్ అంటున్నారు భారత వైద్య పరిశోధన మండలి. పూర్తి వివరాల్లోకి వెళితే..
సాధారణంగా ఇంటి భోజనం ఎంతో రుచిగా ఉంటుందని అంటారు. అందుకే బయట దొరికే ఫుడ్ కన్నా ఇంటి భోజనం తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈ మధ్య బయట ఫుడ్ తినేవారు పలు రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది బయట జంగ్ ఫుడ్ తిన లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నారు. అయితే బయట ఫుడ్ వల్లనే కాదు.. మనం ఇంట్లో వాడే కొన్ని ఆహార పదార్థలు కూడా డేంజర్ అంటున్నారు భారత వైద్య పరిశోధన మండలి వారు. ఆరోగ్య కరమైన ఆహారంపై గత వారం పలు మార్గదర్శకాలు జారీ చేసిన ఐసీఎమ్ఆర్.. అధిక కొవ్వులు ఉండే ఆహారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఇలాంటి ఐటమ్స్ లో పోషకాల లేమి ఏర్పడి దీర్ఘకాలిక వ్యాధలు వచ్చే ప్రమాదం ఉందని ఐసీఎమ్ఆర్ హెచ్చరించింది. ఐసీఎమ్ఆర్ ప్రకటన ప్రకారం.. ‘కొవ్వులు, ఉప్పు అధికంగా ఉన్న ఆహారం ద్వారా శరీరానికి కావాల్సిన అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్, ఫైబర్ వంటి మాక్రో న్యూట్రియంట్స్, మినరల్స్, విటమిన్స్ వంటి ఫైటోన్యూట్రియాంట్స్ సరైన మోతాదులు అందవు. మాక్రో, మైక్రో పోషకాల లేమి వల్ల రక్త హీనత,డయాబెటీస్, మెదడుకి సంబంధించిన వ్యాధులు వస్తాయి. కొవ్వులు, ఉప్ప అధికంగా ఉన్న ఆహారంలో పేగుల్లో హితకరమైన బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఉప్పు ఎక్కువగా తింటే అన్ని రకాల ముప్పు ఉంటుందని.. బ్లడ్ ప్రెషర్ బాగా పెరుగుతుందని అంటున్నారు. ఇది కిడ్నీలపై ప్రభావం చూపిస్తుందని’ అని ఐసీఎమ్ఆర్ పేర్కొంది. నెయ్యి, నూనె, బటర్, ఫామ్ ఆయిల్, వనస్పతిల్లో సంతృప్త కొవ్వులు ఉంటాయని.. ఇవి పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయని హెచ్చరించింది.