Dharani
Dengue Fever Symptoms, Warning Sings, in Telugu: వర్షాకాలం వచ్చిందంటే చాలు రోగాలు పెరుగుతాయి. వాతావరణం మారడం, వర్షాల వల్ల పెరిగే మురుగునీటి ప్రవాహం కారణంగా ఈగలు, దోమల వీర విహారం చేస్తుంటాయి. ఇవి కుట్టడం ద్వారా వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా వంటి రోగాల బారిన పడతాం. ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
Dengue Fever Symptoms, Warning Sings, in Telugu: వర్షాకాలం వచ్చిందంటే చాలు రోగాలు పెరుగుతాయి. వాతావరణం మారడం, వర్షాల వల్ల పెరిగే మురుగునీటి ప్రవాహం కారణంగా ఈగలు, దోమల వీర విహారం చేస్తుంటాయి. ఇవి కుట్టడం ద్వారా వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా వంటి రోగాల బారిన పడతాం. ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
Dharani
వర్షాకాలం వచ్చిందంటే చాలు రోగాలు పెరుగుతాయి. వాతావరణం మారడం, వర్షాల వల్ల పెరిగే మురుగునీటి ప్రవాహం కారణంగా ఈగలు, దోమల వీర విహారం చేస్తుంటాయి. ఇవి కుట్టడం ద్వారా వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా వంటి రోగాల బారిన పడతాం. ఇక వీటిల్లో డెంగ్యూ చాలా ప్రమాదకరం. దీని బారిన పడితే.. ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతాయి. దోమ కాటు ద్వారా డెంగ్యూ జ్వరం వస్తుంది. దీనికి సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోకోతే.. ప్రాణాపాయం కలుగుతుంది. మరి డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి.. బాధితులు ఎవరు, నివారణ, చికిత్స మార్గాలు ఏంటి వంటి పూర్తి వివరాలు మీ కోసం..
డెంగ్యూ జ్వరం నాలుగు డెంగ్యూ వైరస్‌లలో ఒకటైన డేఈఎన్వీ వల్ల వస్తుంది. ఈ వైరస్ సోకిన దోమ కుట్టడం ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ జ్వరాన్ని వ్యాప్తి చేయడానికి కారణమయ్యే అత్యంత సాధారణ రకాలైన దోమలు ఏడెస్ ఈజిప్టి, ఈడెస్ ఆల్బోపిక్టస్ దోమలు.
డెంగ్యూ సోకిన వ్యక్తిలో లక్షణాలు వ్యాధి బారిన పడిన తర్వాత నాలుగు నుండి ఆరు రోజుల తర్వాత కనిపిస్తాయి. అలానే ఈ లక్షణాలు 10 రోజుల వరకు ఉంటాయి.
రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు, లీకేజీ అయినప్పుడు తీవ్రమైన డెంగ్యూ వస్తుంది. దీని వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భంలో తీవ్రమైన డెంగ్యూ బారిన పడతారు. దీని లక్షణాలు ఈ కింది విధంగా ఊంటాయి.
చిన్న పిల్లలు, వయసుపైబడిన వారు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తులు. వీరితో పాటు పదేపదే డెంగ్యూ ఇన్ఫెక్షన్ల బారిన పడే వ్యక్తుల్లో డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ బారినపడే ప్రమాదం ఉంది.
సాధారణంగా ఏ వ్యాధికైనా ప్రారంభంలోనే తగిన చికిత్స తీసుకుంటే.. ఎలాంటి ప్రమాదం ఉండదు. లేకపోతే ప్రాణాపాయం తప్పదు. డెంగ్యూ విషయంలో కూడా అంతే. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే.. ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయి.. చనిపోయే అవకాశం ఉంది. డెంగ్యూ కన్నా డెంగ్యూ షాక్ సిండ్రోమ్ లో మరణాల రేటు అధికం అంటున్నారు వైద్యులు.
డెంగ్యూ అనగానే ముందుగా వినిపించే పేరు ప్లేట్‌లెట్ కౌంట్. ఆరోగ్యవంతుడైన మనిషిలో ప్లేట్‌లెట్ కౌంట్ 1.5 లక్షల-4 లక్షల మధ్య ఉంటుంది. దీనికి విరుద్ధంగా, డెంగ్యూ జ్వరం ఉన్న వ్యక్తుల్లో ప్లేట్‌లెట్ కౌంట్ దాదాపు ఇరవై నుండి నలభై వేల వరకు పడిపోయే అవకాశం ఉంది. ప్లేట్‌లెట్స్ అనేవి ఎముక గుజ్జులో ఉత్పత్తి అవుతాయి. అయితే డెంగ్యూ బారినపడ్డ వ్యక్తుల్లో.. ఈ వైరస్ నేరుగా ఎముక మజ్జను ప్రభావితం చేస్తుంది కనుక ప్లేట్‌లెట్స్ ఉత్పత్తి తగ్గుతుంది. అంతేకాక ఈ వైరస్ రక్తప్రవాహంలో ప్లేట్‌లెట్లను నాశనం చేస్తుంది. డెంగ్యూ బారిన పడ్డ 4 వ, 5 వ రోజు తర్వాత ప్లేట్‌లెట్‌లు తగ్గడం ప్రారంభిస్తాయి. ఫలితంగా రోగి బలహీనంగా మారతాడు.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలే పోవచ్చు.
వైద్యపరంగా, లేదంటే ఆహారంలో మార్పుల ద్వారా ప్లేట్‌లెట్ సంఖ్యను పెంచుకోవచ్చు.
ఆహారం ద్వారా పెంచుకోవాలంటే.. ఆకు కూరలు, ఇనుము అధికంగా ఉండే ఆహారాలు, కాయధాన్యాలు, గుమ్మడి గింజలు, బొప్పాయి, పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలు సహజంగా రక్త ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడతాయి. విటమిన్ సీ, ప్రోటీన్, ఫోలిక్ యాసిడ్, జింక్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
ఆహారం ద్వారా త్వరగా రికవరీ అవ్వరు అనుకున్న సందర్భంలో రోగి పరిస్థితిని మెరుగుపర్చడం కోసం డాక్టర్లు.. అతడికి వైద్య చికిత్సల ద్వారా ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచే ప్రయత్నం చేస్తారు.
డెంగ్యూ జ్వరాన్ని నిర్ధారించడానికి వైద్యులు రక్త పరీక్షలను సూచిస్తారు. సీబీపీ, డెంగ్యూ సెరోలజీ పరీక్ష, డెంగ్యూ వైరస్ యాంటిజెన్ డిటెక్షన్ వంటి పరీక్షలను సూచిస్తారు.
అదే తీవ్రమైన డెంగ్యూ బారిన పడితే.. కాలేయ పనితీరు పరీక్షలు, మూత్రపిండ పనితీరు పరీక్ష, ఛాతీ ఎక్స్ రే, ఈసీజీ, యూఎస్జీ, 2డీ ఎకో, డీ డైమర్, ఫైబ్రినోజెన్ పరీక్ష, ఫైబ్రిన్ క్షీణత ఉత్పత్తి రక్త పరీక్ష వంటి పరీక్షలను సూచిస్తారు.
డెంగ్యూ వ్యాధికి నిర్ధిష్టమైన మెడిసిన్ లేదు. ఓటీసీ ఔషధం పారాసిటమాల్ వాడితే కండరాల నొప్పులు తగ్గుతాయి. ఇవే కాక వైద్యులు డెంగ్యూ చికిత్స కోసం ఆస్పిరిన్, ఐబుప్రొఫెన్, నప్రాక్సిన్ సోడియం వంటి ఔషధాలు సూచిస్తారు. కానీ వైద్యుల సూచన మేరకే వీటిని వేసుకోవాలి. వీటితో పాటు పౌష్టికాహారం, కాచి చల్లార్చిన నీరు, తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి.