నెంబర్ ఘనం ఓపెనింగ్స్ శూన్యం అన్నట్టు తయారవుతోంది కొన్ని శుక్రవారాల పరిస్థితి. థియేటర్లను అలంకరించడానికి తప్ప లోపల జనంతో నింపడానికి వీటిలో ఎక్కువ ఉపయోగపడటం లేదు. నవంబర్ 18 ఇలాగే ఉండనుంది. మొన్న యశోద సమంతా ఇమేజ్ వల్ల డీసెంట్ గానే వసూళ్లు రాబడుతోంది కానీ అసలు ఛాలెంజ్ సోమవారం నుంచి మొదలు కానుంది. ఇప్పుడున్న హోల్డ్ ని ఇలాగే కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ క్రైమ్ కం యాక్షన్ డ్రామా ఎంత మేరకు ఆకర్షించగలుగుతుందనేది వేచి చూడాలి. ఇక రాబోయే ఫ్రైడే ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు తెలుగు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
అందులో చెప్పుకోదగ్గ ఛాన్స్ ఉన్నది ఒక్క లవ్ టుడేకు మాత్రమే. తమిళంలో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ యూత్ ఫుల్ మూవీకి అక్కడ భారీ వసూళ్లు వచ్చాయి. స్టార్లు లేకపోయినా ఆడియన్స్ థియేటర్లను ఫుల్ చేస్తున్నారు. ఎప్పుడో ప్రేమ దేశం నాటి క్రౌడ్స్ ని ఇప్పుడు చూస్తున్నామని అక్కడి బయ్యర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాని డబ్బింగ్ హక్కులు కొన్న నిర్మాత దిల్ రాజు అదే టైటిల్ తో ఈ 18న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. పబ్లిసిటీ గట్రా ఏమి చేయట్లేదు కానీ కంటెంట్ మీద నమ్మకంతో మౌత్ టాకే ప్రమోషన్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో పెద్దగా హడావిడి చూపించడం లేదు. లవ్ టుడేలో ఉన్న విషయం అలాంటిది.
అదే రోజు మరో ఆరు సినిమాలు క్యూ కట్టాయి. సుడిగాలి సుధీర్ మాస్ టచ్ లో కనిపించే గాలోడు, నానితో ట్రైలర్ రిలీజ్ చేయించిన కాన్సెప్ట్ మూవీ మసూదలతో పాటు అలిపిరికి అల్లంత దూరంలో, సీతారామపురంలో ఒక ప్రేమజంట, ప్లే, ప్రేమదేశం అని మరికొన్ని బడ్జెట్ చిత్రాలు వరసలో ఉన్నాయి. వీటికి కనీసం మొదటి రోజు థియేటర్ రెంట్లు గిట్టుబాటు అయినా గొప్ప విషయమే. టాక్ చాలా బాగుందంటే అప్పుడు వీటి కోసం జనం థియేటర్లకోస్తారు. మరి లవ్ టుడేని తట్టుకుని దానికన్నా బెటర్ కంటెంట్ ఇందులో ఉందనే స్థాయిలో టాక్ తెచ్చుకోవాలి. మొత్తానికి స్టార్ సినిమాలు లేక డల్ గా ఉన్న నవంబర్ కి ఇలాంటి చిన్న మూవీసే దిక్కవుతున్నాయి.