DSC అభ్యర్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్!

Good News to DSC Candidates: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. తాజాగా డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్.

Good News to DSC Candidates: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. తాజాగా డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్.

తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చాటుకుంటున్నారు. తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపై చేశారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ పథకాల హామీ అమలు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఆరు గ్యారెంటీ పథకాల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. విద్య, వైద్య, మహిళాభివృద్ది, రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇటీవల మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా డీఎస్సీ అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. వివరాల్లోకి వెళితే..

ఇటీవల తెలంగాణలో టీఎస్ డీఎస్సీ నోటిఫికేషన్ 2024 విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ మెగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటిలో ఎస్టీలు 6,508, స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరిలో స్కూల్ అసిస్టెంట్స్ 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు మార్చి 4 వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 4 నుంచి ప్రారంభం అయ్యింది. ఏప్రీల్ 3 వరకు దరఖాస్తుల స్వీకరణం ఉంటుందని తెలిపారు.. అయితే ఫీజు చెల్లింపు గడువు విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. జూన్ 20వ తేదీ వరకు ఛాన్స్ కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా డీఎస్సీ అభ్యర్థులకు టీ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది.

జూలై మాసంలో నిర్వహించబోయే డీఎస్సీ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సువర్ణావకాశం. డీఎస్సీ అభ్యర్థుల కోసం టీశాట్ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీశాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఏప్రీల్ 17న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్లాసులు ఏప్రిల్ 18 నుంచి 9 రోజుల పాటు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని టీశాట్ తెలిపింది. మ్యాథ్స్, సైన్స్, కెమిస్ట్రీ, బాయలజీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్ట్ లపై లైవ్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతాయని తెలిపారు. ఆ లైవ్ టెలికాస్ట్ ప్రోగ్రామ్స్ మరుసటి రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రీ టెలీకాస్ట్ అవుతాయని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ పోటీ పరీక్షలకు రాసే అభ్యర్థులు తమ సందేహాలను ఫోన్ కాల్ ద్వారా కూడా నివృతి చేసుకునే అవకాశం కల్పించాని ఆయన అన్నారు.

 

 

Show comments