School Holiday Student Organizations Call Bandh On July 4: విద్యార్థులకు అలర్ట్‌.. జూలై 4 స్కూళ్లు, కాలేజీలు బంద్‌.. కారణమిదేనా!

School Holiday: విద్యార్థులకు అలర్ట్‌.. జూలై 4 స్కూళ్లు, కాలేజీలు బంద్‌.. కారణమిదేనా!

విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌.. జూలై 4 అనగా గురువారం నాడు విద్యాసంస్థలకు సెలవు ఉండనుందని తెలుస్తోంది. ఇంత సడెన్‌గా హలీడే ఎందుకు అంటే..

విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌.. జూలై 4 అనగా గురువారం నాడు విద్యాసంస్థలకు సెలవు ఉండనుందని తెలుస్తోంది. ఇంత సడెన్‌గా హలీడే ఎందుకు అంటే..

రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు పూర్తయ్యి.. పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం అయ్యాయి. డిగ్రీ, బీటెక్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్స్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఉత్తరాదిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. వేసవి సెలవులను జూన్‌ 30 వరకు పొడగించారు. జూలై 1 నుంచి అక్కడ స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం అయ్యాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ప్రారంభం అయ్యి రెండు వారాలకు పైగానే అవుతోంది. ఇక స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం అయినప్పటి నుంచి సెలవులకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో విద్యార్థులకు కీలక అలర్ట్‌. జూలై 4న విద్యాసంస్థలకు సెలవు అని తెలుస్తోంది. ఆ వివరాలు..

ఇక కొత్త అకడమిక్‌ ఇయర్‌లోకి అడుగుపెట్టిన విద్యార్థులు.. పూర్తిగా చదువు మీద శ్రద్ధ పెడుతున్నారు. ఇక జూలైలో 7, 8 రోజులు సెలవులు రానున్నాయి అని ఇప్పటికే చెప్పుకున్నాం. ఈ క్రమంలో జూలై 4న విద్యాసంస్థలకు సెలవు అని తెలుస్తోంది. ఎందుకంటే.. విద్యార్థి సంఘాలు జూలై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపు నిచ్చాయి. కారణం.. నీట్‌, నెట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారం. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని.. ఎస్‌ఐఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, పీడీఎస్‌ఓ, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గత ఐదేళ్లలో ఏకంగా సుమారు 65 పేజీలు లీకేజ్‌ అ‍య్యాయని.. దీనిపై మోదీ ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ లీకేజీలతో విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ వన్‌ నేషన్‌–వన్‌ ఎగ్జామ్‌ ముసుగులో స్టూడెండ్స్ భవిష్యత్తును ప్రమాదంలో పడేశారని ఆరోపించారు. మొత్తం పరీక్ష వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు. ఎన్‌టీఏ జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడంలో విఫలమైందని ఆరోపించారు. దేశంలో విద్యావ్యవస్థపై దాడికి వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ జూలై 4న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యార్ధి లోకం బంద్‌లో పాల్గొని, తరగతులను బహిష్కరించి, ర్యాలీలు, నిరసనలు తెలపాలని కోరారు. మొత్తం ఎనిమిది డిమాండ్ల సాధనకు పిలుపునిస్తూ.. ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు.

అంతేకాక ఎన్‌టీఏ వ్యవస్థ ర‌ద్దు చేయాల‌ని.. నీట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేసున్నాయి. అంతేకాకుండా యూనివర్శిటీల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో, రీసెర్చ్ సంస్థల్లో పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం ఇటీవల ఆమోదించిన తప్పనిసరి నెట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

Show comments