Reliance Foundation-Rs 6 Lakh Scholarships, Students: విద్యార్థులకు రిలయన్స్ భారీ శుభవార్త.. ఏకంగా రూ.6 లక్షల స్కాలర్షిప్

Reliance: విద్యార్థులకు రిలయన్స్ భారీ శుభవార్త.. ఏకంగా రూ. 6 లక్షల స్కాలర్షిప్

Reliance Foundation-Rs 6 Lakh Scholarship: రిలయన్స్ ఫౌండేషన్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వారికి 6 లక్షల వరకు స్కలార్షిప్ ఇవ్వనుంది. ఆ వివరాలు..

Reliance Foundation-Rs 6 Lakh Scholarship: రిలయన్స్ ఫౌండేషన్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వారికి 6 లక్షల వరకు స్కలార్షిప్ ఇవ్వనుంది. ఆ వివరాలు..

రిలయన్స్ అనగానే అనేక కంపెనీలు, లక్షల కోట్ల వ్యాపారాలు, వేల మంది ఉద్యోగులు గుర్తుకు వస్తారు. మన దేశంలోనే ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది రిలయన్స్. లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలను నడిపిస్తూ ప్రపంచ కుబేరుల జాబితాలో చేరారు ముఖేష్ అంబానీ. అయితే రిలయన్స్ అనగానే వ్యాపారాలు మాత్రమే కాక.. సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటుంది. అలానే పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు తన వంతుగా సాయం చేస్తుంది రిలయన్స్. విద్యార్థుల కోసం స్కాలర్షిప్స్ అందిస్తోన్న విషయం తెలిసిందే. వేలాది మంది విద్యార్థుల పై చదువులకు అయ్యే ఖర్చును ఈ సంస్థ భరిస్తోంది. దానిలో భాగంగా ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా విద్యార్థులకు భారీ ఎత్తున స్కాలర్షిప్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది రిలయన్స్. ఏకంగా 6 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ వివరాలు..

ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సాహించడం కోసం వారికి 2024-25 ఏడాదికి గాను స్కాలర్ షిప్స్ ఇచ్చేందుకు ముందకు వచ్చింది రిలయన్స్. ఇందకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. ఈ ఏడాది ప్రతిభావంతులైన 5,100 మంది విద్యార్థులకు ఉపకార వేతనం అందించనుంది. అండర్ గ్రాడ్యుయేషన్ తో పాటు పీజీ విద్యార్థులకు కూడా ఈ అవకాశం ల్పించారు.

దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలో యువ శక్తికి అండగా నిలిచి, వారి ప్రతిభకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్స్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకాడమిక్స్ లో చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఈ స్కాలర్షిప్ లకు ఎంపిక చేస్తారు.

డిగ్రీ చదువుకునే విద్యార్థులకు రూ. 2 లక్షలు, పీజీ చదివే విద్యార్థులకు రూ. 6 లక్షల వరకు స్కాలర్షిప్ అందించనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు www.scholarships.reliancefoundation.org ద్వారా అప్లై చేసుకోవాలని తెలిపారు. గతంలో విద్యార్థులు చూపిన అకాడమిక్ ప్రతిభ ఆధారంగా ఈ స్కాలర్షిప్పులకు ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 6వ తేదీ, 2024ని చివరి తేదీగా నిర్ణయించారు. 2022 నుంచి రిలయన్స్ ఫౌండేషన్ ఈ స్కాలర్షిప్లను అందిస్తోంది. రిలయన్స్ వ్యవస్థాపకులు ధీరుబాయి అంబానీ 90వ జయంతి సందర్భంగా నీతా అంబాని ఈ స్కాలర్షిప్పుల గురించి ప్రకటన చేశారు.

10 ఏళ్లలో 50,000 మందికి స్కాలర్షిప్స్ అందించడమే తమ లక్ష్యమని నీత అంబానీ తెలిపారు. ఆరోజు నుంచి నేటి వరకు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతీ ఏటా సుమారు 5,100 మందికి స్కాలర్షిప్స్ ఇస్తూ వస్తోంది. భారతదేశంలో ఎక్కువ మందికి స్కాలర్షిప్స్ అందిస్తున్న ఏకైక ప్రైవేట్ సంస్థగా రిలయన్స్ నిలిచింది. ఇప్పటివరకు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా సుమారు 23 వేల మంది విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది.

Show comments