iDreamPost
android-app
ios-app

ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి! హిందూ శాస్త్రంలో అంత ప్రాముఖ్యత ఎందుకు?

  • Published Jan 17, 2024 | 9:11 PM Updated Updated Jan 17, 2024 | 9:11 PM

అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట వేడుకలు జరుపుకోబోతున్నాం అని.. ఇప్పటివరకు మనం ఎన్నో వార్తలు విన్నాము. కానీ, అసలు ఈ ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటి, దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట వేడుకలు జరుపుకోబోతున్నాం అని.. ఇప్పటివరకు మనం ఎన్నో వార్తలు విన్నాము. కానీ, అసలు ఈ ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటి, దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jan 17, 2024 | 9:11 PMUpdated Jan 17, 2024 | 9:11 PM
ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి! హిందూ శాస్త్రంలో అంత ప్రాముఖ్యత ఎందుకు?

ప్రతి ఊరిలో ఖచ్చితంగా ఓ రామాలయం ఉంటుంది. కానీ, రామ జన్మ భూమి అయిన అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి.. ఇన్ని సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది! భారత దేశ చరిత్రలోనే ఓ ఆలయాన్ని నిర్మించడం కోసం..  కొన్ని వేల మంది ఎందుకు ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది. అదంతా 500ల సంవత్సరాల నాటి కథ. అప్పుడు మందిరానికి మసీదుకు మధ్య జరిగిన గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి.. చివరికి కోర్టు గుమ్మం దగ్గర తుది తీర్పును తీసుకున్న ఫలితమే.. ఈరోజు ముస్తాబుగా అలంకారం చెందుతున్న అయోధ్య.  ఈ అయోధ్య రామ మందిరంలోనే ఆ బాల రాముడికి జనవరి 22వ తేదీన..  ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు జరగనున్నాయని.. గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాము. అసలు ఈ ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటి! ఆలయ ప్రారంభోత్సవాలలో ప్రాణప్రతిష్టకు ఉన్న ప్రత్యేకత ఏమిటి!

రామ జన్మ భూమి అయోధ్యలో.. సీత సమేత శ్రీ రామ చంద్రుల వారు.. యావత్ ప్రపంచాన్ని దీవించే విధంగా.. స్థిరంగా ఆయన జన్మ స్థానంలో ప్రతిష్టింపబడనున్నారు. వందల సంవత్సరాల నాటి వైర్యానికి ప్రతీకగా..  ఈనాడు విస్తృతంగా ఆవిర్భవించింది అయోధ్య రామ మందిరం. తమ కళ్ళలో ఒత్తులు వేసుకుని చూస్తున్నట్లు.. ఆ రాముల వారికి ప్రాణ ప్రతిష్ట జరగబోయే రోజు కోసం.. యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది. అయితే, ఆలయాల్లో ప్రారంభోత్సవాలలో ప్రధానంగా జరిపించే ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వెనుక.. కొన్ని యుగాల నాటి సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు దాగి ఉన్నాయి.  దాని వెనుక ఉన్న విశేషాలేంటో చూద్దాం. గుడి లోపల దేవుడి ఆకారంలో ఉండేది ఒక రాయి. ఆ రాతిని అద్భుతమైన ఆకారంలో చెక్కినంత మాత్రాన.. వెంటనే వరాలు ఇచ్చే దేవుడు అయిపోడు. ఓ శిల్పి ఆ రాతిని ఎంత అద్భుతంగా అందంగా తీర్చిదిద్దినా.. అందులో ప్రాణ శక్తి లేనంత వరకు అది అర్ధం లేని ఓ విగ్రహంలానే మిగిలిపోతుంది. ఎప్పుడైతే వేద మంత్రాల ద్వారా ఆ విగ్రహంలో ప్రాణ శక్తిని నింపుతారో.. అప్పుడు మాత్రమే నిత్యం మనం కొలిచే దేవుడుగా ఆ విగ్రహాన్ని భావిస్తాము. 

ఈరోజున మన చుట్టూ ఉండే దేవాలయాల్లో చూసే.. దేవుళ్ళు దేవతల విగ్రహాలకు కూడా ఈ ప్రాణ ప్రతిష్టను జరించారు కాబట్టే.. ఆయా ఆలయాలు మూత పడకుండా నిత్యం పూజలు అందుకుంటున్నాయి. ఒక మనిషిలో ఆ బ్రహ్మ ఎలా అయితే   అన్ని అవయవాలను సమకూర్చి ఊపిరి పోసాడో.. అదే విధంగా మనిషి ఓ రాయికి చక్కటి రూపాన్ని అందించి.. సమస్త వేదాలు ఉపనిషత్తులపై జ్ఞానం ఉన్న వారు.. ఆ రూపానికి వేద మంత్రాల ద్వారా ప్రాణ శక్తిని అందిస్తారు. దీనికి సరైన ముహుర్తాన్ని కూడా ముందుగానే చూసుకుంటారు. అంటే  విగ్రహ రూపంలో ఆ దేవుడు మరల జన్మించినట్లే. ఆలయాల్లో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కంటే ముందు.. మూర్తి ప్రతిష్ట కార్యక్రమాన్ని చేస్తారు. అంటే ఆ విగ్రహాన్ని గర్భ గుడిలో ప్రతిష్టిస్తారు. ఆ తర్వాత ఆ విగ్రహంలోకి ప్రాణ శక్తిని నింపుతారు. దానినే ప్రాణ ప్రతిష్ట అంటారు.  

ఒక్కసారి ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత.. ఆలయంలోని విగ్రహం సాక్షాత్తు ప్రాణంతో ఉన్న దేవుడితో సమానం. ఒక మనిషి తన దైనందిన జీవితంలో ఏవైతే స్వీకరిస్తాడో.. అవన్నీ కూడా ప్రాణ ప్రతిష్ట తర్వాత.. విగ్రహ రూపంలో ఉన్న దేవుడికి మనసా వాచా కర్మణా సమర్పించాల్సిందే. అందుకే  యావత్ భారతదేశంలో ఉన్న ఆలయాలు , మహా పుణ్య క్షేత్రాలు.. నిత్యం పూజలు పురస్కారాలతో వైభోగంగా మెరిసిపోతూ ఉంటాయి. ఒక విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసిన తరువాత.. కొన్ని తరాల పాటు ఆ వైభోగం కనిపిస్తూనే ఉంటుంది. ఇకపై అయోధ్యలో కూడా ఆ శ్రీరామ చంద్ర మూర్తి నిత్యం దూప దీప నైవేద్యాలతో.. ఘనంగా పూజలు అందుకోనున్నాడు. ఈ క్రమంలో జనవరి 22వ తేదీన ఆ బాల రామునికి.. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.