తిరుమల భక్తులకు అలెర్ట్.. మూడు రోజుల పాటు శ్రీవారి సేవలు రద్దు!

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఈక్రమంలోనే తాజాగా శ్రీవారి భక్తులకు స్వామి వారి సేవల విషయంలో ఓ అలెర్ట్ వచ్చింది

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఈక్రమంలోనే తాజాగా శ్రీవారి భక్తులకు స్వామి వారి సేవల విషయంలో ఓ అలెర్ట్ వచ్చింది

కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇదే సయమంలో భక్తులకు టీటీడీ అనేక సౌకర్యాలను అందిస్తుంది. అంతేకాక తిరుమలకు సంబంధించి, అలానే శ్రీవారికి సేవలకు సంబంధించిన విషయాలను భక్తులకు తెలియజేస్తుంది. ఇదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఈక్రమంలోనే తాజాగా శ్రీవారి భక్తులకు స్వామి వారి సేవల విషయంలో ఓ అలెర్ట్ వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

తిరుమల శ్రీవారికి నిత్యం అనేక పూజలు, సేవా కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాక ప్రత్యేక దినాల్లో విశేష పూజలను నిర్వహిస్తుంటారు. ఇక శ్రీవారి సన్నిధిలో జరిగే ఆర్జిత సేవలను మూడు రోజుల పాటు రద్దు చేశారు. ఆగష్టు 15 నుంచి 17వ తేదీ వరకు ఈ సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆగ‌స్టు 14న అంకురార్పణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 15న తిరుప్పావడ సేవను, అలానే15 నుండి 17వ తేదీ వ‌ర‌కు జరిగే శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ర‌ద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

ఇదే సమయంలో ఆగ‌స్టు 14వ తేదీ నుంచి అంకురార్పణ పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయని టీటీడీ పేర్కొంది. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. అదే విధంగా ప్రతి రోజూ సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు.  ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియకుండానే శ్రీవారి విషయంలో కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల శ్రీవారి ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగ రాకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు.

ఈ పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.. ఏడాది కూడా ఆగష్టు 14 నుంచి ఈ పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారి ఆర్జిత సేవలు రద్దయ్యాయి. ఇదే సమయంలో తొండమాన్ పురంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కూడా ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జ‌రుగ‌నున్నాయి. ఆగస్టు 16న సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పరణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. మొత్తంగా ఆ మూడు తేదీల్లో తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు రద్దన  విషయాన్ని గమనించగలరు.

Show comments