Dussehra 2023 Importance Of Palapitta: దసరా పండుగకు.. పాలపిట్టకు సంబంధం ఏంటి.. ఎందుకంత ప్రాధాన్యతంటే..!

దసరా పండుగకు.. పాలపిట్టకు సంబంధం ఏంటి.. ఎందుకంత ప్రాధాన్యతంటే..!

తెలంగాణలో దసరా పండుగ రోజున పాలపిట్టను చూడటం ఆనాదిగా వస్తోన్న ఆచారం. విజయదశమి రోజు పాలపిట్ట కచ్చితంగా కనిపిస్తుంది. దసరా రోజున పాలపిట్టను చూడటాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. మరి అసలు దసరాకు, పాలపిట్టకు సంబంధం ఏంటి అంటే..

తెలంగాణలో దసరా పండుగ రోజున పాలపిట్టను చూడటం ఆనాదిగా వస్తోన్న ఆచారం. విజయదశమి రోజు పాలపిట్ట కచ్చితంగా కనిపిస్తుంది. దసరా రోజున పాలపిట్టను చూడటాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. మరి అసలు దసరాకు, పాలపిట్టకు సంబంధం ఏంటి అంటే..

తెలంగాణలో దసరా పండుగ ఎంత ఘనంగా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆడి.. పదవ నాడు అనగా విజయదశిమి రోజున దసరా పండుగ జరుపుకుంటారు. ఇక ఏపీలో కూడా ఎంతో వైభవంగా దసరా ఉత్సవాలు జరుపుకుంటారు. ఇక్కడ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో కొలుస్తారు. ఇక ఏపీలో దసరా పండుగ సందర్భంగా ఇంద్రకీలాద్రి, తిరుమలలో నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఏ పేరుతో పిలిచినా సరే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో సంబరంగా దసరా పండుగ జరుపుకుంటారు. ఇక తెలంగాణలో దసరా రోజున కచ్చితంగా పాలపిట్టను చూడాలంటారు. మరి దసరాకు, పాలపిట్టకు సంబంధం ఏంటి అంటే..

తెలంగాణలో దసరా పండుగ రోజున అంటే విజయదశమి రోజున పాలపిట్టను చూడటం ఆనవాయితీగా వస్తోంది. దసరా రోజున పాలపిట్టను చూడటాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. ఇక మన రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ప్రకటించారు అంటే.. తెలంగాణలో పాలపిట్టకు ఎంత గౌరవం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సి పని లేదు.

ఇక సాధారణ రోజుల్లో కనిపించినా కనిపించకపోయినా విజయదశమి రోజున పాలపిట్ట కచ్చితంగా కనిపిస్తుందని నమ్ముతారు తెలంగాణ ప్రజలు. దసరా రోజున ప్రజలు పొలాల దగ్గరకు వెళ్లి పాలపిట్టను దర్శించుకుని వస్తారు. అయితే ఈ సంప్రదాయం వెనుక కొన్ని ఆధ్యాత్మిక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

పాండవులకు పాలపిట్ట దర్శనం..

పూర్వం పాండవులు జూదం ఆడి రాజ్యాన్ని కోల్పోయాక.. ముందే చెప్పిన దాని ప్రకారం అరణ్యవాసం, అజ్ఞాత వాసం పూర్తి చేసుకుని తిరిగి వస్తుంటారు. ఈ క్రమంలో వారికి దారిలో పాలపిట్ట కనిపించిందట. దాంతో పాండవులు తమకు ఇక మీదట అంతా శుభమే కలుగుతుందని నమ్మారట. అలా పాండవులు అరణ్యవాసం, అజ్ఞాత వాసం ముగిసిన రోజు విజయదశమి పండుగ రోజే అని పురాణాలు చెబుతున్నాయి.

ఆ తర్వాత జరిగిన కురుక్షేత్రం యుద్ధంలో పాండవులు విజయం సాధించటం జరిగింది. దాంతో విజయదశమి రోజున పాలపిట్టను చూసినందుకే పాండవులు విజయం సాధించారని.. కనుక ఆ రోజున పాలపిట్టను దర్శిస్తే.. ఏడాదంతా శుభమే కలుగుతుందనే జనాలు నమ్మడం ప్రారంభించారు. అలానే శ్రీరాముడు కూడా యుద్ధానికి వెళ్లేటప్పుడు పాలపిట్టను చూశాడని.. అందుకే యుద్ధంలో విజయం సాధించాడని అంటారు. అందుకే విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని.. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందని అనాదిగా జనాలు నమ్ముతూ వస్తున్నారు. అందుకే దసరా రోజున పాలపిట్ట దర్శనానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక దసరా రోజున జమ్మికి వెళ్లి పాలపిట్టను దర్శించుకుని వస్తారు.

Show comments