మీ చేతి రేఖల్లో కూడా ఇలా M సింబల్ ఉందా? కోటీశ్వరులు కావడం పక్కా!

మీ చేతిలో రేఖల్లో M సింబల్ ఉందా? అయితే మీరు కోటీశ్వరులు కావడం పక్కా.. అని చెబుతున్నారు పండితులు. ఆ వివరాల్లోకి వెళితే..

మీ చేతిలో రేఖల్లో M సింబల్ ఉందా? అయితే మీరు కోటీశ్వరులు కావడం పక్కా.. అని చెబుతున్నారు పండితులు. ఆ వివరాల్లోకి వెళితే..

జాతకాలు.. నమ్మాలా? వద్దా? అన్న ప్రశ్నకు కొందరు నమ్ముతామని, మరికొందరు నమ్మకూడదని సమాధానాలు ఇస్తూ ఉంటారు. అయితే సమాజంలో ఎక్కువ శాతం జాతకాలను నమ్మేవారు ఉన్నారనే చెప్పాలి. ఇక కొంత మంది వాటిని అస్సలు పట్టించుకోరు. ఇక ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధమైన జాతకాలను విశ్వసిస్తూ ఉంటారు. కొందరు చిలక జోతిష్యాలను నమ్మితే.. మరికొందరు హస్తసాముద్రికం(చేతిరేఖలను చూసి చెప్పే జాతకం) లాంటి వాటిని నమ్ముతారు. ఇక కొందరు జోతిష్యులు మన చేతిలో రేఖలను చూసి మన భవిష్యత్ ను చెబుతారు. మీ చేతిలో M సింబల్ ఉందా? అయితే మీరు కోటీశ్వరులు కావడం పక్కా.. అని చెబుతున్నారు పండితులు. ఆ వివరాల్లోకి వెళితే..

అరచేతిలో చాలా మందికి గీతలు, రేఖలు ఉంటాయి. కానీ అందరికి ఒకే రీతిలో ఉండవు. ఇక అసలు విషయానికి వద్దాం. పైన ఫొటోలు చూపిస్తున్న విధంగా మీ చేతిలో M అనే ఆకారం ఉందా? అయితే మీరు కోటీశ్వరులు అయినట్లే. ఇది నేను చెబుతున్న మాటలు కావు. జాతకం చెప్పే జోతిష్యులు చెప్పేది. అవును ఇలా ఎమ్ ఆకారం లైఫ్ లైన్, హెడ్ లైన్, హార్ట్ లైన్ వల్ల ఈ అదృష్ట రేఖ ఏర్పడుతుంది. ఇందులో లైఫ్ లైన్ మణికట్టు నుంచి పైకి ఉంటే హెడ్ లైన్ దాటి హార్ట్ లైన్ కు చేరుకుంటుంది. వీటితో పాటుగా తల రేఖ, జీవిత రేఖ, హృదయ రేఖలతో వాలుగా ఉంటూ.. ఈ ఎమ్ సింబల్ ఏర్పడుతుంది. ఈ గుర్తు ఉన్న వ్యక్తులు అదృష్టవంతులని, డబ్బును విపరీతంగా సంపాదించే తెలివితేటలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.

అదీకాక ఈ సింబల్ ఉన్న వారు తమ కలలను 40 సంవత్సరాల లోపే సాకారం చేసుకునేలా కృషి చేస్తారట. తమ టార్గెట్ ను సాధించుకునేందుకు ఎంత కష్టమైనా పడతారట. ఎవరి అండదండలు లేకున్నా.. తమ తెలివితో నాలుగు తరాలకు సరిపడా సంపాదిస్తారని జాతక పండితులు పేర్కొంటున్నారు. పనులు సులువుగా, త్వరగా పూర్తి చేయడంలో ఇలాంటి వ్యక్తులు ముందుటారట. పైగా మిలియనీర్స్ గా ఎదుగుతారని, పేరు, ప్రతిష్టాలను సంపాదించుకుంటారని చెప్పుకొస్తున్నారు. అయితే ఎన్ని సింబల్స్ ఉన్నాగానీ.. మన ప్రయత్నం మనం చేయాలి కదా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి మీలో ఎంత మందికి ఇలా ఎమ్ సింబల్ ఉంది? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments