ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కానీ, భర్తకు చేసిన పనికి ఆమె జీవితమే..!

ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కానీ, భర్తకు చేసిన పనికి ఆమె జీవితమే..!

పెళ్లి అనే బంధంతో ఎన్నో జంటలు కలిసి తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాయి. మరికొందరు ప్రేమించి మరీ.. పెళ్లి చేసుకుంటారు. అలానే ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న ఓ మహిళ జీవితం మాత్రం విషాదంగా మారింది.

పెళ్లి అనే బంధంతో ఎన్నో జంటలు కలిసి తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాయి. మరికొందరు ప్రేమించి మరీ.. పెళ్లి చేసుకుంటారు. అలానే ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న ఓ మహిళ జీవితం మాత్రం విషాదంగా మారింది.

భార్యాభర్తల బంధం అనేది ఎంతో గొప్పది.  అలానే దంపతుల  మధ్య గొడవలు రావడం అనేది సర్వసాధారణం. అయితే కొందరు ఇలాంటి వాగ్వాదాలకు సర్థుకుపోతుంటారు. మరికొందరు మాత్రం చిన్న ఇష్యూను పెద్దదిగా చేసుకుని చివరకు విషాదంగా కూడా మార్చుకుంటారు. మరికొన్ని కుటుంబాల విషయంలో కొన్ని చెడు వ్యసనాలు చిచ్చుపెడుతుంటాయి. అలానే తాజాగా ఓ మహిళ..తాను ప్రేమించి ఓ వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. అతడే తన జీవితం అనుకుంది. కానీ చివరకు ప్రేమించిన వ్యక్తే.. యముడై ఆమె ప్రాణాలను తీశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రానికి చెందిన దాసోజు బ్రహ్మచారి, సరిత(31) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరు కొద్ది రోజులుగా సూర్యాపేటలోని శ్రీరాంనగర్ లో నివాసం ఉంటున్నారు. బ్రహ్మాచారి డోర్ పాలీష్ పనులు చేస్తుండేవారు. అలానే సరితా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిద్దరు 2014లో ప్రేమించుకుని కులాంతార వివాహం చేసుకున్నారు.

పెళ్లైన చాలా కాలం వీరి సంసారం హాయిగా సాగింది. అయితే ఇటీవల కొద్ది రోజుల నుంచి సరితా, బ్రహ్మచారి మధ్య కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. అంతేకాక ఇటీవల బ్రహ్మచారి మద్యానికి అలవాటుపడ్డాడు. రోజు తాగి వచ్చి భార్య సరితతో ఘర్షణకు దిగేవాడు. ఈ క్రమంలోనే  బుధవారం ఉదయం సరితాతో మరోసారి గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే ఆవేశానికి లోనై.. ఇంట్లోని వైర్ ను  సరిత మెడకు చుట్టి..బలంగా లాగాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న సరితా కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆమె మృతదేహం చూసి బోరున విలపించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా ఇటీవల కాలంలో అక్రమసంబంధాలు, ఆర్థిక సంబంధాలు, చెడు వ్యసనాల వంటి  వాటి కారణంగా పచ్చని సంసారాలు నిట్టనిలువునా చీలిపోతున్నాయి. కొందరు భార్యాభర్తలు అయితే పంతాలకు పోయి.. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పూర్వం దంపతుల మధ్య ప్రేమానురాగాలు, సర్థుకుపోయే గుణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి.. వాళ్లు సంసారాన్ని హాయిగా సాగించారు. కానీ నేటికాలంలో అలాంటి పరిస్థితులు చాలా తక్కువగా మాత్రమే కనిపిస్తున్నాయి. మద్యానికి బానిసై కొందరు కుటుంబాన్ని నాశనం చేస్తుంటే..గొడవలు పడి మరీ..ఇంకొందరు తమ జీవితాలను తలకిందులు చేసుకుంటున్నారు. మరి.. కుటుంబాల్లో ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే..తీసుకోవాల్సిన చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments