చిన్న కూతురని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.. చివరికి ఇలా చేయడంతో..!

ఊస్సేన్ సాబ్, ఖాజాబీ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. చిన్న కూతురు షెహనాబీని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. బాగా చదివించి మంచి యువకుడితో పెళ్లి చేయాలని అనుకున్నారు. ఇక తల్లిదండ్రులు కోరినట్లే ఆ యువతి ఇంటర్ వరకు చదివింది. ఆ తర్వాత పై చదువుల కోసం హైదరాబాద్ కు వెళ్లింది. అక్కడ రెండేళ్లు చదివింది. కానీ, ఉన్నట్టుండి కూతురు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. ఈ ఘటనతో ఇది కలనా లేక నిజమా అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా విఠలాపురంలో ఊస్సేన్ సాబ్-ఖాజాబీ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్ల సంతానం. చిన్న కూతురు షెహనాబీని చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఇదే కాకుండా బాగా చదివించాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఈ యువతి హైదరాబాద్ లో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. ఇదిలా ఉంటే.. షెహనాబీ వరుసకు బంధువైన ఖాజా అనే యువకుడితో గత కొంత కాలంగా ప్రేమలో ఉంది. ఇద్దరు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఎలాగైన ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇదే విషయాన్ని ఇటీవల ప్రియుడు ఖాజాకు వివరించింది. దీనికి ఆమె ఆ యువకుడు నిరాకరించాడు. దీంతో షెహనాబీ తట్టుకోలేకపోయింది.

ఇక ప్రియుడు లేని జీవితం నాకు వద్దు అనుకుందో ఏమో తెలియదు కానీ.. షెహనాబీ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై మెరుగైన చికిత్స కోసం కర్నూలులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ షెహనాబీ శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. కూతురు మరణించడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అనంతరం మ‌ృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ప్రేమ విఫలమైందని బలవన్మరణానికి పాల్పడిన షెహనాబీ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: జీవితంపై విరక్తి చెంది.. కేరళనుంచి విశాఖ వచ్చి..

Show comments