ప్రమాదంలో ఆరుగురు యువతీయువకులు మృతి.. దారుణం ఏంటంటే?

Dehradun Accident: ఈ మధ్య కాలంలో ప్రతిరోజూ దేశంలో ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

Dehradun Accident: ఈ మధ్య కాలంలో ప్రతిరోజూ దేశంలో ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలవుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున డెహ్రాడూన్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఒఎన్‌జిసి చౌక్ వద్ద తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, వేగంగా వస్తున్న ఇన్నోవా కారు కంటైనర్ ట్రక్కు వెనుక భాగానికి దూసుకెళ్లడంతో కారు ధ్వంసమైన స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు.ఈ ఘటనలో ఆరుగురు మరణించారు అక్కడిక్కడే చనిపోయారు.అందులో 25 ఏళ్ల సిద్ధేష్ అగర్వాల్‌గా ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

డెహ్రాడూన్‌లో జరిగిన  రోడ్డు ప్రమాదంపై పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.  పైగా ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ తప్పేమీ లేదని చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై కాంట్ పోలీస్ స్టేషన్ ఎస్సై కేసీ భట్ మాట్లాడుతూ.. ప్రమాదంపై మృతుల కుటుంబ సభ్యులు ఏ ఒక్కరూ ఇప్పటి వరకు రాలేదని అన్నారు. వారు ఫిర్యాదు చేయకపోతే మేం కేసు ఎలా ఫైల్ చేస్తాం.. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న కారు యజమాని కూడా మృతి చెందాడు. మరోవైపు బతికి ఉన్న సిద్దవేష్ అగర్వాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని తలకు బలమైన గాయం కావడంతో మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. అతడు సంఘటన గురించి స్టేట్ మెంట్ ఇవ్వలేకపోవడంతో కేసు ఫైల్ చేయలేదని అన్నారు. అందుకే ఈ కేసులో చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని కేసీ భట్ తెలిపారు. కాగా, మృతులు కునాల్ కుక్రేజా (23), అతుల్ అగర్వాల్ (24), రిషబ్ జైన్ (24), నవ్య గోయెల్ (23), కామాక్షి (20), గునీత్ (19)లుగా గుర్తించారు. వారంతా బికామ్ విద్యార్థులు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. అందరూ 25 ఏళ్లలోపు వారే అని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు డెహ్రాడూన్‌కు చెందినవారు కాగా, ఒకరు చంబాకు చెందినవారు.

ఈ ఘోర ప్రమాదం జరగడానికి ముందు ఈ బృందం అర్థరాత్రి డ్రైవ్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రమాద స్థలం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత జిల్లా పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. నైట్ డ్రైవ్‌ కోసం వెళ్లిన కారులోని ఏడుగురు వ్యక్తులు పార్టీ చేసుకుంటున్నట్లు చూపించే వీడియో బయటపడిందని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేశారు.  అయితే రోడ్డు ప్రమాదం గురించి మృతుల తల్లిదండ్రులకు సరైన సమాచారం అందిందా? లేక కావాలనే తమ పిల్లల గురించి పట్టించుకోవడం లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా చనిపోయిన వారి కుటుంబం ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ విషయంలో ఇప్పటికైపా మృతుల తల్లిదండ్రులు ఎమైనా స్పందిస్తారో లేదో చూడాలి.

Show comments