పరువు కోసం ఊర్లు మారింది! అయినా.. ఆమె రాత మారలేదు!

పోలీసులు అంటే ప్రజల్లో నమ్మకం ఉంది. శాంతి, భద్రతలను పరిరక్షిస్తారని బలమైన విశ్వాసం ఉంది. అయినప్పటికీ సినిమాల ప్రభావం కారణంగా కొన్ని సార్లు భయం, ఆందోళన ఉంటుంది. అయితే ఏదైనా కేసులో ఇరుక్కుంటే

పోలీసులు అంటే ప్రజల్లో నమ్మకం ఉంది. శాంతి, భద్రతలను పరిరక్షిస్తారని బలమైన విశ్వాసం ఉంది. అయినప్పటికీ సినిమాల ప్రభావం కారణంగా కొన్ని సార్లు భయం, ఆందోళన ఉంటుంది. అయితే ఏదైనా కేసులో ఇరుక్కుంటే

పోలీసు వ్యవస్థ అంటే ప్రజల్లో ఎంత నమ్మకముందో.. సినిమాల ప్రభావం వల్ల అంతే నెగిటివిటీ ఉంటుంది. అందుకే కొన్ని సందర్భాల్లో పోలీసులు చేసే పనికి సెల్యూట్ చేస్తుంటారు. అలాగే వారు కనిపించగానే కొంత భయం, ఆందోళన నెలకొంటాయి. ఏదైనా తప్పు జరిగితే.. న్యాయం జరుగుతుందని భావిస్తూనే.. ఒక్కసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే పలుమార్లు వెళ్లాల్సి వస్తుందని అనుమానం వ్యక్తం చేస్తుంటారు. అక్కడకు వెళ్లడం అవమానంగానూ భావిస్తుంటారు.అందుకే కోరి కోరి ఎవరు.. నేరం చేసి కేసుల్లో ఇరుక్కోవాలని అనుకోరు. ఇదిగో ఓ మహిళ దొంగతనం ఆరోపణలపై పోలీసు కేసు విచారణ ఎదుర్కొంది. అయితే పోలీసులు తనను పలుమార్లు విచారించడంతో అవమానంగా భావించి ఊరు వదిలి వెళ్లిపోయింది.

హాయిగా తన బతుకు తాను బతుకుతున్నానని అనుకుంటున్న సమయంలో మళ్లీ విచారణకు రావాలంటూ పోలీసులు పిలిచారు. అయితే మార్గమధ్యంలో ఆమె పురుగుల మందు తాగి.. పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే పడిపోయింది. తీరా ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. .కొల్లాపూర్​ ప్రాంతానికి చెందిన లక్ష్మి(28) గత ఏడాది నగరంలోని సాయికృప ప్రైవేట్​ ఆసుపత్రిలోని మెడికల్​ షాపులో పని చేసింది. అప్పుడు మెడికల్ షాపులో డబ్బులు పోయాయంటూ ఆసుపత్రి యాజమాన్యం లక్ష్మిపై చోరీ కేసు పెట్టింది. ఆమె డబ్బులు తీసిందంటూ దొంగతనం నేరం మోపారు. దీంతో పోలీసులు విచారణ జరిపారు. తాను దొంగతనం చేయలేదని చెప్పినప్పటికీ.. పలుమార్లు ఎంక్వైరీకి రావాలంటూ పిలుస్తుండటంతో ఊరిలో పరువు పోయినట్లు భావించింది.

భర్త, బిడ్డను తీసుకుని చిన్నంబావి మండలం వెల్టూరు గ్రామానికి వెళ్లిపోయింది. అయితే మరోసారి విచారణ రావాలంటూ గురువారం కొల్లాపూర్ ​పోలీసులు లక్ష్మికి మళ్లీ ఫోన్​ చేశారు. మార్గమద్యంలో పురుగుల మందు తాగి.. పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి పడిపోయింది. ఆమెకు ఫిడ్స్ వచ్చాయని భావించిన పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించగా.. చనిపోయినట్లు నిర్దారించారు వైద్యులు. కాగా, ఈ ఘటనపై మృతురాలి అక్క మాట్లాడుతూ.. హాస్పిటల్​ యాజమాన్యం తప్పుడు కేసు పెట్టిందని, పోలీసులు ఏడాదిగా విచారణ పేరిట ఇబ్బందులు పెడుతుండడంతో తన చెల్లెలు ఆత్మహత్య చేసుకుందని తెలిపింది. కాగా, పోలీసులు క్లారిటీ ఇచ్చారు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఆత్మహత్యకు యత్నించిందని, భర్తతో గొడవపడి మార్గమధ్యంలోనే పురుగుల మందు తాగి ఇక్కడకు వచ్చిందని,  లక్ష్మినీ కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించామని, కానీ ఫలితం లేకుండా పోయిందని డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

Show comments