ప్రవళిక కేసులో ఊహించని పరిణామం! ఇదేం ట్విస్ట్ రా బాబు!

హైదరాబాద్ అశోక్ నగర్ లోని హాస్టల్ ప్రవళిక అనే యువతి ఆత్మహత్య చేసుకన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో బుధవారం ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?

హైదరాబాద్ అశోక్ నగర్ లోని హాస్టల్ ప్రవళిక అనే యువతి ఆత్మహత్య చేసుకన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో బుధవారం ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?

హైదరాబాద్ అశోక్ నగర్ లోని హాస్టల్ ప్రవళిక అనే యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో గ్రూప్-2 వాయిదా పడిన కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా.. ప్రవళికను శివరాం రాథోడ్ అనే యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడని, దీని కారణంగానే ఈ ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.

అనంతరం పోలీసులు శివరాం రాథోడ్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు జైలు శిక్ష విధించింది. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మృతురాలి కుటుంబ సభ్యులను పిలిపించి పరామర్శించి సహాయం చేస్తామన హామీ ఇచ్చారు. కట్ చేస్తే.. ఈ క్రమంలోనే ప్రవళిక కేసులో సరైన సాక్షాధారాలు లేవని కోర్టు శివరాం రాథోడ్ కు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. దీంతో అతడు జైలు నుంచి బయటకు రావడంతో అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇదిలా ఉంటే.. బుధవారం చిక్కడపల్లి పోలీసులు శివరాం రాథోడ్ కు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కోర్డును ఆశ్రయించారు. ఈ ఘటనతో అంతా షాక్ గురవుతున్నారు.

Show comments