జొమాటో క్రేజీ ఫీచర్.. గ్రూప్ ఆర్డరింగ్ తో ఆ ఇబ్బందులకు చెక్!

Zomato Announced Group Ordering Feature: ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఒక కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ వల్ల కొన్ని ఇబ్బందులు తీరిపోతాయని జొమాటో సీఈవో వెల్లడించారు.

Zomato Announced Group Ordering Feature: ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఒక కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ వల్ల కొన్ని ఇబ్బందులు తీరిపోతాయని జొమాటో సీఈవో వెల్లడించారు.

ప్రస్తుతం అందరూ ఆన్ లైన్ ఆర్డర్లకు బాగా అలవాటు పడ్డారు. ముఖ్యంగా సిటీల్లో అయితే ఏది కావాలన్నా ఆన్ లైన్ లోనే కొనేస్తున్నారు. అందులో భాగంగానే ఇ-కామర్స్ సైట్స్ కూడా బాగా పెరిగిపోయాయి. వాటి సక్సెస్ తర్వాత ఆ సేవలు ఫుడ్ డెలివరీలోకి కూడా వచ్చాయి. సిటీల్లో ఆన్ లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయడం బాగా పెరిగిపోయింది. సమయంతో సంబంధం లేకుండా ఈ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సేవలు కొనసాగుతూ ఉంటాయి. ఆ సేవల్లో ప్రముఖ జొమాటో సంస్థకు మంచి ఆదరణ కూడా ఉంది. సాధ్యమైనంత త్వరగా, మెరుగ్గా సేవలు అందించడంలో జొమాటో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు వారి సేవలను మరింత మెరుగు పరుస్తున్నారు కూడా. అందులో భాగంగానే జొమాటో ఇప్పుడు కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది.

కొత్త ఫీచర్:

జొమాటో సంస్థ తమ వినియోగాదారుల ఆర్డరింగ్ ఎక్స్ పీరియన్స్ ని సులభతరం చేయడం, మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు జొమాటో తీసుకొచ్చిన ఆ కొత్త ఫీచర్ వైరల్ గా మారింది. ఆ ఫీచర్ గురించి జొమాటో సీఈవో దీపేందర్ గోయల్ స్వయంగా వెల్లడించారు. తన ఎక్స్ ఖాతాలో ఈ ఫీచర్ గురించి వివరించారు. ఆ ఫీచర్ ఏంటంటే.. గ్రూప్ ఆర్డరింగ్. ఇకపై జొమాటోలో గ్రూపు ఆర్డరింగ్ ని చేసుకోవచ్చు అని తెలియజేశారు. ముగ్గురు, నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేసుకుని ఎవరి ఆర్డర్ వాళ్లు పెట్టుకుంటూ సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు అని తెలిపారు. ఒకేసారి అందరూ తమకు కావాల్సిన ఆర్డర్స్ పెట్టచ్చు అని స్పష్టం చేశారు.

మీరు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆర్డర్ చేయాలి అనుకుంటే.. ఒకరు ఆర్డర్ లింక్ క్రియేట్ చేయాలి. దానిని మీ ఫ్రెండ్స్ కి ఫార్వాడ్ చేయాలి. అలా చేసిన లింక్ ఓపెన్ చేసి ఎవరికి కావాల్సిన ఫుడ్ ని వాళ్లు కార్ట్ కి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒకేసారి ఆ ఫుడ్ ని ఆర్డర్ చేయచ్చు. ఈ పోస్టుకు ఒక యూజర్ ఇంకో రిక్వెస్ట్ పెట్టారు. అదేంటంటే.. బిల్ కూడా స్ల్పిట్ చేసే ఆప్షన్ కావాలని కోరారు. అందుకు సీఈవో రిప్లయ్ కూడా ఇచ్చారు. అలా బిల్ ని స్ప్లిట్ చేసే ఫీచర్ ని కూడా అతి త్వరలోనే తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ గ్రూప్ ఆర్డరింగ్ ఫీచర్ కి యూజర్స్ నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందో చూడాలి. మరి.. జొమాటో గ్రూప్ ఆర్డరింగ్ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments