nagidream
Dual USB Socket: ప్రస్తుతం చాలా కంపెనీలు ఫోన్ ఛార్జింగ్ కోసం అడాప్టర్స్ ఇవ్వడం లేదు. దీని కోసం ప్రత్యేకించి డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొందామన్నా ఇంట్లో ఎంతమందికి ఫోన్ ఉంటే అందరి కోసం కొనాలా? ఒకవేళ అందరికీ ఒకటే అడాప్టర్ కొంటే ఫోన్ కి సపోర్ట్ చేస్తుందో లేదో అన్న భయం. ఈ సమస్యకు పరిష్కారమే ఈ యూఎస్బీ సాకెట్.
Dual USB Socket: ప్రస్తుతం చాలా కంపెనీలు ఫోన్ ఛార్జింగ్ కోసం అడాప్టర్స్ ఇవ్వడం లేదు. దీని కోసం ప్రత్యేకించి డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొందామన్నా ఇంట్లో ఎంతమందికి ఫోన్ ఉంటే అందరి కోసం కొనాలా? ఒకవేళ అందరికీ ఒకటే అడాప్టర్ కొంటే ఫోన్ కి సపోర్ట్ చేస్తుందో లేదో అన్న భయం. ఈ సమస్యకు పరిష్కారమే ఈ యూఎస్బీ సాకెట్.
nagidream
ఈ రోజుల్లో ఫోన్స్ వాడే అందరికీ ఒక పెద్ద సమస్యగా మారింది ఏంటి అంటే ఛార్జర్. అదెలా అనుకుంటున్నారా?. మాములుగా ఒకప్పుడు ఫోన్ తో పాటు ఛార్జర్ కూడా వచ్చేది, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఏవీ కూడా ఫోన్ కొన్నప్పుడు ఛార్జర్ ని ఇవ్వడం లేదు. అలా అని బయట కొందామంటే ఏది ఒరిజినల్ ఛార్జరో తెలియడం లేదు. కానీ ఇక్కడ చాలా మందికి తెలియనిది ఏంటి అంటే, ఛార్జర్ కి ఉండే అడాప్టర్ పవర్ ని మాత్రమే సప్లై చేస్తుంది. కానీ ఆ పవర్ ని మేనేజ్ చేసి, ఫోన్ కి ఛార్జ్ అయ్యేలా చేసే కెపాసిటీ మాత్రం కేబుల్ కే ఉంటుంది. అలా అని కేబుల్ ఉన్న ప్రతిసారి మనకి అడాప్టర్ కనిపించదు, ఎక్కడో పెట్టేస్తాం. ఇంట్లో అన్నయ్యదో, తమ్ముడిదో, ఫ్రెండ్ దో అడాప్టర్ తీసుకుని వాడుకుంటాం. కానీ అందరి అడాప్టర్ కెపాసిటీ ఒకేలా ఉండదు, దాని వలన కేబుల్ కి లైఫ్ తగ్గిపోవడం జరుగుతుంది, లేదా మన ఫోన్ పాడయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పుడు పవర్ సాకెట్సే USB పిన్ తో వచ్చేస్తున్నాయి. మన ఇంట్లో నార్మల్ సాకెట్స్ కాకుండా USB సాకెట్స్ ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఒకసారి అడాప్టర్ తో పని లేకుండా ఎన్ని ఫోన్స్ కైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
ఈ సాకెట్ లో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, దీని వలన ఒకేసారి రెండు ఫోన్స్ కి ఛార్జింగ్ ని పెట్టుకోవచ్చు. అంతే కాకుండా డాంగిల్ ని కనెక్ట్ చేసుకుని ఇంటర్ నెట్ కూడా వాడుకోవచ్చు. USB సపోర్ట్ తో ఛార్జింగ్ అయ్యే దేనిని అయినా కూడా, ఈ సాకెట్ తో ఛార్జింగ్ పెట్టొచ్చు. ఈ డ్యూయల్ యూఎస్‌బీ సాకెట్ 1,499 అయినప్పటికీ, అమెజాన్ లో 67 శాతం డిస్కౌంట్ తో కేవలం 489 రూపాయలకే కొనొచ్చు. మీ అవసరాన్ని బట్టి ఎక్కువ పోర్ట్స్ ఉన్న USB సాకెట్స్ ని కూడా ఇందులో మీరు సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవచ్చు.
మీ దగ్గర ఫోన్ కి ఛార్జింగ్ చేసే కేబుల్ ఉంటే చాలు, అడాప్టర్ తో పని లేదు. అలాగే ఈ సాకెట్ కేవలం అమెజాన్ లోనే కాదు. ఫ్లిప్‌కార్ట్, మీషో లాంటి ఈ-కామర్స్ సైట్ లలో కూడా ఉన్నాయి. ఆన్‌లైన్, అలానే ఆఫ్‌లైన్‌లో కూడా ఈ సాకెట్ లను కొనుక్కోవచ్చు. కాకపోతే ఈ ప్రాసెస్ లో అందరికీ వచ్చే ఒక డౌట్ ఏంటి అంటే.. మనం కంపెనీ ఛార్జర్ తో ఛార్జింగ్ పెడితేనే ఫోన్ కి మంచిది కదా, దీన్ని వాడొచ్చా అని? ఈ సాకెట్ వాడడం వలన డేంజర్ ఏం ఉండదు కానీ ఎప్పుడైనా పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు మాత్రం మన ఫోన్ కి డామేజ్ జరిగే అవకాశం ఉంది.
కాకపోతే ఇందులో సర్జ్ ప్రొటెక్షన్ అని సెపరేట్ గా ఫుస్ వచ్చే సాకెట్స్ ఉంటాయి. వాటిని వాడడం వలన పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా కూడా మన ఫోన్ కి ఏమి కాదు. ఇక్కడ ఆలోచించాల్సింది మనకి ఎక్కువ ఫోన్స్ ఉన్నాయి, కానీ ఛార్జర్స్ దేనికి దానికే కొనలేకపోతున్నాం అనుకునే వారికి ఇది మంచి ఛాయిస్. కానీ ఒకటే ఫోన్ ఉండి, దానికి సెపరేట్ గా ఛార్జర్ సెట్ ఉంటే దీని అవసరం లేదు. మీ అవసరాన్ని బట్టి ఒకటి తీసుకుంటే చుట్టాలు వచ్చినప్పుడు ఎమర్జెన్సీ సమయాల్లో హెల్ప్ అవుతుంది కానీ ఎప్పుడు దీనితోనే ఛార్జ్ అంటే కొంచెం ఆలోచించాలి.