క్రోమ్‌ యూజర్లకు బిగ్ అలర్ట్!.. వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని ప్రభుత్వం హెచ్చరిక!

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌ క్రోమ్‌పై కేంద్ర ప్రభుత్వ సైబర్‌ భద్రత సంస్థ షాకింగ్ విషయాలను వెల్లడించింది. యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే అప్ డేట్ చేసుకోవాలని కోరింది. లేదంటే సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేసే ప్రమాదమున్నట్లు వెల్లడించింది. గూగుల్ క్రోమ్ యూజర్లు కోట్ల మంది ఉంటారు. అన్ని ఫోన్, కంప్యూటర్లలో గూగుల్ క్రోమ్ తప్పని సరిగా ఉంటుంది. అయితే పాత వర్షన్ క్రోమ్ బ్రౌజర్ ఉన్నట్లైతే కొత్త వర్షన్ ను అప్ డేట్ చేసుకోవాలని కోరింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

లక్షలాది మంది గూగుల్ క్రోమ్ యూజర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ భద్రతా సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపింది. పాత బ్రౌజర్‌లో లోపాలు ఉన్నాయని, ఇది వినియోగదారుల డేటా మరియు సిస్టమ్‌ను చెడుగా ప్రభావితం చేస్తుందని తెలిపింది. ఫలితంగా సైబర్‌ నేరగాళ్లు రిమోట్‌గా కంప్యూటర్‌ను యాక్సెస్‌ చేసుకునే ముప్పు ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సైబర్‌ భద్రత సంస్థ- ‘ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్‌-ఇన్‌)’ అప్రమత్తం చేసింది. అటువంటి లోపాలను నివారించడానికి, వినియోగదారులు వెంటనే తమ డేటాను భద్రపర్చుకుని క్రోమ్ ను అప్ డేట్ చేసుకోవాలని సెర్ట్‌-ఇన్‌ తెలిపింది.

Show comments