Unity Small Finance Bank: తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త Bank.. కస్టమర్లకు భారీ ప్రయోజనాలు!

తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త Bank.. కస్టమర్లకు భారీ ప్రయోజనాలు!

Unity Small Finance Bank: తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త బ్యాంక్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ హైదరాబాద్‌లో ఐదు శాఖలను ప్రారంభించింది.

Unity Small Finance Bank: తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త బ్యాంక్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ హైదరాబాద్‌లో ఐదు శాఖలను ప్రారంభించింది.

దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన బ్యాంకులు చాలానే ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్ డీఎఫ్ సీ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాయి. కస్టమర్లు ఆయా బ్యాంకుల్లో ఖాతాలను తెరిచి తమ డబ్బును పొదుపు చేసుకుంటున్నారు. కస్టమర్లకు లోన్స్, ఎఫ్డీలపై మంచి వడ్డీ రేట్లను అందిస్తుంటాయి. దాదాపు అందరు బ్యాంకుల్లో ఖాతాలను కలిగి ఉంటున్నారు. ఈ క్రమంలో కస్టమర్లకు సేవలందించేందుకు మరో కొత్త బ్యాంక్ లాంఛ్ అయ్యింది. తెలంగాణలోకి యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అడుగుపెట్టింది.

కస్టమర్లకు సేవలందించేందుకు మరో కొత్త బ్యాంక్ అందుబాటులోకి వవచ్చింది. యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ హైదరాబాద్‌లో ఐదు శాఖలను ప్రారంభించింది. ఈ సందర్భంగా బ్యాంక్‌ ఎండీ, సీఈవో ఇంద్రజిత్‌ కమోత్రా మాట్లాడుతూ..వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో దిల్‌సుఖ్‌నగర్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, మౌలాలి, సుచిత్ర క్రాస్‌రోడ్‌, కూకట్‌పల్లిలో శాఖలను ప్రారంభించినట్లు తెలిపారు. ఖాతాదారులకు లోన్స్, ఎఫ్డీలపై భారీగా వడ్డీ అందించనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా తమ శాఖలను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు గల వారు సులభంగా రుణాలు పొందొచ్చని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్ ను కూడా తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే వచ్చే మూడు నెలల్లోనే హైదరాబాద్‌లో మరో మూడు, ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌, విజయవాడల్లోనూ శాఖలను ప్రారంభించనున్నట్లు ఇంద్రజిత్‌ కమోత్రా ప్రకటించారు. వచ్చే మూడు నెలల్లో క్రెడిట్‌ కార్డుతోపాటు పర్సనల్ లోన్స్ కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలిపారు. లక్ష నుంచి రూ.5 లక్షల లోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 9.50 శాతం వరకు వడ్డీని, సేవింగ్ అకౌంట్లపై 7.50 శాతం వడ్డీని ఇస్తున్నట్లు తెలిపారు.

Show comments