ఐక్యూబ్ లిమిటెడ్ ఎడిషన్ ని విడుదల చేసిన TVS! ఫీచర్స్ అదిరాయి!

TVS iQube Celebration Edition: దేశంలో టూ వీలర్స్ అమ్మకాలలో టీవీఎస్ మోటార్ కంపెనీ ఎప్పటి నుంచో సేవలు అందిస్తుంది. ఎప్పటికప్పుడు మోటార్ వెహికిల్స్ విషయంలో అప్ డేట్ అవుతూ వాహనదారులకు చేరువు అవుతుంది.

TVS iQube Celebration Edition: దేశంలో టూ వీలర్స్ అమ్మకాలలో టీవీఎస్ మోటార్ కంపెనీ ఎప్పటి నుంచో సేవలు అందిస్తుంది. ఎప్పటికప్పుడు మోటార్ వెహికిల్స్ విషయంలో అప్ డేట్ అవుతూ వాహనదారులకు చేరువు అవుతుంది.

టీవీఎస్ మోటార్ కంపెనీ దేశంలో టూ వీలర్స్ అమ్మకాలలో దశాబ్దాల నుంచి ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా టీవీఎస్ కంపెనీ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. తన పాపులర్ మోడల్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని లిమిటెడ్ ఎడిషన్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం ఇండియన్ టూ వీలర్ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఈ ఐక్యూబ్ స్కూటర్ కూడా ఒకటిగా దూసుకుపోతుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కంపెనీ కొత్త లిమిటెడ్ ఎడిషన్‌లో మార్కెట్‌లోకి విడుదల చేయడంతో ఈ స్కూటర్‌పై అందరిలో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

టీవీఎస్ కంపెనీ ఈ ఐక్యూబ్ స్కూటర్‌ని 2020వ సంవత్సరం ప్రారంభంలో తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు ప్లాంటులో ప్రారంభించింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ స్కూటర్ల అమ్మకాలు మొదట్లో పెద్దగా జరగలేదు. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.డిమాండ్‌కి తగ్గట్లు ఐక్యూబ్ స్కూటర్లను కంపెనీ తయారు చేస్తుంది. ప్రస్తుతం ఇది మార్కెట్‌లో టాప్‌ 5 లో కొనసాగుతుంది. తాజాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ ఐక్యూబ్ సెలెబ్రేషన్‌ ఎడిషన్‌ (TVS iQube Celebration Edition) అనే పేరుతో విడుదల చేసింది.

ఇక ఈ స్కూటర్ బుకింగ్స్ ఆగస్టు 26 వరకు అంటే కేవలం 11 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయని సమాచారం తెలుస్తుంది. . అంటే అప్పటి దాకా మాత్రమే ఈ స్కూటర్ బుకింగ్స్‌ని స్వీకరిస్తారు. ఐతే కంపెనీ ఈ సెలబ్రేషన్ ఎడిషన్ ఈవీ స్కూటర్లను 1,000 యూనిట్లు అమ్మిన తర్వాత నిలిపివేయనున్నట్లు ప్రకటన చేసింది.ఇది మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది. 2.2 కిలోవాట్స్‌లో స్టాండర్డ్, అలాగే 3.4 కిలోవాట్స్‌లో స్టాండర్డ్, S, ST వేరియంట్స్‌, టాప్‌ వేరియంట్‌ ST 5.1 కిలోవాట్స్‌తో వస్తుంది. దీని ధర రూ.1,19,628 నుంచి రూ.1,29,420గా దాకా ఉంటుంది. ఈ స్కూటర్లు డ్యూయల్ కలర్స్‌లో లభిస్తాయి. కంపెనీ ఈ స్కూటర్కి ‘సెలబ్రేషన్ ఎడిషన్’ లోగోను డిజైన్ చేసింది. హ్యాండిల్‌ బార్ కి రెండు వైపులా జాతీయ జెండా కలర్స్‌ని డిజైన్ చేశారు. దీన్ని ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల రేంజిని అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 78 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఇందులో 32 లీటర్ల భారీ స్టోరేజీని కూడా అందించారు.

Show comments