పసిడి ప్రియులకు షాక్.. ఒక్కసారే పెరిగిపోయిన ధరలు.. ఈ రోజు ఎంతరంటే?

Todays Gold Rate in Hyderabad (22 & 24 Carat): ఈ మధ్య కాలంలో బంగారం ధరలు వరుసగా తగ్గి పోవడంతో మహిళలు జ్యులరీ షాపులకు ఎగబడుతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా పుత్తడి కొనుగోలు భారీగా పెరిగిపోయింది.

Todays Gold Rate in Hyderabad (22 & 24 Carat): ఈ మధ్య కాలంలో బంగారం ధరలు వరుసగా తగ్గి పోవడంతో మహిళలు జ్యులరీ షాపులకు ఎగబడుతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా పుత్తడి కొనుగోలు భారీగా పెరిగిపోయింది.

పసిడి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని అయోమయ పరిస్థితి. ఈ నెలలో పుత్తడి వరుసగా తగ్గుతూ వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా బంగారం కొనుగోలు విపరీతంగా పెరిగిపోయింది. గత నెల శ్రావణ మాసం మొదలు కావడంతో పండుగలు, పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాల సందడి మొదలైంది.దానికి తోడు వరుసగా పసడి ధరలు తగ్గుముఖం పట్టడంతో మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడిన కీలక పరిణామాల నేపథ్యంలో పుత్తడి, వెండి ధరలు ఈ రోజు అమాంతం పెరిగిపోయాయి. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

బంగారం కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్.. నిన్నటి వరకు వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ఇప్పుడు ఒక్కసారే షాక్ ఇచ్చింది. దీనికి తోడు వెండి ధరలు కూడా పెరిగిపోయాయి. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగడం లేదు. ఎప్పటికప్పుడు ధరల్లో హెచ్చు తగ్గులు ఏర్పడుతూనే ఉన్నాయి. భారతీయ సంస్కృతిలో బంగారం గొప్ప సాంస్కృతిక సాంప్రదాయాలకు విలువ కలిగి ఉంది. ప్రస్తుతం 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 పెరిగి, రూ.67,160కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 పెరిగి,రూ.73,260కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.67,160 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,260 వద్ద కొనసాగుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.67,310 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,410 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.67,160 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,260 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.67,160 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,260 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.91,600 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.86,600, బెంగుళూరు‌లో రూ.83,900 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.91,600 వద్ద కొనసాగుతుంది.

 

Show comments