మగువలకు శుభవార్త.. భారీగా పతనమైన పసిడి.. ఈ రోజు ఎంతంటే?

Gold and Silver Rates: ఇటీవల పసిడి ధరలు ఎప్పుడు తగ్గుతున్నాయో.. ఎప్పుడు పెరుగుతున్నాయో చెప్పడం కష్టమైంది. గత పదిరోజుల క్రితం అమాంతం తగ్గిన పసిడి మళ్లీ పెరిగి షాక్ ఇచ్చింది. రెండు రోజులుగా మళ్లీ పతనమైంది.

Gold and Silver Rates: ఇటీవల పసిడి ధరలు ఎప్పుడు తగ్గుతున్నాయో.. ఎప్పుడు పెరుగుతున్నాయో చెప్పడం కష్టమైంది. గత పదిరోజుల క్రితం అమాంతం తగ్గిన పసిడి మళ్లీ పెరిగి షాక్ ఇచ్చింది. రెండు రోజులుగా మళ్లీ పతనమైంది.

బంగారం అంటే మహిళలకు ఎంత ఇష్టమై ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు ఖచ్చితంగా పసిడి కొనుగోలు చేస్తుంటారు. గత కొంత కాలంగా పసిడి ధరల్లో తరుచూ మార్పులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల వల్ల పసిడి, వెండి ధరల్లో ఇలాంటి మార్పులు సంభవిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది పసిడి, వెండి ధరలు భారీగానే పెరిగాయి. గత ఏడాదితో పోల్చితే రూ.5 వేల వరకు పెరిగింది. గత నెల కేంద్ర బడ్జెట్ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత పసిడి ధరలు అనూహ్యంగా దిగివచ్చాయి. ఏకంగా రూ.7 వేల తగ్గినట్టే తగ్గ క్రమంగా పెరుగుతూ వచ్చింది. నిన్నటి నుంచి మళ్లీ తగ్గింది. పసిడి కొనుగోలు చేయాలనుకునే మహిళలకు శుభవార్త. వివరాల్లోకి వెళితే..

ప్రపంచంలో అత్యంత విలువైన లోహం బంగారం. అందుకే ప్రతి ఒక్కరూ బంగారం అంటే ఎంతో మక్కువ చూపుతుంటారు. భారతీయ సాంప్రదాయాల్లో మహిళలు పసిడికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆషాఢ మాసం పూర్తయి.. శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. పండుగలు, ఇతర శుభకార్యాల సీజన్ కావడంతో పసిడి కొనుగోలు చేయడానికి మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతుంటారు. ఇటీవల బంగారం దిగుమతులపై సుంకం తగ్గించడంతో పసిడి, వెండి ధరలు అమాంతం దిగివచ్చాయి. వారం తర్వాత మళ్లీ పుంజుకున్నాయి. మూడు రోజులుగా వరుసగా పసిడి ధరలు దిగివస్తున్నాయి. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి పై రూ.10 తగ్గి,64,690 కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, 70,057కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.64,690 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.70,570 వద్ద కొనసాగుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.64,840 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.70,720 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.64,490 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.70,350 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.64,690 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.70,570 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.85,400 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.85,400, బెంగుళూరు లో రూ.84,500 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.90,900 వద్ద కొనసాగుతుంది.

Show comments