Arvind Krishna: రోజుకు రూ.45 లక్షల జీతం.. ఈ తెలుగు తేజం స్టోరీ తీస్తే ఓ సినిమానే!

Arvind Krishna: ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లలో ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ కూడా భాగం అయ్యారు. ఆయన ప్యాకేజీ దాదాపు రూ.165 కోట్లని తెలుస్తుంది.

Arvind Krishna: ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లలో ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ కూడా భాగం అయ్యారు. ఆయన ప్యాకేజీ దాదాపు రూ.165 కోట్లని తెలుస్తుంది.

ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న కొద్దిమంది ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లలో ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ కూడా భాగం అయ్యారు. ఆయన వార్షిక ప్యాకేజీ దాదాపు రూ.165 కోట్లని తెలుస్తుంది. అంటే రోజుకు దాదాపు రూ.45 లక్షలు సంపాదిస్తున్నారు. 2023లో ఆయన జీతం రూ.30 కోట్లుగా ఉండేది. ఈ ఏడాది భారీగా పెరిగింది. కృష్ణ 1990 నుంచి ఐబీఎమ్‌ లో తన నిధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి ఈ కంపెనీలో 34 ఏళ్ల అనుభవం ఉంది. అరవింద్ కృష్ణ 2020లో ఐబీఎమ్‌ సీఈవో అయ్యారు.కంపెనీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. అరవింద్ కృష్ణ1990లో ఐబీఎంలో చేరిన తర్వాత వివిధ హోదాల్లో పనిచేశారు. సీఈవో కాకముందు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. ఆయన సారధ్యంలో ఐబీఎమ్ రెడ్ హట్(IBM Red Hat)ని $34 బిలియన్లకు కొనుగోలు చేసిందంటే మామూలు విషయం కాదు. అంతేగాక అరవింద్ కృష్ణ పేరు మీద మొత్తం 15 పేటెంట్లు కూడా ఉన్నాయి.

అరవింద్ కృష్ణ ఆంధ్ర ప్రదేశ్ లోని వెస్ట్ గోదావరికి చెందిన వారు. ఆయన తండ్రి ఇండియన్ ఆర్మీ అధికారి. అరవింద్ కృష్ణ తల్లి సైనిక వితంతువులకు సేవలు అందించారు. తెలుగు కుటుంబంలో పెరిగిన కృష్ణ తన విద్యను తమిళనాడు, డెహ్రాడూన్‌లలో చేశారు. ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ కాన్పూర్‌లో ఇంజినీరింగ్‌ చేశారు. ఇక ఇంజినీరింగ్ అయిపోయాక ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేసేందుకు అమెరికాకి వెళ్లారు. అక్కడే ఆయనకి ఐబిఎమ్‌లో ఉద్యోగం వచ్చింది. దాంతో ఆయన జీవితమే మారిపాయింది. ఆయన నాయకత్వంలో ఐబిఎమ్‌ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా నిలిచింది. అందుకే కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ. 1,450,000 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. కంపెనీని ముందుకు తీసుకెళ్లడంలో కృష్ణ పాత్ర అంతా ఇంత కాదు. మరి రోజుకి దాదాపు నలభై ఐదు లక్షల జీతం తీసుకుంటున్న తెలుగు తేజం అరవింద్ కృష్ణ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments