SBI కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. 47 క్రెడిట్ కార్డులపై సంచలన నిర్ణయం!

మీరు ఎస్బీఐ కస్టమర్లా? ఎస్బీఐ కార్డులు వాడుతున్నారా? అయితే మీకు ఆ ప్రయోజనాలు వర్తించవు. వచ్చే ఆ కొన్ని డబ్బులు కూడా ఇక రావని ఎస్బీఐ బ్యాంకు తేల్చింది.  

మీరు ఎస్బీఐ కస్టమర్లా? ఎస్బీఐ కార్డులు వాడుతున్నారా? అయితే మీకు ఆ ప్రయోజనాలు వర్తించవు. వచ్చే ఆ కొన్ని డబ్బులు కూడా ఇక రావని ఎస్బీఐ బ్యాంకు తేల్చింది.  

ఇప్పటికే యస్ బ్యాంకు, ఐడీఎఫ్సీ బ్యాంకులు కస్టమర్లకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. రెంట్, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్ వంటి యుటిలిటీ బిల్స్ విషయంలో పరిమితి దాటితే ఒక శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రెడిట్ కార్డు ద్వారా ఈ బిల్స్ ని చెల్లిస్తే అదనపు ఛార్జీలు వసూలు చేయబడతాయని యస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంకులు వెల్లడించాయి. మే 1 నుంచే ఈ కొత్త నిబంధనలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఎస్బీఐ బ్యాంక్ కూడా తమ కస్టమర్లకు భారీ షాకిచ్చింది. 

ఆయా బ్యాంక్ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్ లైన్ లావాదేవీలు జరిపినప్పుడు రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్ వంటివి వస్తుంటాయి. అయితే రివార్డ్ పాయింట్స్ విషయంలో ఎస్బీఐ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్ సహా చాలా ప్రధాన బ్యాంకులు ప్రభుత్వ చెల్లింపులతో వచ్చే రివార్డ్ పాయింట్స్ ని కట్ చేశాయి. తాజాగా ఎస్బీఐ బ్యాంక్ కూడా క్రెడిట్ కార్డుల ద్వారా ప్రభుత్వ సంబంధిత చెల్లింపులు చేస్తే రివార్డ్ పాయింట్స్ ఇవ్వమని తెలిపింది.

ప్రభుత్వ సంబంధిత లావాదేవీలు అంటే జరిమానాలు, పన్ను చెల్లింపులు, పోస్టల్ సేవలకు సంబంధించినవి, ప్రభుత్వ సేవలకు సంబంధించిన లావాదేవీలకు రివార్డ్ పాయింట్స్ రావని 2024 మార్చి 1న ఒక ప్రకటనలో తేలింది. జూన్ 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని తెలిపింది. ప్రభుత్వ సంబంధిత లావాదేవీలకు సంబంధించి ఈ కింది క్రెడిట్ కార్డులకు రివార్డ్ పాయింట్స్ రావని ఎస్బీఐ బ్యాంకు తెలిపింది. 

  • ఆరమ్
  • ఎస్బీఐ కార్డ్ ఎలైట్
  • ఎస్బీఐ కార్డ్ ఎలైట్ అడ్వాంటేజ్
  • ఎస్బీఐ కార్డ్ పల్స్
  • సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డ్
  • సింప్లీ క్లిక్ అడ్వాంటేజ్ ఎస్బీఐ కార్డ్
  • ఎస్బీఐ కార్డ్ ప్రైమ్
  • ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ అడ్వాంటేజ్
  • ఎస్బీఐ కార్డ్ ప్లాటినం
  • ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ ప్రో
  • ఎస్బీఐ కార్డ్ ప్లాటినం అడ్వాంటేజ్
  • గోల్డ్ ఎస్బీఐ కార్డ్
  • గోల్డ్ క్లాసిక్ ఎస్బీఐ కార్డ్  
  • గోల్డ్ డిఫెన్స్ ఎస్బీఐ కార్డ్ 
  • గోల్డ్ అండ్ మోర్ ఎంప్లాయ్ ఎస్బీఐ కార్డ్ 
  • గోల్డ్ అండ్ మోర్ అడ్వాంటేజ్ ఎస్బీఐ కార్డ్ 
  • గోల్డ్ అండ్ మోర్ ఎస్బీఐ కార్డ్ 
  • సింప్లీ సేవ్ ఎస్బీఐ కార్డ్ 
  • సింప్లీ సేవ్ ఎంప్లాయ్ ఎస్బీఐ కార్డ్ 
  • సింప్లీ సేవ్ అడ్వాంటేజ్ ఎస్బీఐ కార్డ్ 
  • గోల్డ్ అండ్ మోర్ టైటానియం ఎస్బీఐ కార్డ్ 
  • సింప్లీ సేవ్ ప్రో ఎస్బీఐ కార్డ్
  • క్రిషక్ ఉన్నతి ఎస్బీఐ కార్డ్ 
  • సింప్లీ సేవ్ మర్చంట్ ఎస్బీఐ కార్డ్ 
  • సింప్లీ సేవ్ యూపీఐ ఎస్బీఐ కార్డ్   
  • ఎస్ఐబీ ఎస్బీఐ ప్లాటినం కార్డ్ 
  • ఎస్ఐబీ ఎస్బీఐ సింప్లీ సేవ్ కార్డ్ 
  • కేవీబీ ఎస్బీఐ ప్లాటినం కార్డ్ 
  • కేవీబీ ఎస్బీఐ గోల్డ్ అండ్ మోర్ కార్డ్ 
  • కేవీబీ ఎస్బీఐ సిగ్నేచర్ కార్డ్
  • కర్ణాటక బ్యాంక్ ఎస్బీఐ ప్లాటినం కార్డ్ 
  • కర్ణాటక బ్యాంక్ ఎస్బీఐ సింప్లీ సేవ్ కార్డ్ 
  • కర్ణాటక బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ 
  • అలహాబాద్ బ్యాంక్ ఎస్బీఐ కార్డు ఎలైట్ 
  • అలహాబాద్ బ్యాంక్ ఎస్బీఐ కార్డు ప్రైమ్ 
  • అలహాబాద్ బ్యాంక్ ఎస్బీఐ సింప్లీ సేవ్ కార్డ్
  • సిటీ యూనియన్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ 
  • సిటీ యూనియన్ బ్యాంక్ సింప్లీ సేవ్ ఎస్బీఐ కార్డ్ 
  • సెంట్రల్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ఎలైట్ 
  • సెంట్రల్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ 
  • సెంట్రల్ బ్యాంక్ సింప్లీ సేవ్ ఎస్బీఐ కార్డ్ 
  • యూకో బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ 
  • యూకో బ్యాంక్ సింప్లీ సేవ్ ఎస్బీఐ కార్డ్ 
  • యూకో బ్యాంక్ ఎస్బీఐ కార్డు ఎలైట్
  • పీఎస్బీ ఎస్బీఐ కార్డ్ ఎలైట్ 
  • పీఎస్బీ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ 
  •  పీఎస్బీ ఎస్బీఐ సింప్లీ సేవ్ 

ఈ పై క్రెడిట్ కార్డుల ద్వారా ఎవరైతే ప్రభుత్వ సంబంధిత లావాదేవీలు చేస్తారో వారికి రివార్డ్ పాయింట్స్ అనేవి రావు. రివార్డ్ పాయింట్స్ రావాలంటే వేరే కార్డులతో ప్రయత్నించాల్సిందే ఇక.

Show comments