కుక్క కోసం.. రతన్ టాటా చేసిన పనికి బ్రిటన్ రాజు షాక్!

Ratan Tata Love for Dogs: యావత్ భారత దేశం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రపంచం మెచ్చిన పారిశ్రామిక దిగ్గజం..దాతృత్వానికి మారు పేరైన టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86)అనారోగ్యంతో బుధవారం ముంబాయిలోని బ్రీచ్ క్యాండి హాస్పిటల్ లో కన్నుమూశారు.

Ratan Tata Love for Dogs: యావత్ భారత దేశం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రపంచం మెచ్చిన పారిశ్రామిక దిగ్గజం..దాతృత్వానికి మారు పేరైన టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86)అనారోగ్యంతో బుధవారం ముంబాయిలోని బ్రీచ్ క్యాండి హాస్పిటల్ లో కన్నుమూశారు.

ప్రముఖ వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ అధినేత రతన్ టాటా(86) ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రతన్ టాటా ప్రపంచం మెచ్చిన వ్యాపార వేత్త.. అంతకు మించి గొప్ప మానవతా వాది. తనకు చిన్నతనం నుంచి మూగజీవాలు అంటే అధికమైన ప్రేమ ఉండేదని పలు సందర్భాల్లో అన్నారు. ఆయన ఏదైనా బిజినెస్ పనిపై బయటకు వెళ్లే సమయంలో రోడ్డు మీద కుక్కలు ప్రమాదం భారిన పడినా, అవయవాలు సరిగా లేకుండా దీనావస్థలో  కనిపించినా ఎంతో బాధపడేవారు. వెంటనే వాటిని ముగ జంతువుల సంరక్షణా కేంద్రానికి తరలించేవారు. కుక్కల కోసం ప్రతిష్టాత్మకమైన అవార్డు సున్నితంగా తిరస్కరించిన గొప్ప వ్యక్తి. పూర్తి వివరాల్లోకి వెళితే..

రతన్ టాటా ఎంతో  గొప్ప జంతు ప్రేమికుడు అని అంటారు. ఆయన వద్ద ఎన్నో జాతి కుక్కలు ఉన్నాయి.   ఒకసారి బిజినెస్ పనిపై గోవా వెళ్తున్నారు. ఆ సమయంలో రోడ్డుపై దీనావస్థలో ఓ కుక్క కనిపించింది.  దాన్ని తెచ్చుకొని ఎంతో అపురూపంగా పెంచుకున్నారు.. గోవాలో దొరికింది కనుక ఆ కుక్కపేరు గోవా అని పెట్టారు. బాంబే హౌస్‌లో ఎన్ని కుక్కలు ఉన్నా ఆయనకు గోవా అంటే ఎంతో ప్రాణం.. ఎక్కువగా దానితో సమయాన్ని గడిపేవారని సన్నిహితులు అనేవారు. జంతువుల పట్ల ఆయనకు ఉన్న ఆదరణ,  ప్రేమ ఎంత గొప్పదో తెలియజేసే ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

2018లో రతన్ టాటాకు బ్రిటన్ రాజు ‘లైఫ్ టైమ్ అచీవ్ మెంట్’ అవార్డు ప్రకటించారు. బంకింగ్ హూమ్ ప్యాలెస్ బ్రిటీష్ ఏషియన్ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమంలో ఇంగ్లాండ్ రాణి చార్లెస్ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవాల్సి ఉంది. అదే సమయానికి రతన్ టాటా ఎంతో అపురూపంగా చూసుకుంటున్న కుక్క అనారోగ్యం భారిన పడింది. దాన్ని తనే దగ్గరుండి చూసుకోవాలనుకున్నారు.. అందుకోసం అవార్డు ఫంక్షన్ కి రాలేనని సున్నితంగా తిరస్కరించారు. ఇది తెలిసిన బ్రిటన్ రాజు..  రతన్ టాటాకు మూగజీవాల పట్ల ఉన్న ప్రేమ, వాత్సల్యానికి ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని ఆయన ఆత్మీయ స్నేహితుల్లో ఒకరైన సుహెల్ సేథ్ మీడియాతో చెప్పారు. కేవలం కుక్క కోసం అవార్డునే కాదనుకున్న గొప్ప వ్యక్తి అని అన్నారు.

ఇదిలా ఉంటే రతన్ టాటా రూ.165 కోట్ల ఖర్చతో ముంబైలో ‘స్మాల్ యానిమల్’ పేరుతో డాగ్ హాస్పిటల్ ని నిర్మించారు. ఇక్కడ ప్రతిరోజూ ఏక కాలంలో దాదాపు 200 కు పైగా కుక్కలకు ట్రీట్ మెంట్ జరుగుతుంది. బ్రిటీష్ డాక్టర్ థామస్ మిత్ కోట్ నేతృత్వంలో నిపుణులైన డాక్టర్స్ బృందం ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఈ హిస్పిటల్ ద్వారా రతన్ టాటా అనాథలైన ఎన్నో జంతువులకు వైద్యం అందించే ఏర్పాటు చేయడం ఆయనకు జంతువులపై ఉన్న ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది. రతన్ టాటా ఈ జంతు వైద్యశాల ఎప్పటికీ కొనసాగుతూనే ఉండాలని దాని బాధ్యతలు టాటా ట్రస్టులకు అప్పగించారు. ఆ హాస్పిటల్ ఆయన కన్న కలల్లో ఒకటి అంటారు సన్నిహితులు.

Show comments