P Krishna
Salman Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు సంబంధించిన మరో వివాదం తెరపైకి వచ్చింది.
Salman Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు సంబంధించిన మరో వివాదం తెరపైకి వచ్చింది.
P Krishna
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగిన సల్మాన్ ఖాన్ పై వివాదాలు కూడా అదే రేంజ్ ఉన్నాయి. నటుడిగా కొనసాగుతూనే బుల్లితెరపై పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. సల్మాన్ ఖాన్ హూస్ట్ గా చేస్తున్న ఇండియా బిగ్గెస్ట్ రియాల్టీ షో‘బిగ్ బాస్’ బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం బిగ్ బాస్ దక్షిణాది భాషల్లో కూడా మంచి క్రేజ్ సంపాదించింది. హిందీ బిగ్ బాస్ పై ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ చుట్టుముడుతూనే ఉంటుంది. తాజాగా బిగ్ బాస్ హూస్ట్ సల్మాన్ ఖాన్ కొత్త చిక్కుల్లో పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
హిందీ బిగ్ బాస్ హూస్ట్ సల్మాన్ ఖాన్ పై మరో కాంట్రవర్సీ హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఏ సినిమాలో అయినా ఓ ప్రకటన కనిపిస్తుంది.. ఈ మూవీలో జంతువులకు ఎటువంటి హాని కలగలేదు.. మీకు కనిపించేవి దృశ్య రూపాలే, జంతు సంరక్షణకు కట్టుబడి ఉన్నాం అని దాని అర్థం. బాలీవుడ్ లో పాపులర్ అయిన హిందీ బిగ్ బాస్ – 18 సీజన్ ప్రారంభమైంది. అక్టోబర్ – 6న గ్రాండ్ ప్రీమియర్ రియాల్టీ షో 18 మంది కొత్త కంటెస్టెంట్స్ సందడి చేశారు. ఈ సారి బిగ్ బాస్‌లో టీవీ నటులు, పొలిటీషియన్స్, సోషల్ మీడియా ఇన్ఫులెన్షియర్లు పాల్గొన్నారు. సల్మాన్ ఖాన్ కొత్త కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు.
ఈసారి బిగ్ బాస్‌లో కొత్త ట్విస్ట్ అంటూ.. 19వ కంటెస్టెంట్‌గా ‘గధారాజ్’ (గాడిద) తీసుకు వచ్చారు. గార్డెన్ ప్రాంతంలో దాని కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. దాని సంరక్షణ హౌస్‌మెట్స్ కి అప్పగించారు. ఇప్పుడు ఇదే బిగ్ బాస్ నిర్వాహకులు, సల్మాన్ ఖాన్ కి కొత్త తలనొప్పి తీసుకు వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో గాడిదను చూసి జంతు ప్రేమికులు పెటా ఇండియాకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) ఇండియా విభాగానికి చెందిన న్యాయవాది బిగ్ బాస్ హూస్ట్ అయిన సల్మాన్ ఖాన్ కి ఓ లేఖ రాశాను. వినోదం కోసం మూగజీవాన్ని వాడుకుంటారా? అని ఫైర్ అయ్యారు.
కేవలం వినోదం కోసం జంతువులను వాడుకోవడం ఎంత వరకు న్యాయం? సెట్ నుంచి దానిని వెంటనే తొలగించాలని నిర్వాహకులను కోరారు. బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోలో గాడిదను తీసుకు రావడం ఎంతో బాధాకరం.. జంతు ప్రేమికులను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని లేఖలో పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధువులు కూడా ఈ విషయం పై ఫిర్యాదు చేశారని అన్నారు. ఆ గాడిదను తమకు అప్పగిస్తే రక్షించి అభయారణ్యానికి తరలిస్తాం అని లేఖలో పేర్కొన్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ టీఆర్పీ కోసం సల్మాన్ ఖాన్‌ని ఇరికించినట్లు అయ్యింది. ఈ వివాదం సల్మాన్ ఖాన్ కి కొత్త తలనొప్పిగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్న సల్మాన్ ఈ కొత్త ఈ వివాదంపై ఎలా స్పందిస్తాడో చూడాలి.