టాటా ట్రస్ట్ ల కొత్త ఛైర్మెన్ గా బాధ్యతలు తీసుకున్న Noel Tata.. ఆయన బయోగ్రఫీ ఇదే!

Noel Tata: రతన్ టాటా మరణం ఎంతగానో కలచివేసింది. ఆయన అందించిన సేవలు అన్నీ ఇన్నీ కావు. టాటా గ్రూప్ ని తిరుగులేని బ్రాండ్ గా మార్చిన ఘనత ఆయనది. టాటా మరణం తరువాత ఆయన వారసుడు ఎవరు? అనే విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Noel Tata: రతన్ టాటా మరణం ఎంతగానో కలచివేసింది. ఆయన అందించిన సేవలు అన్నీ ఇన్నీ కావు. టాటా గ్రూప్ ని తిరుగులేని బ్రాండ్ గా మార్చిన ఘనత ఆయనది. టాటా మరణం తరువాత ఆయన వారసుడు ఎవరు? అనే విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణం అందరినీ ఎంతగానో కలచివేసింది. పారిశ్రామిక రంగంలో ఆయన అందించిన సేవలు అన్నీ ఇన్నీ కావు. టాటా గ్రూప్ ని ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని బ్రాండ్ గా మార్చిన ఘనత ఆయనది. అలాంటి టాటా మరణం తరువాత ఆయన వారసుడు ఎవరు? అనే విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే చివరకు టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా నోయల్ టాటాని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టాటా ట్రస్ట్ ఛైర్మన్ పదివికి ముందుగా చాలా రకాల చర్చలు జరిపారు టాటా ట్రస్ట్ సభ్యులు.. ఇక ఫైనల్ గా నోయల్‌ టాటాని కన్ఫామ్ చేశారు. అసలు ఎవరు ఈ నోయల్ టాటా ? రతన్ టాటాకి ఏమవుతారు? నోయల్ నే టాటా ట్రస్ట్ కి ఛైర్మన్ గా ఎందుకు ఎన్నుకున్నారు? ఆయన గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నోయల్ టాటా ఎవరో కాదు. రతన్ టాటాకు సవతి సోదరుడు. ఈయన కూడా మామూలు వ్యక్తి కారు. ఆయన అన్న రతన్ టాటా లాగే వ్యాపార మెలకువలు తెలిసిన అపర మేధావి. నోయెల్ టాటా.. 2000 సంవత్సరంటాలో టాటా గ్రూప్‌లో చేరారు. టాటా గ్రూప్ కి చెందిన హోల్డింగ్ కంపెనీ టాటా ట్రస్ట్ లో నోయెల్ కీలక వ్యక్తిగా ఎదిగారు. టాటా ట్రస్ట్ ని విజయవంతంగా ముందుకు నడిపించడంలో నోయల్ పాత్ర చాలానే ఉంది. రీసెంట్ గానే ఆయన టాటా ట్రస్ట్‌లలో ముఖ్యమైన బాధ్యతలను తీసుకున్నారు. నావల్ టాటా, సైమన్ టాటాల కుమారుడు నోయల్ టాటా. ఈయన 1957లో జన్మించారు. నోయల్ మంచి విద్యావంతులు. ఆయన ససెక్స్ యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. INSEADలో కూడా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (IEP)ని కంప్లీట్ చేశారు. టాటా గ్రూప్ లో ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేశారు. అలాగే టాటా స్టీల్, టైటాన్ కంపెనీ లిమిటెడ్ వైస్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. ఇంకా పలు టాటా గ్రూప్ కంపెనీల బోర్డులలో కీలక బాధ్యతలు తీసుకున్నారు.

ప్రస్తుతం టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఛైర్మన్‌గా, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు నోయల్ ట్రెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. టాటా కంపెనీ డెవలప్మెంట్ కి ఎనలేని కృషి చేశారు నోయల్. ఇప్పుడు సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 11వ ఛైర్మన్‌గా, సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు ఆరో ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకొనున్నారు. నోయల్ సారధ్యంలో టాటా ఇంకా అభివృద్ధి చెనుతుందని బోర్డ్ మెంబర్స్ భావిస్తున్నారు. టాటా ట్రస్ట్‌లు బాగా డెవలప్ అయ్యి రతన్ టాటా ఇంకా ఇతర బోర్డ్ మెంబర్స్ లక్ష్యాలను నోయల్ ముందుకు తీసుకెళ్తారని టీం భావిస్తున్నారు. టాటా ట్రస్ట్‌లో ప్రస్తుతం వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ ఇంకా మెహ్లీ మిస్త్రీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరందరూ కూడా నోయల్ టాటా ట్రస్ట్ లకు ఛైర్మన్ గా తగినవారని బలంగా నమ్మారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక పోతే రతన్ టాటా తమ్ముడు జిమ్మీ కుటుంబ వ్యాపారంలో కలగజేసుకోలేదు. ఆయన వీటికి దూరంగా ఉన్నారు. ముంబైలో ఓ చిన్న అపార్ట్మెంట్లో జిమ్మీ నివసిస్తున్నారు. ఇక నోయల్ టాటా.. టాటా ట్రస్ట్ ల ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments