Nita Ambani: పేదలకు ఉచిత వైద్య సేవలు .. మంచి మనసు చాటుకున్న నీతా అంబానీ!

Nita Ambani: పేదల కోసం నీతా అంబానీ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఉచిత వైద్య సేవలు ప్రవేశ పెట్టనున్నారు.

Nita Ambani: పేదల కోసం నీతా అంబానీ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఉచిత వైద్య సేవలు ప్రవేశ పెట్టనున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే అపర కుబేరుడు. అంతేగాక ఆయన అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఈ పనులన్నీ ఆయన భార్య నీతా అంబానీ దగ్గరుండి చూసుకుంటారు. ఆమె రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా ఈ బాధ్యతలు తీసుకున్నారు. పలు సామాజిక కార్యక్రమాల కోసం ముఖ్యమైన పనులు చేపడుతున్నారు. ఇక తాజాగా రిలయన్స్ ఫౌండేషన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నీతా అంబానీ పెద్ద సామాజిక కార్యక్రమం చేపట్టారు. పెద పిల్లలు, యువకులు, మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు, చికిత్స సౌకర్యాలు అందించనున్నారు. సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 10వ వార్షికోత్సవం సందర్భంగా నీతా అంబానీ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏకంగా లక్ష మందికి పైగా మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు, చికిత్సను అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇక ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ, అధునాతన చికిత్సలతో రిలయన్స్ ఫౌండేషన్ ఒక దశాబ్దాన్ని పూర్తి చేసుకుంది. ఈ 10 వ వార్షికోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటామని అన్నారు. భారతదేశానికి ఆరోగ్యకరమైన, ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. తమ ఆసుపత్రిని ప్రపంచ స్థాయికి చేర్చాలనే లక్ష్యంతో మేము ఎన్నో మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరిచామని ఆమె అన్నారు. ఈ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త ఆరోగ్య సేవా పథకంలో భాగంగా అట్టడుగు వర్గాలకు సేవలు అందించనున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ప్రత్యేకంగా వైద్య సేవలను అందిస్తున్నారు. అంతేగాక ఇందులో లక్ష మంది మహిళలకు అందించే ఆరోగ్య సేవలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఈ స్కీమ్ కింద ఇంకా కొన్ని ఆరోగ్య సేవలు కూడా అందించనున్నారు. ఇక ఆ సేవలు ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.

చాలా మంది చిన్న పిల్లలకు కూడా పుట్టుకతోనే గుండె జబ్బులు వస్తుంటాయి. అలాంటి గుండె జబ్బులతో బాధపడుతున్న 50,000 మంది పిల్లలకు ఉచిత పరీక్షలు, చికిత్సలు అందించనున్నారు.అలాగే చాలా మంది మహిళలకు కూడా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ లు వస్తుంటాయి. అలాంటి 50,000 మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ కి సంబంధించిన ఉచిత స్క్రీనింగ్, చికిత్సలు అందించనున్నారు.అలాగే 10,000 మంది యుక్తవయస్సులో ఉన్న బాలికలకు ముందు జాగ్రత్తగా గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాలని ఇవ్వనున్నారు. ఇలా రిలయన్స్ ఫౌండేషన్స్ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కొత్త హెల్త్ స్కీమ్ ని ప్రవేశ పెట్టారు నీతా అంబానీ. ఇదీ సంగతి. మరి నీతా అంబానీ ప్రవేశ పెట్టిన ఈ హెల్త్ స్కీమ్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments