Komaki XGT-VP Electric Scooter: 66 వేలకే కోమకి ఎలక్ట్రిక్ స్కూటర్.. 65 నుంచి 80 కి.మీ. రేంజ్

Komaki XGT-VP Electric Scooter: 66 వేలకే కోమకి ఎలక్ట్రిక్ స్కూటర్.. 65 నుంచి 80 కి.మీ. రేంజ్

Low Cost Electric Scooter: తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. బెస్ట్ రేంజ్ తో బెస్ట్ ఫీచర్స్ తో అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Low Cost Electric Scooter: తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. బెస్ట్ రేంజ్ తో బెస్ట్ ఫీచర్స్ తో అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ఆలోచనలో ఉన్నారా? బెస్ట్ రేంజ్, బెస్ట్ ఫీచర్స్ తో వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనాలని అనుకునేవారికి కోమకి కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి బెస్ట్ ఆప్షన్ గా ఉంది. కోమకి ఎక్స్ జీటీ వీపీ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్స్ తో అందుబాటులో ఉంది. ఇది ఆటోమేటిక్ రిపేర్, పార్కింగ్ అసిస్టెంట్ సహా అనేక బెస్ట్ ఫీచర్స్ తో వస్తుంది. ఇది లైఫ్ పీఓ4 యాప్ ఆధారిత స్మార్ట్ బ్యాటరీతో వస్తుంది. ఇది ఫైర్ రెసిస్టెంట్ ఆప్షన్ తో వస్తుంది. ఇందులో రెండు రకాల బ్యాటరీలు ఉన్నాయి. 60 వోల్ట్స్ 28 ఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో 65 నుంచి 70 కి.మీ. రేంజ్ ఇస్తుంది. 51 వోల్ట్స్ 33 ఏహెచ్ బ్యాటరీతో వచ్చే స్కూటర్ 75 నుంచి 80 కి.మీ. రేంజ్ ఇస్తుంది. ఛార్జింగ్ అవ్వడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.

ఇందులో బీఎల్డీసీ మోటార్ ఇచ్చారు. కలర్ ఫుల్ వివడ్ స్మార్ట్ డ్యాష్ బోర్డుని ఇచ్చారు. మల్టీపుల్ సెన్సార్లు, సెల్ఫ్ డయాగ్నోసిస్, వైర్ లెస్ ద్వారా ఫీచర్స్ ని అప్డేట్ చేసేలా దీన్ని రూపొందించారు. కంఫర్టబుల్ సీట్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, కంట్రోల్ కీఫాబ్ ఇచ్చారు. ఇందులో ఎకో, స్పోర్ట్, టర్బో మొత్తం మూడు మోడ్స్ ని ఇచ్చారు. మొబైల్ ఛార్జింగ్ పాయింట్, రిమోట్ తో లాక్ చేసుకునే ఫీచర్, టెలిస్కోపిక్ షాకర్, రిపేర్ స్విచ్, యాంటీ థెఫ్ట్ లాక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 18 లీటర్ల బూట్ స్పేస్ ని ఇచ్చారు. పార్కింగ్ అసిస్టెంట్, క్రూజ్ కంట్రోల్, రివర్స్ అసిస్టెంట్ ఫీచర్స్ తో ఇచ్చారు. వింటేజ్ లుక్ తో వస్తుంది. అల్ట్రా బ్రైట్ ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టంని ఇచ్చారు.

ధర విషయానికొస్తే.. 65 కి.మీ. నుంచి 70 కి.మీ. రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ. 62,305గా ఉంది. 75 నుంచి 80 కి.మీ. రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ. 84,681గా ఉంది. అయితే రాష్ట్రాలను బట్టి ధర అనేది మారుతుంది. 65 నుంచి 70 కి.మీ. రేంజ్ ఇచ్చే కోమకి ఎలక్ట్రిక్ స్కూటర్ అసలు ధర రూ. 66,978 కాగా ఆఫర్ లో రూ. 66,470కే అందుబాటులో ఉంది. అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద రూ. 1500 వరకూ తగ్గింపు లభిస్తుంది. ఇది గార్నెట్ రెడ్, జెట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, శాక్రమెంటో గ్రీన్, స్టీల్ గ్రే అకాలర్స్ లో అందుబాటులో ఉంది. బ్యాటరీ మీద మూడేళ్ల వారంటీ ఇస్తుంది కంపెనీ. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఫీచర్స్ నచ్చితే కనుక కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments