nagidream
Huge Discount On Apple MacBook Air Laptop M1 Chip: ఫోటో షాప్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ వంటివి చేసుకోవడం కోసం కొంచెం హెవీ కాన్ఫిగరేషన్ కలిగిన విండోస్ ల్యాప్ టాప్ కొనాలని అనుకునేవారు ఒకసారి మ్యాక్ ల్యాప్ టాప్ పై లుక్కేస్తే దీన్నే కొనాలని అనుకుంటారు. ఎందుకంటే విండోస్ ల్యాప్ టాప్ ధరకే మ్యాక్ ల్యాప్ టాప్ వస్తుంది.
Huge Discount On Apple MacBook Air Laptop M1 Chip: ఫోటో షాప్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ వంటివి చేసుకోవడం కోసం కొంచెం హెవీ కాన్ఫిగరేషన్ కలిగిన విండోస్ ల్యాప్ టాప్ కొనాలని అనుకునేవారు ఒకసారి మ్యాక్ ల్యాప్ టాప్ పై లుక్కేస్తే దీన్నే కొనాలని అనుకుంటారు. ఎందుకంటే విండోస్ ల్యాప్ టాప్ ధరకే మ్యాక్ ల్యాప్ టాప్ వస్తుంది.
nagidream
యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజే వేరు. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే యాపిల్ ఐఫోన్లు నాణ్యత కలిగి ఉంటాయని.. ఎక్కువ కాలం మన్నుతాయని వీటిని కొనేందుకు మొగ్గు చూపుతారు. అలానే మ్యాక్ బుక్ ల్యాప్ టాప్ లు, మ్యాక్ పాడ్స్ పై కూడా అంతే ఆసక్తి చూపుతారు. ఒక మోస్తరు హై కాన్ఫిగరేషన్ ఉన్న విండోస్ ల్యాప్ టాప్ కొనాలంటే కనీసం 50 వేలు పెట్టాల్సి ఉంటుంది. 50 వేలు పెట్టుబడి పెడితే ఎలాంటి ల్యాగ్ లేకుండా హెవీ వర్క్ చేసుకోవడం అనేది కుదరదు. కానీ మ్యాక్ దగ్గరకొచ్చేసరికి విండోస్ కి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎలాంటి ల్యాగ్ లేకుండా హెవీ వర్క్స్ చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్, ఫోటో షాప్ వంటివి చేసుకోవచ్చు. విండోస్ ల్యాప్ టాప్ కోసం 50 వేలు పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు ఇంకో 15, 20 వేలు పెట్టుబడి పెడితే కనుక మ్యాక్ ల్యాప్ టాప్ నే సొంతం చేసుకోవచ్చు.
యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ల్యాప్ టాప్ ఎం1 చిప్ ప్రాసెసర్ తో వస్తుంది. 13.3 అంగుళాల రెటినా డిస్ప్లేతో వస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ హార్డ్ డ్రైవ్ ఇచ్చారు. ఇది బ్యాక్లిట్ కీబోర్డ్ తో వస్తుంది. ఫేస్ టైం హెచ్డీ కెమెరా, టచ్ ఐడీ ఫీచర్స్ తో వస్తుంది. ఐఫోన్, ఐప్యాడ్ తో వర్క్ చేస్తుంది. ఇది స్పేస్ గ్రే కలర్ లో అందుబాటులో ఉంది. మ్యాక్ ఓఎస్ 10.14 మొజావే ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. 18 గంటల బ్యాటరీ లైఫ్ తో, 8 కోర్ సీపీయూ, 8 కోర్ జీపీయూతో వస్తుంది.
ఇందులో రెండు థండర్ బోల్ట్ పోర్ట్స్, ఛార్జింగ్ కి, డిస్ప్లే పోర్ట్ కి 4 యూఎస్బీ పోర్ట్స్ ఇచ్చారు. సెకనుకు 40 జీబీ డేటా ట్రాన్స్ఫర్ చేసుకునేలా థండర్ బోల్ట్ పోర్ట్ ఒకటి ఇచ్చారు. సెకనుకు 10 జీబీ డేటా ట్రాన్స్ఫర్ చేసుకునేలా యూఎస్బీ 3.1 జెన్ 2 పోర్ట్ ని ఇచ్చారు. ఈ ల్యాప్ టాప్ తో పాటు 30 వాట్ యూఎస్బీ సీ పవర్ అడాప్టర్, యూఎస్బీ సీ ఛార్జ్ కేబుల్ ఇస్తున్నారు. ఈ ల్యాప్ టాప్ పై ఏడాది పాటు వారంటీ ఇస్తుంది. దీని అసలు ధర ఆన్ లైన్ లో రూ. 92,900 ఉండగా రెగ్యులర్ ధర రూ. 69,900గా ఉంది. ప్రైమ్ డే ఎర్లీ డీల్ లో భాగంగా దీన్ని మీరు ప్రైమ్ ఎక్స్ క్లూజివ్ డీల్ కింద రూ. 68,990కే సొంతం చేసుకోవచ్చు. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే కనుక అదనంగా మరో 5 వేలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే 68,990 రూపాయలకు ఈ ల్యాప్ టాప్ ని పొందాలంటే మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ అయి ఉండాలి. ఈ ల్యాప్ టాప్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.