Increase Prices: సామాన్యుడు బతికేదెలా? దేశంలో భారీగా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు!

FMCG Companies: సామాన్యులకు చుక్కలు చూపేందుకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు రెడీ అవుతున్నాయి. ఎన్నికలు ముగిసేంత వరకు కామ్‌గా ఉన్న కంపెనీలు ఇప్పుడు రేట్లను పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి. ఆ వివరాలు..

FMCG Companies: సామాన్యులకు చుక్కలు చూపేందుకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు రెడీ అవుతున్నాయి. ఎన్నికలు ముగిసేంత వరకు కామ్‌గా ఉన్న కంపెనీలు ఇప్పుడు రేట్లను పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి. ఆ వివరాలు..

కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు 100 రూపాయలకు 5 కిలోల వరకు వచ్చే టమాటా.. ఇప్పుడేమో కేజీ ధరే ఏకంగా వంద రూపాయలకు చేరువలో ఉంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మిగతా అన్ని కూరగాయల ధర భారీగానే పెరిగాయి. కూరగాయలు కొనాలంటే జనాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక వీటికి తోడు నిత్యవసరాలైన నూనె, పప్పులు, ఉప్పుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఎన్నికల ముందు వరకు వీటి రేట్లు కాస్త స్థిరంగా ఉండటంతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్‌ ముగియడంతో.. వీటి ధరలకు రెక్కలు వచ్చాయి. దాంతో సామాన్యుల జేబుకు భారీగా చిల్లు పడే పరిస్థితి నెలకొని ఉంది. సబ్బుల నుంచి నూనెల వరకు ప్రతి దాని ధర భారీగా పెరగనుంది. ఆవివరాలు..

ఇప్పటికే కూరగాయల ధరలు కొండెక్కాయి. వీటికి తోడు ఇప్పుడు మరికొన్ని ఉత్పత్తుల ధరలు కూడా పెరగనున్నా​యి. దాంతో సామాన్యులపై మరింత భారం పడనుంది అంటున్నారు. సబ్బులు మొదలు పప్పులు, ఉప్పులు, బాడీ వాష్‌, నూడుల్స్‌, నూనెల ధరలు భారీగా పెంచేందుకు రెడీ అవుతున్నాయి ఎఫ్‌ఎంసీజీ సంస్థలు. పైన చెప్పిన వాటిల్లో ఇప్పటికే కొన్నింటి ధరలు పెంచగా.. త్వరలోనే మరికొన్ని వాటి రేట్లను పెంచేందుకు రెడీ అవుతున్నాయి కంపెనీలు. ముడిపదార్థాల వ్యయం పెరగడంతో.. మార్జిన్లు కాపాడుకునేందుకు.. ఉత్పత్తుల ధరల పెంపు తప్పట్లేదని ఆయా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.

సబ్బులు, బాడీ వాష్ ధరలు 2 నుంచి 9 శాతం వరకు, తలకు వాడే నూనెల ధరలు 8 శాతం నుంచి 11 శాతం వరకు.. ఇంకా ఎంపిక చేసిన ఆహార పదార్థాల ధరలు 3 నుంచి గరిష్టంగా 17 శాతం వరకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. పోటీ సంస్థలకు అనుగుణంగా టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ తమ ఉత్పత్తుల ధరల సవరింపు ప్రక్రియ చేపట్టినట్లు తెలిపింది. అలానే హిందుస్థాన్‌ యూనీలివర్‌ డోవ్‌ సబ్బుల ధరల్ని 2 శాతం పెంచింది. ఇమామీ, డాబర్‌ ఇండియా సంస్థలు ఈ ఏడాది తమ ఉత్పత్తుల ధరలను 1-5 శాతం మేర పెంచనున్నట్లు ప్రకటించాయి.

అలానే గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ తమ కంపెనీ సబ్బుల ధరల్ని 4-5 శాతం వరకు పెంచింది. అలానే విప్రో సంతూర్‌ సబ్బుల రేట్లను 3 శాతం పెంచింది. కోల్గేట్‌ పామోలివ్‌ బాడీ వాష్‌ రేట్లను కూడా పెంచింది. ఇక హెచ్‌యూఎల్‌, పీఅండ్‌జీ హైజీన్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌, జ్యోతి ల్యాబ్స్‌ తమ డిటర్జెంట్స్‌ రేట్లను 1-10 శాత మేర పెంచాయి. అలానే హెచ్‌యూఎల్‌ తన షాంపూ, స్కిన్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌ రేట్లను 4 శాతం వరకు పెంచింది. ఇక నెస్ట్లే కాఫీ ధరల్ని 8-13 శాతం పెంచింది. మ్యాగీ ఓట్స్‌ నూడల్స్‌ రేటు ఏకంగా 17 శాతం వరకు పెంచింది. ఐటీసీ ఆశీర్వాద్‌ హోల్‌ వీట్‌ ధరని కూడా 1-5శాతం పెంచింది. బికాజీ ఈ ఆర్థిక సంవత్సరంలో 2-4 శాతం రేట్లు పెంచే ప్రయత్నంలో ఉంది. ఆయా కంపెనీలు ఇలా ఎడాపెడా రేట్లు పెంచడం సామాన్యులపై పెను భారంగా మారింది.

Show comments