ఉద్యోగులు, పెన్షనర్లకు EPFO శుభవార్త.. ఇక నెలకు రూ.7500 పెన్షన్‌?

EPFO-Minimum Pension, EPS Scheme: ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక అలర్ట్‌.. ఇకపకై కనిష్ట పెన్షన్‌ 7500 రూపాయలు కానుందా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆ వివరాలు..

EPFO-Minimum Pension, EPS Scheme: ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక అలర్ట్‌.. ఇకపకై కనిష్ట పెన్షన్‌ 7500 రూపాయలు కానుందా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆ వివరాలు..

ప్రైవేటు కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు తమ బెసిక్‌ సాలరీ నుంచి ప్రతి నెల కొంత మొత్తం.. ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌)కి జమ చేస్తారు. ఇది మొత్తంగా 24 శాతం ఉంటే.. దీనిలో సగం అనగా 12 శాతాన్ని ఉద్యోగి వేతనం నుంచి కట్‌ చేస్తే.. మిగతా మొత్తాన్ని కంపెనీ భరిస్తుంది. కొన్ని ప్రైవేటు కంపెనీల్లో ఈ మొత్తాన్ని ఉద్యోగి వేతనం నుంచే కట్‌ చేసి.. పీఎఫ్‌కు జమ చేస్తారు. యాజమాన్యం చెల్లించే 12 శాతంలో రెండు భాగాలుంటాయి. దీనిలో 8.33 శాతం ఎంప్లాయిస్‌ పెన్షన్‌ స్కీమ్‌ ఈపీఎస్‌కు వెళ్తుంది. మిగతా 3.67 శాతం ఈపీఎఫ్‌ స్కీమ్‌కు జమ చేస్తారు. ఇది సదరు వ్యక్తి ఉద్యోగ విరమణ పొందాక నెలనెలా పెన్షన్‌ పొండానికి, మధ్యలో ఏవైనా అత్యవసర పరిస్థితి వస్తే వాడుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ నేథ్యంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు ఓ శుభవార్త. ఇకపై కనీస పెన్షన్‌ 7500 రూపాయలకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు..

కనీస పెన్షన్‌కు సంబంధించి.. 2014లో అప్పటి కేంద్ర ప్రభుత్వం.. ఈపీఎస్‌-1995 పరిదిలోని పెన్షనర్లకు కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.1000గా నిర్ణయించింది. అయితే ఈ మొత్తాన్ని 7500 రూపాయలకు పెంచాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. అయితే త్వరలోనే ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది అంటున్నారు. అందుకు కారణం కనీస పెన్షన్‌ను 7500 రూపాయలకు పెంచాలంటూ.. పెన్షనర్ల బాడీ ఈపీఎస్‌-95 జాతీయ ఉద్యమ కమిటీ నేడు ధర్నాకు పిలుపునిచ్చింది. కనీస పెన్షన్‌ పెంపుపై ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి.. ఎన్నో ఏళ్లుగా పెన్షనర్లు.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వారి రిక్వెస్ట్‌ను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే.. నేడు జాతీయ ఉద్యమ కమిటీ జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది.

ఈపీఎఫ్, ఈపీఎస్-95 మధ్య తేడా ఏంటంటే..

ఈపీఎఫ్, ఈపీఎస్ అనేవి రెండూ రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించే పథకాలే. వీటిని ఈపీఎఫ్, ఇతర నిబంధనల చట్టం 1952 ప్రకారం నిర్వహిస్తారు. ఈపీఎఫ్‌కయితే ఉద్యోగులు, యాజమాన్యాలు తమ వంతు కంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈపీఎస్‌ విషయానికి వస్తే.. ఉద్యోగుల కంట్రిబ్యూషన్ లేకుండానే ఈపీఎస్ పెన్షన్ ఇస్తుంది. ఇక ప్రస్తుతం పెన్షనర్లు.. నెలకు సగటున రూ.1450 పెన్షన్‌ పొందుతున్నారు. వీరిలో 3.6 మిలియన్ల మంది పెన్షనర్లు నెలకు రూ.1000 కన్నా తక్కువ పెన్షన్‌ అందుకుంటున్నారని కమిటీ తెలిపింది.

దీన్ని పెంచాలనే అంశంతో పాటు తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఈపీఎస్ 95 జాతీయ ఉద్యోమ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం వారు నేడు అనగా.. జులై 31, 2024 రోజున జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపాలని నిర్ణయించినట్లు తెలిపారు

Show comments