కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.2 లక్షలు.. ఎలాగంటే?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎగిరి గంతేసే వార్త అని చెప్పవచ్చు. వారి ఒక్కొక్కరి ఖాతాలో 2 లక్షలు జమ కానున్నాయి. ఎలా అంటే

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎగిరి గంతేసే వార్త అని చెప్పవచ్చు. వారి ఒక్కొక్కరి ఖాతాలో 2 లక్షలు జమ కానున్నాయి. ఎలా అంటే

కొత్తగా కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం మీద సామాన్యలతో పాటు.. అన్ని రంగాల వారికి పెద్ద ఎత్తున ఆశలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఈ నెల అనగా జూలైలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ని ప్రవేశపెట్టనుంది. నిర్మలమ్మ సమర్పించబోయే పద్దు మీద సామాన్యులతో పాటు అన్ని వర్గాల వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఉద్యోగులైతే.. కనీసం ఈ బడ్జెట్‌లో అయినా తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుకుంటున్నారు. వారి ఆశలు ఫలిస్తే.. పెండింగ్‌లో ఉన్న అంశాలపై క్లారిటీ వస్తే.. ఉద్యోగులు ఒక్కొక్కరి ఖాతాలో 2 లక్షల రూపాయల నగదు జమ కానుంది. ఆ వివరాలు..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి డియర్‌నెస్‌ అలవెన్స్‌ (డీఏ), డియర్‌నెస్‌ రిలీఫ్‌(డీఆర్‌)లు భారీగా బకాయిలున్నాయి. కరోనా సమయంలో సుమారు 18 నెలలకు చెందిన డీఏ, డీఆర్‌లను కేంద్ర ప్రభుత్వం అప్పట్లో నిలిపివేసింది. ఇవన్ని అవుట్‌ స్టాండింగ్‌ అలవెన్సులుగా మిగిలిపోయాయి. వీటిని చెల్లించాలని ఎప్పటి నుంచో ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. 2020 జనవరి నుంచి 2021 జూన్‌ వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ, డీఆర్‌లను ప్రభుత్వం చెల్లించలేదు. ఉద్యోగులు, పెన్షనర్లు కలుపుకుని ఏకంగా కోటి మందికి పైగా డీఏ, డీఆర్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో వీటిని చెల్లించాలని కోరుతూ ఉద్యోగ, పెన్షనర్‌ సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశాయి. ఇదే విషయంపై గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. వీరి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి పాత బకాయిలు చెల్లించేందుకు అంగీకరిస్తే.. ఒక్కొక్క ఉద్యోగి సుమారు 2 లక్షల రూపాయల వరకు ప్రయోజనాలు పొందుతారు. దీని ప్రకారం అత్యల్పంగా లెవల్‌ 1 ఉద్యోగుల డీఏ ఎరియర్లు రూ.11,800-రూ.37,554 గా ఉంది. అలానే లెవల్‌ 13 ఉద్యోగుల ఎరియర్లు రూ.1,23,100-రూ.2,15,900 గా ఉంది. ఇక అందరికన్నా అత్యధికంగా లెవల్‌ 14 ఉద్యోగుల డీఏ ఎరియర్లు రూ.1,44,200-2,18, 200 రూపాయలుగా ఉంది.

కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లిస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ చెల్లింపు ఉంటుంది. ఉద్యోగుల లివింగ్‌ ఖర్చులకు ఇవి ఉపయోగపడుతుంటాయి. మరి ఈ బకాయిలపై మోదీ సర్కార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Show comments