Bigg Boss 8 తెలుగు సీజన్ లో నెవర్ బిఫోర్ ట్విస్టులు.. పూర్తి గేమ్ ప్లాన్ ఇదే!

Bigg Boss Telugu Season 8 Full Game Planning And Twists: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇంకో మూడ్రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా ఈసారి షో ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నలు అందరిలో ఉన్నాయి. అయితే ఈసారి నెవర్ బిఫోర్ కాన్సెప్ట్ తో షో ఉండబోతోంది.

Bigg Boss Telugu Season 8 Full Game Planning And Twists: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇంకో మూడ్రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా ఈసారి షో ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నలు అందరిలో ఉన్నాయి. అయితే ఈసారి నెవర్ బిఫోర్ కాన్సెప్ట్ తో షో ఉండబోతోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మీద చాలానే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా బుల్లితెర ఫ్యాన్స్ ఈసారి సీజన్ 8 నుంచి చాలానే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. వాటికి తగినట్లుగా బిగ్ బాస్ నిర్వాహకులు కూడా గట్టిగానే ప్లా చేస్తున్నట్లు తెలుస్తోంది. లాస్ట్ సీజన్ అందరికీ మంచి హోప్ ఇచ్చింది. అందుకు తగినట్లుగానే ఈసారి కూడా ఉల్టాపుల్టాలు, ఆడియన్ అంచనాలకు అందని టాస్కులు, నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఇప్పటికే ప్రోమోల ద్వారా ఈ విషయాన్ని అయితే క్లారిటీ ఇచ్చేశారు. బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అవుతాయని సత్య ద్వారా చెప్పించారు. అప్పటికే రాజ భోగాలు అందించి.. అప్పటికే బికారిని చేసే ఛాన్స్ ఉందని చెప్పకనే చెప్పేశారు. మరి.. అసలు ఈసీజన్ ఎలా ఉండబోతోందో చూద్దాం.

కంటెస్టెంట్స్:

ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో ఆచితూచి వ్యవహరించినట్లు కనిపిస్తోంది. దాదాపుగా హౌస్ లో క్లిక్ అయ్యేవాళ్లు.. రచ్చ చేయగలిగిన వారినే తీసుకున్నారు. సీజన్ 8లో హౌస్ లోకి కేవలం 14 మంది కంటెస్టెంట్స్ ని మాత్రమే పంపబోతున్నారు. మహా అయితే ఇంకో ఇద్దరిని కలిపి 16 మందిని పంపిస్తారు. ఆ తర్వాత వైల్డ్ కార్డుల ఆట స్టార్ట్ అవుతుంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపుగా ఏడుగురు వరకు వైల్డ్ కార్డ్స్ రూపంలో హౌస్ లెకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా స్ట్రైట్ కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా.. వైల్డ్ కార్డుల విషయంలో కూడా పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తున్నారు. చివరి క్షణంలో కూడా వైల్డ్ కార్డ్ రూపంలో ఎవరినైనా పంపేందుకు ఛాన్స్ ఉంది.

పాత కంటెస్టెంట్స్:

ఈసారి సీజన్ లో ఉండబోయే అతి పెద్ద మార్పు ఏంటంటే.. గత సీజన్స్ నుంచి కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపబోతున్నారు. అది ఎప్పుడైనా జరగచ్చు. వైల్డ్ కార్డు ఎంట్రీల రూపంలో ఎవరినైనా ఈసారి హౌస్ లోకి పంపే అవకాశం కనిపిస్తోంది. అయితే విన్నర్స్ ని పంపరు అనడానికి లేదు. గత సీజన్స్ లో విన్నర్స్ గా నిలిచిన వారిని, రన్నర్స్ గా నిలిచిన వారిని.. ఇలా ఎవరినైనా హౌస్ లోకి పంపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అచ్చం బిగ్ బాస్ హిందీ సీజన్ 8 తరహాలోనే తెలుగు సీజన్ కూడా జరగబోతోంది అంటున్నారు. టీమ్ కూడా హిందీ వాళ్లే వచ్చారు అని టాక్ నడుస్తోంది. ఈసారి సీజన్ లో బిగ్గెస్ట్ నిర్ణయం ఇదే అని చెప్పాలి.

హౌస్- నిర్ణయాలు:

బిగ్ బాస్ హౌస్ అయితే పూర్తైంది. ఈసారి హౌస్ డిజైన్ ని చాలా కొత్తగా ప్లాన్ చేశారు అని తెలుస్తోంది. అంటే రూమ్స్ విషయంలో మాత్రం సీజన్ 7 స్ట్రాటజీనే వాడుతున్నారు అని సమాచారం. అంటే గత సీజన్ లో ఆ బెడ్ రూమ్ కాన్సెప్ట్ వల్ల గ్రూపులు ఎర్పడటం.. హౌస్ లో గొడవలు బాగా జరిగాయి. కాబట్టి ఈసారి కూడా అలాంటి స్ట్రాటజీనే వాడే అవకాశాలు ఉన్నాయి. ఈసారి కూడా యాక్టివిటీ రూమ్ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే థీమ్ ని ఈసారి జీనీ స్టైల్ లో ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తోంది. అందుకు తగిన హింట్ ని ప్రోమోల ద్వారా ఇచ్చేశారు. నాగార్జున ను జీనీ తరహాలో చూపించారు. అలాగే హౌస్ లో ఏదైనా టాస్కులో గెలిచిన వారికి జీనీ తరహాలు మూడు వరాలు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఆ పవర్స్ తో వాళ్లు ఏం చేస్తారు అనేది చూడాలి. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఏవీలు కూడా షూట్ చేయడం అయిపోయింది. డ్యాన్స్ రిహార్సల్స్ మిగిలి ఉన్నాయి. ఆగస్టు 31న డ్యాన్స్ పర్ఫార్మెన్సులు షూట్ చేయడం.. ఒక్కరిగా హౌస్ లోకి పంపేయడం జరిగిపోతుంది. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తుంటే.. డ్యాన్స్ పర్ఫార్మెన్సులు అదిరిపోతాయి అని క్లారిటీ అయితే ఉంది. మరి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎలా ఉండబోతోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments