Naga Manikanta: బిగ్ బాస్ కంటెస్టెంట్ నాగ మణికంఠ బ్యాగ్రౌండ్ ఇదే.. ఎమోషనల్ స్టోరీ!

Bigg Boss 8 Contenstant Naga Manikanta: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఘనంగా ప్రారంభమైంది. కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ గా తమ పర్ఫార్మెన్స్ లతో ఎంట్రీ ఇచ్చారు. పదో కంటెస్టెంట్ గా నటుడు నాగ మణికంఠ ఎంట్రీ ఇచ్చి..తన మాటలతో అందరిని ఎమోషనల్ చేశాడు. ఈ క్రమంలో అతడి బ్యాగ్రౌండ్ గురించి ఇప్పుడు చూద్దాం...

Bigg Boss 8 Contenstant Naga Manikanta: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఘనంగా ప్రారంభమైంది. కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ గా తమ పర్ఫార్మెన్స్ లతో ఎంట్రీ ఇచ్చారు. పదో కంటెస్టెంట్ గా నటుడు నాగ మణికంఠ ఎంట్రీ ఇచ్చి..తన మాటలతో అందరిని ఎమోషనల్ చేశాడు. ఈ క్రమంలో అతడి బ్యాగ్రౌండ్ గురించి ఇప్పుడు చూద్దాం...

ప్రపంచంలోనే నెంబర్ వన్ రియాల్టీ షో బిగ్ బాస్. అనేక భాషాల్లో ఎంతో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. తెలుగులో సైతం ఇప్పటికే ఏడు సీజన్లు  పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ లోకి అడుగు పెట్టింది.  ఆదివారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. మరోసారి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యహారించి అలరించారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇక కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా హౌస్ లోకి వస్తూ తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. గత సీజన్లకు భిన్నంగా ఈసారి హౌస్ లోకి ఒంటరిగా కాకుండా జంటగా లోపలకి పంపుతున్నారు. అందరు కంటెస్టెంట్స్ సరదగా, నవ్వుతూ  హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే.. కానీ నాగ మణి కంఠ మాత్రం అందరినీ ఎమోషనల్ చేశాడు. నాగ మణికంఠ బ్యాగ్రౌండ్ స్టోరీ తెలిస్తే..కచ్చితంగా కన్నీరు పెట్టక మానరు. మరి.. ఆయన బ్యాగ్రౌండ్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పదో కంటెస్టెంట్ గా నటుడు నాగ మణికంఠ ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ స్టార్టింగ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ల్లో నటించి నాగ మణికంఠ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ వచ్చిన ఫేమ్ తో సీరియల్స్ లో అవకాశం వచ్చింది.  ప్రస్తుతం నాగ మణికంఠ  పలు సీరియల్స్ లో నటిస్తున్నాడు. ఇక నాగ మణికంఠ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఇతడు పుట్టిన రెండేళ్లకే నాన్న చనిపోయాడు. దీంతో అతడి తల్లి రెండో  పెళ్లి చేసుకుంది.

ఇక నాగ మణికంఠకు ఊహ తెలిసే సరికి  తన ముందు ఉన్నది తన తండ్రి కాదని తెలిసింది. అంతేకాక అతడిని తన తండ్రిగా యాక్సెప్ట్ చేయలేకపోయాడు.  అంతేకాక తరచూ ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. ఇవే చాలాదన్నట్లు  నాగ మణికంఠ తల్లికి క్యాన్సర్  వచ్చింది. దీంతో ఆమెను కాపాడుకోవాలని అతడు విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయినా ఫలితం లేకుండా పోయింది…2019లో అతడు తల్లిని కోల్పోయాడు. ఆమెకు పెద్ద కర్మ చేసిన మరుసటి రోజ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు.

దేవుడు మనకు  జరిగిన లోటును ఏదో ఒక రూపంలో భర్తి చేస్తాడనన్నట్లు తల్లి లేని బాధ, ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో అతడి  మంచి ఉద్యోగం వచ్చింది. అయితే జాబ్ రావడాన్ని ఎవరితోనే షేర్ చేసుకోలేదు. సైలెంట్ గా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే అతడికి అమెరికాలో ఉండగా ఓ పాప జన్మించింది. తన తల్లే  తిరిగి పుట్టిందని సంతోషించాడు. ఇలా హాయిగా ఉన్న సమయంలో మరో కష్టం అతడిని పలకరించింది. సంసారంలో గొడవల కారణంగా భార్యతో విడిపోవాల్సి వచ్చింది.  ఈక్రమంలోనే యూఎస్ఏ నుంచి ఇండియాకు తిరిగి వచ్చేశాడు. ఇన్ని కష్టాలు చూసిన తరువాత కూడా ధైర్యంగా ముందడగు వేసి.. నటుడిగా బుల్లితెరపై  స్థానం సంపాదించాడు. అంతేకాక అక్కడ మంచి గుర్తింపు  సంపాదించాడు. చివరకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎనిమిదోలో అడుగు పెట్టే అవకాశం సంపాదించాడు. పదో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు.

బిగ్ బాగ్ 8లోకి ఎంట్రీ ఇస్తూ నాగార్జునతో తన లైఫ్ స్టోరీ గురించి చెప్పుకున్నాడు. లైఫ్‌తో గ్యాంబిల్ ఆడి వచ్చానని, ఈ గ్యాంబిల్ ఆడటం తనకు కొత్తేమీ కాదని నాగ మణికంఠ ధీమాగా చెప్పాడు.  ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..నీ కథ బయోపిక్ తీస్తే ఏం పేరు పెడతావని అడగ్గా.. ఆఖరి పోరాటమని  సమాధానం ఇస్తాడు మణికంఠ. బిగ్‌బాస్ ద్వారా నేను కోల్పోయిన రెస్పెక్ట్‌ని మళ్లీ సాధించుకుంటానని  తెలిపాడు. మరి.. నాగ మణికంఠ  లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments