యష్మీ- ప్రేరణను కాపాడుతోందా? ముంచేస్తోందా? ఇదిగో క్లారిటీ..

Bigg Boss Telugu 8- Is Yashmi Ruining Prerana Game: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్ లో ఆట ఆసక్తిగా మారుతోంది. ఎప్పుడు చూడు గొడవలు మాత్రం కచ్చితంగా ఉంటున్నాయి. అలాగే ఎవరో ఒకరు విలన్ గా కూడా మారుతున్నారు. తాజాగా ప్రేరణ హౌస్ లో చాలామందికి విలన్ లా కనిపించింది.

Bigg Boss Telugu 8- Is Yashmi Ruining Prerana Game: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్ లో ఆట ఆసక్తిగా మారుతోంది. ఎప్పుడు చూడు గొడవలు మాత్రం కచ్చితంగా ఉంటున్నాయి. అలాగే ఎవరో ఒకరు విలన్ గా కూడా మారుతున్నారు. తాజాగా ప్రేరణ హౌస్ లో చాలామందికి విలన్ లా కనిపించింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి బాగా వినిపిస్తున్న పేరు యష్మీ గౌడ. నిజానికి నిన్నటి వరకు ఎక్కువగా సోనియా పేరు వినిపించింది. కానీ, ఇప్పుడు మాత్రం ఆమెను యష్మీ డామినేట్ చేస్తోంది. అయితే ఇదంతా పాజిటివ్ వేలో జరిగితే బాగానే ఉండేది. కానీ, అంతా నెగిటివ్ వేలో జరగడం కాస్త ఇబ్బందికరంగానే ఉంది. యష్మీ మీద నెట్టింట ట్రోలింగ్ అయితే పతాక స్థాయికి చేరిపోయింది అని చెప్పాల్సిందే. ఆమె ఇన్ స్టా పేజ్ లో కూడా పోస్టింగుల కింద యష్మీని ఎలిమినేట్ చేయాలి అని కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి కామెంట్స్ వస్తే వాటికి వేలల్లో లైకులు రావడం మరింత ఆశ్చర్యం కలిగించే అంశం అనే చెప్పాలి. అయితే యష్మీ ఎలా ఆడినా కూడా అది ఆమె వ్యక్తిగతం. కానీ, ఆమె వల్ల మరో కంటెస్టెంట్ ఆట పాడైతే మాత్రం తప్పు అనే చెప్పాలి. ఇప్పుడు యష్మీ గైడెన్స్ లో ప్రేరణ ఆట పాడు చేసుకుంటోంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ హౌస్ లో పర్మినెంట్ మిత్రులు.. పర్మినెంట్ శత్రువులు ఉండరు. ఇప్పుడు భాయ్ భాయ్ అనుకున్న వాళ్లు బద్ద శత్రువులు కూడా కావచ్చు. బిగ్ బాస్ హౌస్ లో మంచి చెప్తున్నారు అని గుడ్డిగా నమ్మడానికి కూడా లేదు. బయట ఫ్రెండ్స్ అని చెప్పి హౌస్ లోకి వెళ్లాక రాసుకు పూసుకు తిరిగితే మొదటికే మోసం వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అలాంటి ప్రమాదంలో ఇప్పుడు ప్రేరణ కనిపిస్తోంది. ఇప్పటి వరకు హౌస్ లో ఎలాంటి శత్రుత్వాలు లేకుండా.. కాస్తో కూస్తో మంచి పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే.. ప్రేరణ పేరు చెప్పచ్చు. అయితే అది గురువారంతో ముగిసిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే నిన్న సాక్స్ తో జరిగిన టాస్క్ లో సంచాలక్ గా ఉన్న పాపానికి ప్రేరణ ఎంతో మందికి శత్రువుగా మారిపోయింది. అందులో ఎక్కువ భాగం బాధ్యత యష్మీనే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే టాస్కులో ఎక్కువ నిర్ణయాలు యష్మీ ఇన్ ఫ్లుఎన్స్ వల్లే తీసుకున్నట్లు కనిపించింది. కేకలు పెడుతూ.. కాసేపు ఎంతో వైలెంట్ గా కనిపించింది.

 ప్రేరణ- యష్మీ ఇద్దరూ ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. వాళ్లు హౌస్ లోకి వచ్చిన తర్వాత బాగానే క్లోజ్ గా ఉంటున్నారు. గ్రూప్ గేమర్స్ అని ఆరోపణలు చేస్తే.. నిఖిల్ అయినా తప్పుకున్నాడు కానీ, ప్రేరణ- యష్మీ మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత ఇద్దరూ ఒకే క్లాన్ కూడా అయ్యారు. ఈ వీక్ ప్రేరణను నామినేషన్స్ నుంచి సేవ్ చేసినందుకు కచ్చితంగా ప్రేరణపై ఎంతో కొంత యష్మీ ఇన్ ఫ్లు ఎన్స్ అయితే ఉంటుంది. అదే ఇప్పుడు ప్రేరణ కొంప ముంచేలా కనిపిస్తోంది. ప్రేరణపై చాలానే ప్రెజర్ కనిపించింది. అందులో ఎక్కువ యష్మీ తీసుకొచ్చిందే ఉండటం విశేషం. ఏదైనా ఇబ్బందికర డెసిషన్ రాగానే ముందే వచ్చేసి యష్మీ గైడ్ చేయడం చేసింది. ముఖ్యంగా విష్ణుప్రియ- నబీల్ డెసిషన్స్ ప్రేరణకు బాగానే నెగిటివ్ అయ్యాయి.

నిఖిల్ ని మోటివేట్ చేసిన యష్మీ.. అతను గెలిస్తే తట్టుకోలేకపోయింది. మరి.. అతడిని మోటివేట్ చేసింది నిజమా? బాధ పడింది నిజమా? అలాగే ప్రేరణను కూడా యష్మీ ఇన్ ఫ్లుఎన్స్ చేస్తోంది ఏమో అని అనుమానాలు ఉన్నాయి. అయితే అది గేమ్ లో భాగంగా యష్మీ తన క్లాన్ గెలుపు కోసం చేసిన పోరాటంలో జరిగిన పొరపాట్లు కూడా కావచ్చు. కానీ, మొత్తానికి విలన్ మాత్రం ప్రేరణ అయ్యింది. మరి.. ప్రేరణ ఆటను యష్మీ పాడు చేస్తోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments