Tirupathi Rao
Bigg Boss 8- Is Abhay And Soniya Playing Group Game: బిగ్ బాస్ హౌస్ అంటే చాలానే ప్లానింగ్ ఉంటుంది. చాలా మంది పక్కా ప్రణాళికలతో హౌస్ లోకి వస్తారు. అయితే ఎవరూ కూడా కలిసి ఆడుతున్నాం అని ఒప్పుకోరు. మనమే వాళ్ల ఆట తీరును బట్టి కనుక్కోవాల్సి వస్తుంది.
Bigg Boss 8- Is Abhay And Soniya Playing Group Game: బిగ్ బాస్ హౌస్ అంటే చాలానే ప్లానింగ్ ఉంటుంది. చాలా మంది పక్కా ప్రణాళికలతో హౌస్ లోకి వస్తారు. అయితే ఎవరూ కూడా కలిసి ఆడుతున్నాం అని ఒప్పుకోరు. మనమే వాళ్ల ఆట తీరును బట్టి కనుక్కోవాల్సి వస్తుంది.
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో బాగా వినిపించిన పేరు సోనియా.. ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు అభయ్ నవీన్. సోనియా తనదైన గేమ్ ప్లాన్ తో హౌస్ లోనే కాకుండా.. బయట కూడా కాస్త ఎక్కువగానే నెగిటివిటీని మూటగట్టుకుంది. అయితే ఇప్పుడు మొత్తం మారిపోయింది అనే చెప్పాలి. ఎందుకంటే విష్ణుప్రియతో ఇంక తన గొడవను కంటిన్యూ చేయకూడదు అని ఫిక్స్ అయిపోయింది. దానికి తగినట్లుగానే విష్ణు ఉన్న క్లాన్ లోకే వెళ్లింది అని అర్థమవుతోంది. అయితే మొదటి నుంచి గ్రూప్ గేమ్ ని వ్యతిరేకించే.. సోనియా గ్రూప్ గేమ్ ఆడుతోంది అని తెలుస్తోంది. అది కూడా అభయ్- సోనియా కలిసే బిగ్ బాస్ కి వచ్చారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి మనం చెప్పినవి కాదు.. వాళ్ల మాటల్లో వాళ్లే చెప్పుకుంటూ వచ్చారు. అభయ్ అసలు విషయాన్ని రివీల్ చేశాడు. అది కూడా ఒకసారి కాదు.. రెండు సందర్భాల్లో చెప్పాడు.
అభయ్- సోనియా కలిసే ఆడుతున్నారు అని చాలామందికి అనుమానం వచ్చే ఉంటుంది. కానీ, ఎక్కడో ఒక మూల మాత్రం అలా ఏం ఉండదులే అనుకున్నారు. కానీ, వాళ్లు కలిసే ఆడుతున్నారు అని అనుమానాలు రావడానికి చాలానే ఉదాహరణలు ఉన్నాయి. ఎక్కువ సమయం అభయ్- సోనియా కలిసి ఉండటాన్ని మీరు చూసే ఉంటారు. వాళ్లిద్దరు ప్రతి విషయంలో ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇద్దరూ దాదాపుగా ఒకే మాట మీద ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే మరీ ముఖ్యంగా చీఫ్ ఎంపిక విషయంలో ఇచ్చినమ్మ వాయనం.. పుచ్చుకున్న వాయనం తరహాలో ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకున్నారు. ఆ విషయాన్ని నాగార్జున కూడా ప్రశ్నించారు. కానీ, అలా ఏం లేదు అంటూ తప్పించుకున్నారు. ఆ తర్వాత వాళ్ల మాటల్లోనే ఆ విషయాన్ని చెప్పేశారు. అభయ్- సోనియా కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.
సోనియా కూర్చుని అభయ్ ని ఒక ప్రశ్న అడుగుతుంది. విష్ణు ఏంటి బయాస్డ్ అని నా వైపు చూపిస్తుంది? ఒకసారి ఏమో నీ మీద చెప్పింది.. ఎందుకు అలా మాట మారుస్తోంది అంటూ అడుగుతుంది. అందుకు అభయ్ అసలు క్లారిటీ ఇస్తాడు. విష్ణు నన్ను ముందే అడిగింది. నువ్వు కొంచం సోనియా అంటే బయాస్డ్ గా ఉంటున్నావ్ అని చెప్పింది. చీఫ్ గా సెలక్ట్ చేసుకునే సమయంలో ఆమెలో కనిపించని క్వాలిటీస్ ని నువ్వు చెప్పావు అంటుంది. అందుకు అభయ్ క్లారిటీ ఇచ్చానని చెప్తాడు. “ఆమె నాకు పదేళ్లుగా తెలుసు.. ఆమె అలాంటిది కాదు. ఎంతో మంచిది.. మనుషులకు చాలా వ్యాల్యూ ఇస్తుంది. అందరితో మంచిగా ఉంటుంది. ఆమెకు కమాండింగ్ వాయిస్ ఉంటుంది. అందుకే చీఫ్ అయితే బాగుంటుంది” అని చెప్పినట్లు వివరించాడు.
అయితే ఇక్కడే అసలు వీళ్ల ఆట ఏంటో తెలిసింది అంటున్నారు. వాళ్లకి పదేళ్లుగా పరిచయం ఉంటే.. కచ్చితంగా కలిసే బిగ్ బాస్ హౌస్ కి వచ్చి ఉంటారు కదా? గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కలిసే వచ్చారు అనుకుందాం? అయితే తప్పేంటి అని ప్రశ్నిస్తే.. తప్పు ఏమీ లేదు. ఎవరు ఎలాంటి స్ట్రాటజీలతో అయినా రావచ్చు. కానీ, గ్రూప్ గేమర్స్ అని యష్మీ- నిఖిల్ కి ట్యాగ్ ఇచ్చింది సోనియానే. యష్మీని చీఫ్ గా ఎంపిక చేయడంపై చాలానే గొడవ చేసింది. హౌస్ మొత్తాన్ని అదరగొట్టింది కూడా.
కానీ, ఇప్పుడు అభయ్ సపోర్ట్ చేసింది కూడా గ్రూప్ గేమ్ లాగానే కనిపిస్తోంది. అప్పుడు అలా అన్న సోనియా ఇప్పుడు ఇలాంటి తప్పు ఎందుకు చేసింది? అనేదే అసలు ప్రశ్న. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలాంటి స్ట్రాటజీలు అయినా ప్లే చేయచ్చు. కావాలనే అభయ్- సోనియా కలిసి కూడా గేమ్ ఆడచ్చు. చివరికి అభిమానులు ఎవరి ఆటకు పట్టం కడితే వాళ్లే హౌస్ లో విన్నర్స్ గా నిలుస్తారు. అయితే అభయ్- సోనియా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనే విషయం మాత్రం క్లారిటీ వచ్చింది అంటున్నారు. మరి.. అభయ్- సోనియా కలిసే ఆడుతున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.