Tirupathi Rao
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 2.0లో ప్రతి సీన్ క్లైమాక్స్ అన్నట్లుగా సాగుతోంది. వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత ఇంక ఎవరూ హౌస్ లోకి రారులే అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ, విచిత్రంగా సింగర్ ధామినీ, శుభశ్రీ, రతికా రోజ్ లను హౌస్ లోకి పంపి వారిలో ఒకరిని హౌస్ లోకి తీసుకొస్తాం అని షాకిచ్చారు. అందుకు హౌస్ మేట్స్ చేత ఓటింగ్ కూడా వేయించారు. అయితే ప్రేక్షకులు అందరూ రతికా రోజ్ హౌస్ లోకి రావాలి అని కోరుకున్నారు. కానీ, ఆమె వచ్చే అవకాశాలు లేవనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే రతికా రోజ్ ఇప్పుడు బిగ్ బాస్ కంటే గొప్ప అవకాశాన్ని కొట్టేసింది. అదేంటంటే.. రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.
రతికా రోజ్ కు బిగ్ బాస్ వల్ల వచ్చిన నెగిటివిటీ అంతా ఇంతా కాదు. హౌస్ లోకి వచ్చిన మొదటి వారం నుంచే రతికాపై నెట్టింట విపరీతమైన ట్రోల్స్ నడిచాయి. ఆమె ఎలిమినేట్ అయ్యిందని తెలిసి చాలా సంబరాలు చేసుకున్నారు. బిగ్ బాస్ హిస్టరీలో ఇలాంటి ఒక సందర్భాన్ని ఎక్కడా చూడలేదు. తన కెరీర్ కు ఎంతో ఉపయోగపడుతుందని అనుకుని రతికా రోజ్ హౌస్ లోకి వెళ్లింది. అయితే అంతా రివర్స్ అయిందని చాలా బాధ పడింది. తాను కావాలని అలా చేయలేదు అంటూ అందరికీ క్లారిటీ కూడా ఇచ్చుకుంది. తన వ్యూహాలు బెడిసికొట్టాయంది. అయితే తాను ఏదైతే అనుకుని హౌస్ లోకి వెళ్లిందే.. ఆ కల నెరవేరింది. ఎందుకంటే ఆమెకు ఏకంగా రాఘవేంద్రరావు సినిమాలో అవకాశం దక్కింది.
రాఘవేంద్రరావు సినిమాలో రతికా రోజ్ లీడ్ రోల్ ప్లే చేయబోతోంది. ఆ విషయాన్ని స్వయంగా రతికా రోజ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. తన మూవీకి సంబంధించిన ఒక న్యూస్ ఆర్టికల్ ని తన ఇన్ స్టా పేజ్ లో పోస్ట్ చేసింది. తన కల నెరవేరింది అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి తాను ఏదైతే అనుకుని హౌస్ లోకి వెళ్లిందో.. చివరకు అది సాకారమైంది. ఇలాంటి సమయంలో రతికా రోజ్ తిరిగి హౌస్ లోకి అడుగుపెడుతుందా? అని అడిగితే కష్టమనే చెప్పాలి. ప్రస్తుతానికి రతికాపై బయట కూడా అంత నెగిటివిటీ లేదు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పుడు ప్రేక్షకులు కూడా రతికా రోజ్ హౌస్ లోకి రావాలి అని కోరుకుంటున్నారు. పైగా ఓటింగ్ లో కూడా నాగార్జున బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.
ఎక్కువ ఓట్లు పడిన వాళ్లు రీ ఎంట్రీ ఇవ్వరని.. తక్కువ ఓట్లు పడిన వాళ్లే రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. అలా చూస్తే శుభశ్రీకి హౌస్ లోకి వచ్చే అవకాశం ఉండదనే చెప్పాలి. ఎందుకంటే ఆమెకు ఎక్కువ ఓట్లు పడతాయి. అలాగే రతికా, ధామినీతో పోలిస్తే ధామినీకి కూడా ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది. ఓటింగ్ పరంగా రతికా రోజ్ కు హౌస్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, సినిమా ఆఫర్, మళ్లీ హౌస్ లోకి వెళ్లి నెగిటివ్ అవ్వాలా? అనే ప్రశ్నలు గనుక తన మైండ్ లోకి వస్తే రతికా రోజ్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనే చెప్పాలి. కానీ, రతికా రోజ్ రీ ఎంట్రీ ఇస్తే మాత్రం ఆట మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంటుంది. మరి.. రతికా రోజ్ రీ ఎంట్రీ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.