Nidhan
Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ రియాలిటీ షో తెలుగులో ఎంత బాగా క్లిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో వస్తోందంటే చాలు.. ఆడియెన్స్ టీవీలకు అతుక్కుపోతారు. అలాగే షో ముగిశాక నెక్స్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తుంటారు.
Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ రియాలిటీ షో తెలుగులో ఎంత బాగా క్లిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో వస్తోందంటే చాలు.. ఆడియెన్స్ టీవీలకు అతుక్కుపోతారు. అలాగే షో ముగిశాక నెక్స్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తుంటారు.
Nidhan
బిగ్‌బాస్ రియాలిటీ షో తెలుగులో ఎంత బాగా క్లిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో వస్తోందంటే చాలు.. ఆడియెన్స్ టీవీలకు అతుక్కుపోతారు. నెక్స్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తుంటారు. ఎన్నో సంచలనాలతో పాటు పలు వివాదాలకు కూడా ఈ షో వేదికగా నిలిచింది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు సినీ రంగం, టెలివిజన్ రంగానికి చెందిన వారు కావడంతో అందరి ఫోకస్ షో మీదే ఉంటోంది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్లు కూడా పాల్గొనడంతో రేటింగ్స్ అదిరిపోతున్నాయి. ఇప్పటికే 7 సీజన్లు కంప్లీట్ చేసుకున్న తెలుగు బిగ్‌బాస్.. త్వరలో ఎనిమిదో సీజన్లోకి అడుగుపెట్టనుంది. ఇందులో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ గురించి రోజుకు కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి.
ఈసారి కంటెస్టెంట్స్‌ను బిగ్‌బాస్ టీమ్ ఆచితూచి ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. అడ్డగోలుగా కాకుండా షో చూసే ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్‌లా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఊహించని రీతిలో ఏకంగా ఓ టీమిండియా క్రికెటర్‌ను కంటెస్టెంట్‌గా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. భారత జట్టు తరఫున అద్భుతంగా ఆడుతూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడును షోలోకి తీసుకొచ్చేందుకు బిగ్‌బాస్ టీమ్ ట్రై చేస్తోందని సమాచారం. గ్రౌండ్‌లోనే కాదు బయట కూడా కాస్త దూకుడుగా ఉండే అతడ్ని షోలోకి తీసుకొస్తే కంటెంట్‌కు కొరత ఉండదని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. రాయుడు ఉంటే తెలుగుతో పాటు యూనివర్సల్ అప్పీల్ కూడా ఉంటుందనేది వాళ్ల ఆలోచన అని తెలుస్తోంది.
రాయుడు ఓకే అంటే ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకైనా బిగ్‌బాస్ నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారని రూమర్స్ వస్తున్నాయి. అయితే డబ్బుల కోసమైతే అతడు షోను ఓకే అనే ఛాన్స్ లేదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. టీమిండియాతో పాటు ఐపీఎల్లో ఆడుతూ బాగానే సంపాదించిన ఈ మాజీ క్రికెటర్.. ఈ మధ్యే కామెంట్రీ కూడా స్టార్ట్ చేశాడు. అలాగే రిటైర్ అయ్యాడు కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా పలు లీగ్స్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు రాజకీయాల మీద కూడా అతడు ఫోకస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కాదని.. బిగ్‌బాస్ షోకు రాయుడు రావడం కష్టమేనని చెబుతున్నారు. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప అతడు ఓకే చెప్పకపోవచ్చని కామెంట్స్ చేస్తున్నారు. కానీ అతడు షోలోకి వస్తే మాత్రం అదిరిపోతుందని అంటున్నారు. మరి.. రాయుడును బిగ్‌బాస్ షోలో చూడాలని మీరు కోరుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.