Bigg Boss 7: పల్లవి ప్రశాంత్ అరెస్ట్ వివాదం.. బిగ్ బాస్ మేకర్స్ కీలక నిర్ణయం.. వాటి రద్దు దిశగా ఆలోచనలు

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచి రికార్డు క్రియేట్ చేసిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. ఆ తర్వాత చేసిన పనులు వల్ల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచి రికార్డు క్రియేట్ చేసిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. ఆ తర్వాత చేసిన పనులు వల్ల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..

గత ఆరు సీజన్ లకు భిన్నంగా ఉల్టా పుల్టా అంటూ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7.. గత వాటికి భిన్నంగా సాగి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. గత సీజన్ లతో పోలీస్తే.. ఈ సారి సీజన్ 7 రేటింగ్స్ విషయంలో కూడా రికార్డు క్రియేట్ చేసింది. పైగా బిగ్ బాస్ చరిత్రలో.. ఇండియాలోనే తొలి సారి సామాన్యుడు, అందునా రైతు బిడ్డ బీబీ టైటిల్ విన్నర్ గా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తూ.. చివరకు వరకు కొనసాగడమే కాక.. విజేతగా నిలిచాడు.

అయితే బిగ్ బాస్ విన్నర్ గా గెలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తర్వాత చేసిన పనుల వల్ల అప్పటి వరకు తెచ్చుకున్న మంచి పేరు, క్రేజ్ ను పొగొట్టుకోవడమే కాక.. విమర్శల పాలయ్యాడు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట పల్లవి ప్రశాంత్ అభిమానులు కొందరు రణరంగం సృష్టించారు. రన్నరప్ అమర్ దీప్ కారు మీద దాడి చేసి నానా రభస చేశారు. అంతేకాక మిగతా కంటెస్టెంట్ల కార్లపై దాడి చేశారు. ఆర్టీసీ బస్సుల మీద రాళ్లు రువ్వారు. ఘర్షణల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ను సీక్రెట్ దారి గుండా బయటకు పంపారు పోలీసులు. కానీ తను మళ్లీ అన్నపూర్ణ స్టూడియో వద్దకు రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఈ క్రమంలో జూబ్లీహిల్స్  పోలీసులు.. పల్లవి ప్రశాంత్ మీద కేసు నమోదు చేశారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ అల్లర్లకు సంబంధించి మొత్తం 2 కేసులు నమోదు కాగా.. 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపై నిర్వహించబోయే సీజన్ లకు సంబంధించి.. కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

రానున్న కాలంలో నిర్వహించబోయే సీజన్లలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎలాంటి ర్యాలీలు నిర్వహించకుండా ముందే అగ్రిమెంట్ చేసుకోనున్నారట బిగ్ బాస్ మేకర్స్. కంటెస్టెంట్స్ గా ఎంపికైన వారికి ఈ మేరకు గట్టి సూచనలు ఇవ్వనున్నారట. ఎలిమినేటైన కంటెస్టెంట్స్, విన్నర్, ఫైనలిస్ట్స్ ఎవరూ ర్యాలీలు నిర్వహించకూడదని ముందుగానే ఆదేశాలు జారీ చేయనున్నారట. అలానే అభిమానులను అన్నపూర్ణ స్టూడియో వద్ద కలవడం లేకుండా చేయాలి అనుకుంటున్నారట బీబీ మేకర్స్.

హౌజ్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలు చేయకుండా నేరుగా ఇంటికి వెళ్లిపోయేలా బిగ్ బాస్ నిర్వాహకులు ముందుగానే ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందంటున్నారు. తాజాగా పోలీసులు కూడా కంటెస్టెంట్స్ ర్యాలీలు చేయకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే ఇక నెక్స్ట్ సీజన్ నుండి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ర్యాలీలు ఉండవు. ఈ వార్త తెలిసిన వారు.. ఇలా చేయడమే కరెక్ట్ అంటున్నారు.

 

Show comments