బిగ్ బాస్ సీజన్ 7.. డేట్ ఫిక్స్ అయినా ఆలస్యం ఎందుకు?

  • Author ajaykrishna Updated - 10:34 AM, Wed - 16 August 23
  • Author ajaykrishna Updated - 10:34 AM, Wed - 16 August 23
బిగ్ బాస్ సీజన్ 7.. డేట్ ఫిక్స్ అయినా ఆలస్యం ఎందుకు?

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7కి సిద్ధం అవుతోంది. ఈసారి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికి ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. 7వ సీజన్ పై ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే.. హోస్ట్ నాగార్జున ఆల్రెడీ.. పాత సీజన్స్ లా ఉండదని చెప్పేశాడు. బిగ్ బాస్ లోగో కూడా మార్చేశారు. సో.. కంటెస్టెంట్స్ కూడా అర్హత కలిగిన వారే ఉంటారని అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే.. రోజురోజుకి బిగ్ బాస్ కొత్త సీజన్ పైన ఆడియన్స్ ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తున్నారు నిర్వాహకులు. కొత్త కొత్త ప్రోమోలతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నప్పటికీ.. అసలు షో ఆరంభం ఎప్పుడు అనే విషయం మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు.

దీంతో ఇప్పుడు అందరిలో బిగ్ బాస్ షో ఎప్పుడు మొదలు కాబోతుంది? అనే ప్రశ్న మిగిలిపోయింది. ప్రోమోలతో అంచనాలు పెంచుతున్న బిగ్ బాస్ సీజన్.. కొన్ని కథనాల ప్రకారం.. సెప్టెంబర్ 3న ప్రారంభం కానుందని అంటున్నారు. ఈ తేదీని ఆల్రెడీ ఫిక్స్ చేశారని.. అధికారిక ప్రకటన రావడం మాత్రమే ఆలస్యం అని టాక్. అయితే.. షో డేట్ అనౌన్స్ చేయకపోవడానికి పలు కారణాలు కూడా వైరల్ అవుతున్నాయి. అదేంటంటే.. బిగ్ బాస్ 7 ఆరంభం కాబోయే డేట్ సెప్టెంబర్ 3 అయినప్పటికీ, ఇటీవల షోపై ఏర్పడిన వ్యతిరేకత, కోర్టు కేసుల కారణంగా నిర్వాహకులు ఆలస్యం చేస్తున్నారని వినికిడి.

బిగ్ బాస్ 7 అనౌన్స్ చేసినప్పటి నుండి షో పై ఎప్పటికప్పుడు వ్యతిరేక నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. గేమ్ ని నిషేధించాలని చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు షోని షో మాదిరే చూడాలని.. నిబంధనలకు కట్టుబడే షోని నిర్వహిస్తున్నట్లు బిగ్ బాస్ టీమ్ చెబుతుంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 3న షో ప్రారంభం కాకపోతే.. మరో రెండు వారాలు ఆగిన తర్వాత మొదలయ్యే అవకాశం ఉందట. ఇక కంటెస్టెంట్స్ గా ఎంపికైన వారిని ఆగష్టు చివరి వారంలో హోటల్ లో ఉంచుతారని అంటున్నారు. కాగా.. బిగ్ బాస్ 7 సెప్టెంబర్ 3న మొదలవుతుందా లేదా? అనేది టీమ్ నుండి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరి బిగ్ బాస్ 7 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments