పల్లవి ప్రశాంత్ నేరస్థుడు కాదు.. బాధితుడు: నటుడు శివాజీ

Shivaji Reacts On Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాలతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అతడి అరెస్టుపై నటుడు శివాజీ రియాక్ట్ అయ్యారు.

Shivaji Reacts On Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాలతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అతడి అరెస్టుపై నటుడు శివాజీ రియాక్ట్ అయ్యారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ షోతో ప్రశాంత్ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో.. అంత అపవాదు మూటగట్టుకున్నాడు. అతడు హౌస్ నుండి బయటకు రాకముందే భారీ ఎత్తున అభిమానులు అక్కడకు చేరుకుని నానా హంగామా సృష్టించాడు. బస్సులపై దాడి చేయడంతో పాటు సెలబ్రిటీ వాహనాల అద్దాలను రాళ్లతో పగులగొట్టారు. రన్నరప్ అమర్ దీప్ ఫ్యామిలీ వెళుతున్న కారుపై విచక్షణా రహితంగా ఎటాక్ చేశారు. అంతేకాకుండా ర్యాలీ వద్దని పోలీసులు మాటలను బేఖాతరు చేసిన ప్రశాంత్ అరెస్టు కడా అయ్యారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రశాంత్ కి మద్దుతగా ఉన్న శివాజీ.. ఈ ఇష్యుపై తొలిసారిగా స్పందించారు.

బిగ్ బాస్ సీజన్ 7లో రైతు బిడ్డాగా పేరు తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే అతడి విజయంలో నటుడు శివాజీ కీలక పాత్ర పోషించారనే టాక్ కూడా ఉంది. ఎందుకంటే.. హౌస్ లో ప్రశాంత్ కి శివాజీ మద్దతుగా నిలిచేవాడు. బిగ్ బాస్ హౌస్ లో జరిగిన అనేక గేమ్స్ లో , పలు సందర్భాల్లో ప్రశాంత్ కి సపోర్టుగా శివాజీ మాట్లాడిన సంగతి తెలిసిందే. అంతేకాక ప్రశాంత్ న విన్నర్ గా నిలబెడతానని కూడా పలు సందర్బాల్లో అన్నారు. అలానే బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా విన్నర్ గా నిలిచాడు. ఇక ఆ తరువాత జరిగిన పరిణామాల కారణంగా చివరకు ప్రశాంత్ జైలుకు వెళ్లాడు.

ఈ నేపథ్యంలో చాలా మంది హౌస్ లో ప్రశాంత్ కి మద్దతుగా ఉన్న శివాజీ అరెస్టు విషయంలో స్పందించరేమి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రశాంత్ అరెస్టుపై శివాజీ స్పందించారు. ప్రశాంత్ నిందితుడు కాదు..బాధితుడు అంటూ శివాజీ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..”ప్రశాంత్ కి ఏమి కాదు.. చట్టపై గౌరవంతో ఉన్నారు. చట్ట ప్రకారం బయటకు వస్తాడు. ప్రశాంత్ ఎలాంటి వాడో నాకు హౌస్ లో ఉన్నప్పుడు నాకు తెలుసు. వయస్సు ప్రభావంతో, తెలియని తనంతో ర్యాలీలో పాల్గొన్నాడు. దాడుల విషయం అతడికి తెలియదు. అసలు చేసింది ఎవరి అభిమానులో ఎవరికీ కూడా తెలియదు.

ఎవరి అభిమానులు చేసిన కూడా తప్పు తప్పే. ఆ దాడులు చేసే టైమ్ లో ఆ కారుల్లో కుటుంబాలు ఉంటాయి. వారు ఎంతో బాధ పడి ఉంటారు. అంతేకాక వాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో ఉండి ఉంటారు. ఇలా దాడులు చేయడం  అభిమానులు గానీ, ఆ రూపంలో చేసిన మరెవరైనా కానీ తప్పే.  ప్రశాంత్ గురించి నేను పదే పదే మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ అరెస్టు అయిన దగ్గర నుంచి ప్రతి క్షణం ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటున్నాను. కాబట్టి..ప్రతిదీ నేను ఫ్రూవ్ చేసుకోవాల్సిన  అవసరం లేదు. ప్రశాంత్ కి నేనేంటో తెలుసు..నాకు అతడు ఏంటో తెలుసు. రేపు కచ్చితంగా బయటకు వస్తాడని ఆశాభావం వ్యక్తంచేస్తున్నాను.

రేపు కాకపోతే.. మరో రెండు రోజులు ఆలస్యమైన బయటకు వస్తాడు.  ప్రశాంత్ నేరస్థుడు కాదు.. నేరం చేశాడనే ఆరోపణ మోపబడిన వ్యక్తి మాత్రమే. ప్రశాంత్ కుటుంబ సభ్యులతో నిత్యం టచ్ లోనే ఉన్నాను. సోషల్ మీడాయలో థంబ్స్ కూడా దారుణంగా పెడుతున్నారు. అలా అలాంటి టైటిల్స్ పెట్టుకుని డబ్బులు సంపాదించాలని కోరుకోవడం ఎంత వరకు కరెక్ట్.. ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ప్రశాంత్ నేరస్థుడు కాదు.. బాధితుడు” అంటూ శివాజీ చెప్పుకొచ్చారు. మరి.. శఇవాజీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments