Venkateswarlu
పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడని, ఫోన్ స్విచ్చాఫ్‌లో పెట్టుకున్నాడని వార్తలు వస్తున్నాయి. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ప్రశాంత్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడని, ఫోన్ స్విచ్చాఫ్‌లో పెట్టుకున్నాడని వార్తలు వస్తున్నాయి. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ప్రశాంత్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
Venkateswarlu
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్, అన్నపూర్ణస్టూడియో దగ్గర చోటు చేసుకున్న ఘర్షణల కేసులో పోలీసులు ప్రశాంత్ పేరును ఏ1గా నమోదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్లాడని, ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేశాడని వార్తలు వస్తున్నాయి. అయితే, నిన్న ప్రశాంత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో..
రైతు బిడ్డ గెలిచిండని మా ఊరు ఘన స్వాగతం పలికింది. నాకోసం వచ్చిన జనాన్ని చూసి నేను చాలా సంతోషించాను. ఆ సంతోషం ఎక్కువ సేపు లేకుండా చేయాలని చూస్తున్నారు. బాధగా ఉంది. ఏడుద్దామంటే కూడా నెగిటివ్ చేస్తారని నాకు భయం వేస్తోంది. నేను చేసిన తప్పేంటి? రైతు బిడ్డ చేసిన తప్పేంటి? పల్లవి ప్రశాంత్ ఏంటో జనాలకు తెలుసు. పల్లవి ప్రశాంత్ తప్పు చేయడు’’ అని పేర్కొన్నాడు. అయినా అతడిపై వార్తలు ఆగలేదు. అజ్ఞాతంలోంచే ఆ వీడియో విడుదల చేశాడని పుకార్లు వచ్చాయి.
ఇలాంటి సమయంలో ప్రశాంతి కథకు బిగ్ ట్విస్ట్‌ను ఇచ్చాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఇంటి దగ్గరే ఉన్నానంటూ ఓ వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోను బుధవారం మధ్యాహ్నం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో.. ‘‘ అన్నా నేను ఎక్కడికీ పోలేదు. అవన్నీ తప్పుడు వార్తలు. నేను మా ఇంటి దగ్గరే ఉన్నాను. బరాబర్ ఇంటికాడనే ఉన్నా. అన్నా వాళ్లు కూడా ఇక్కడే ఉన్నారు. కావాలంటే వారితో మాట్లాడిస్తాను. స్వామీ మీరే చెప్పాలి. నేను పరారీలో ఉన్నాను అంటున్నారు. మీరే చెప్పండి” అంటూ తన పక్కన ఉన్న స్వాములతో మాట్లాడించాడు.
తనను కలవడానికి వేరు వేరు ప్రాంతాల నుంచి చాలా మంది వస్తున్నారని అన్నాడు. తాను ఎక్కడికీ వెళ్లలేదని.. తన వల్ల ఎవ్వరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలని విజ్ఞప్తి చేశాడు. తాను ఏ తప్పూ చేయలేదని, ఎవరెవరో చేసినవి తన మీద వేస్తున్నారని అన్నాడు. కావాలని తనను నెగెటివ్ చేయడానికే ఇవన్నీ చేస్తున్నారని చెప్పాడు. తాను ఎక్కడికీ పోనని, పరారీలో ఉన్నానంటూ వచ్చిన న్యూస్ చూసి తానే షాక్ అయ్యానని చెప్పాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఫోనే పట్టుకోలేదని తెలిపాడు. తాను ఇంటి దగ్గరే ఉన్నానని, ఎక్కడికీ పోలేదని వెల్లడదించాడు. టెన్షన్ పడకండంటూ ఫ్యాన్స్‌కు సూచన చేశాడు.
కాగా, ఆదివారం పల్లవి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే జరిగింది. బిగ్‌బాస్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు పెద్ద ఎత్తున కంటెస్టెంట్ల అభిమానులు చేరుకున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పల్లవి ప్రశాంత్ అభిమానులు స్టూడియో దగ్గరకు వచ్చారు. ప్రశాంత్ విన్నర్‌గా గెలుస్తాడన్న నమ్మకంతో అక్కడే ఉండిపోయారు. ప్రశాంత్‌ను విన్నర్‌గా ప్రకటించిన తర్వాత సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో షో ముగిసి కంటెస్టెంట్లతో పాటు మరికొంత మంది సెలెబ్రిటీలు బయటకు వస్తూ ఉన్నారు.
ముందుగా బిగ్‌బాస్ 7 రన్నర్ అప్ అమర్ దీప్ తన ఫ్యామిలీతో కారులో బయటకు వస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఆయన కారుపై దాడికి దిగారు. అద్దాలు పగుల గొట్టారు. కొన్ని నిమిషాల పాటు కారును ఎక్కడికీ కదలనీయలేదు. లోపల ఉన్న అమర్ దీప్‌తో పాటు భార్య, అమ్మ, స్నేహితుడిపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న అమర్ దీప్ ఫ్యాన్స్ రంగంలోకి దిగటంతో పరిస్థితి విషమించింది. రెండు వర్గాలు దాడులకు పూనుకున్నాయి. ఆర్టీసీ బస్సును సైతం ధ్వంసం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భద్రత ఇచ్చి అమర్ దీప్ కారును అక్కడినుంచి పక్కకు పంపించేశారు. అప్పటికి కూడా స్టూడియో బయట పరిస్థితి దారుణంగానే ఉంది. దీంతో పోలీసులు, బిగ్ బాస్ యజమాన్యం.. ప్రశాంత్‌కు ఓ విజ్ఞప్తి చేశారు. బయట పరిస్థితులు బాగోలేని కారణంగా వేరే మార్గం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ప్రశాంత్ వారి ఆదేశాలను పట్టించుకోకుండా ఫ్యాన్స్ ఉన్న వైపునుంచే ఓపెన్ టాప్ కారులో బయటకు వచ్చాడు.
ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లిపోయాడు. తమ ఆదేశాలను ఖాతరు చేయని ప్రశాంత్‌పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. మరి, పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడంటూ వస్తున్న వార్తలపై స్వయంగా ప్రశాంతే క్లారిటీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.