Arjun Suravaram
వైఎస్సార్ సీపీ కీలక నేతల్లో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఒకరు. ఇటీవల వైసీపీలో చోటుచేసుకున్న పరిణామాల కారణంగా ఆయనను నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో తొలిసారిగా నెల్లూరులోకి సాయిరెడ్డి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.
వైఎస్సార్ సీపీ కీలక నేతల్లో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఒకరు. ఇటీవల వైసీపీలో చోటుచేసుకున్న పరిణామాల కారణంగా ఆయనను నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో తొలిసారిగా నెల్లూరులోకి సాయిరెడ్డి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.
Arjun Suravaram
సాధారణంగా సినీ ప్రముఖులు ఏదైనా ప్రాంతానికి వెళ్లినప్పుడు భారీ సంఖ్యలో జనం వస్తుంటారు. అలానే ఆ సెలబ్రిటీ వెంట పెద్ద సంఖ్యలో కార్లు ఉంటాయి. అలానే భారీ గజమాలలు, పూల వానలు కురిపించడం అనేక సినిమాల్లో చూశాం. ఇలా సినిమా హీరోలు, సినిమా షూటింగ్స్ విషయంలో మాత్రం ఎక్కువగా కనిపిస్తుంటాయి. తాజాగా వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపి.. వి విజయసాయిరెడ్డి.. సినిమా రేంజ్ ను తలపించింది. అసలు.. స్టార్ హీరో ఎవరైనా నెల్లూరు వెళ్తున్నారా అన్నట్లు.. ఆయన ర్యాలీ జరిగింది. నెల్లూరు పెద్దారెడ్డి ఎంట్రీ అంటే మాములుగా ఉండదని.. సాయిరెడ్డి ర్యాలీని చూసిన వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఎంట్రీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
వైఎస్సార్ సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి నెల్లూరు ఎంట్రీ అదిరిపోయింది. రాష్ట్రం మొత్తం నెల్లూరు వైపు చూసేలా సాయిరెడ్డి అక్కడికి ఎంట్రీ ఇచ్చారు. తొలిసారి నెల్లూరు గడ్డపై అడుగు పెట్టి తన మార్కు చూపించారు. ఎంట్రీతోనే తన క్రేజ్ చూపించిన విజయసాయిరెడ్డి.. నెల్లూరు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమా షూటింగ్, ఏదో స్టార్ హీరో ఎంట్రీ రేజ్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నెల్లూరులోకి అడుగు పెట్టారు. నెల్లూరులో విజయ సాయిరెడ్డి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విజువల్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇదెక్కడి మాస్ రా మామా అంటూ నోరెళ్ల బెట్టేలా చేశాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 600 కార్లలో విజయసాయిరెడ్డి నెల్లూరులోకి గ్రాండ్ గా అడుగు పెట్టారు.
కావలి నుంచి 600 కార్లతో భారీగా ర్యాలీగా సింహపురి జిల్లాలోకి అడుగు పెట్టారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగాక మొదటి సారి జిల్లాలో అడుగు పెట్టిన సాయిరెడ్డికి నెవర్ బీఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్ లో స్వాగతం పలికారు.. ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు. కార్లతో ర్యాలీ అనంతరం ఆయనకు గజమాల వేసి.. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. ఇలా గ్రాండ్ ఎంట్రీగా నెల్లూరు జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇక పార్టీ ఆఫీస్ ను ప్రారంభించిన సాయిరెడ్డి..నెల్లూరు పార్లమెంట్ ఇన్ ఛార్జీగా బాధ్యతలు స్వీకరించారు. ఎంట్రీకి ఏమాత్రం తగ్గకుండా సాగింది..విజయసాయిరెడ్డి నెల్లూరు పర్యటన.
పుట్టిన గడ్డపై నుంచి పోటీ చేయడం చాలా సంతోషంగా ఉంది. గెలిచి..జిల్లా ప్రజలు గుర్తుంచుకునేలా సేవలు చేస్తాని స్వీట్ గా తన ప్రసంగాని ప్రారంభించారు. ఆ తరువాత ప్రతిపక్ష కూటమిగా ఘాటుగా స్పందించారు. ఎన్ని కూటములు వచ్చినా, ఎంతమంది ప్రశాంత్ కిషోర్లు వచ్చినా.. సింగిల్ కింగ్ జగన్ ను ఏం చేయలేరని, 175 స్థానాల్లో గెలవబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంట్రీ విజయోత్సవ ర్యాలీ సూపర్ హిట్ అయ్యింది. విజయ సాయిరెడ్డి ఎంట్రీనే విజయోత్సవ ర్యాలీలా ఉందంటూ ఉప్పొంగిపోతున్నారు వైసీపీ శ్రేణులు. మొత్తంగా విజయసాయి రెడ్డి ఎంట్రీ చూసి ప్రతిపక్ష కూటమి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంటూ వైసీపీ శ్రేణులు అంటున్నాయి. విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంట్రీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.